ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ప్ర‌భుత్వ‌, ప్రైవేటు భాగ‌స్వామ్యం (పిపిపి) ప్రాజెక్టుల కోసం నియ‌మించిన లావాదేవీ స‌ల‌హాదారుల (టిఎలు) జాబితా గురించి కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల అధికారుల‌ను చైత‌న్య‌ప‌రిచేందుకు వ‌ర్క్‌షాప్ నిర్వ‌హించిన డిఇఎ మౌలిక స‌దుపాయాల ఆర్థిక సెక్ర‌టేరియేట్‌

Posted On: 25 AUG 2022 7:12PM by PIB Hyderabad

దేశంలో మౌలిక స‌దుపాయాల అభివృద్ధిని పెంపొందించే ప్ర‌య‌త్నానికి కొన‌సాగింపుగా, కేంద్ర మౌలిక స‌దుపాయాల లైన్ మంత్రిత్వ శాఖ‌ల ( సంబంధిత‌), రాష్ట్ర‌, కేంద్ర పాలిత ప్రాంత అధికారుల‌కు పిపిపి ప్రాజెక్టుల కోసం నియామ‌కానికి ఎంపిక చేసిన లావాదేవీ స‌ల‌హ‌దారుల‌కు సంబంధించి అవ‌గాహ‌న క‌ల్పించేందుకు  ఆర్థిక మంత్రిత్వ శాఖ‌కు చెందిన‌  ఆర్ధిక వ్య‌వ‌హారాల విభాగం (డిఇఎ)లో భాగ‌మైన మౌలిక స‌దుపాయాల ఆర్థిక సెక్ర‌టేరియేట్ గురువారం వ‌ర్క్‌షాప్‌ను నిర్వ‌హించింది. కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు చెందిన 250+మందికి పైగా ప్ర‌తినిధులు ఈ వ‌ర్క్‌షాప్‌కు హాజ‌ర‌య్యారు. 
దేశంలో మౌలిక స‌దుపాయాల‌ను అభివృద్ధిని ప్రోత్స‌హించ‌డంలో పిపిపిల కీల‌క పాత్ర‌ను గురించి, కేంద్ర ప్ర‌భుత్వం చేప‌ట్టిన ప్ర‌ముఖ చొర‌వ‌ల గురించి వ‌ర్క్‌షాప్ లో అధికారుల‌ను చైత‌న్య‌ప‌రిచారు. బ్యాంక‌బుల్ (బ్యాంకులు అనుమ‌తించే) ప్రాజెక్టులను వ్య‌వ‌స్థీకృతం చేసేందుకు నియ‌మించిన లావాదేవీ స‌ల‌హాదారుల నుంచి మ‌ద్ద‌తు తీసుకోవ‌చ్చ‌ని అధికారుల‌ను డిఇఎ చైత‌న్య‌ప‌రిచింది. లావాదేవీ స‌ల‌హాదారుల‌ను/ క‌న్స‌ల్టెంట్ల నియామ‌క ప్ర‌క్రియ‌ను సులువుగా, స‌మ‌ర్ధ‌వంతంగా, ప్ర‌భావ‌వంతంగా చేసేందుకు ఎంపానెల్‌మెంట్ చేయ‌డం జ‌రిగింది. 
పిపిపి ప్రాజెక్టుల‌కు, అలాగే ప్యానెల్‌ను ఉప‌యోగించుకునేందుకు డిఇఎ అంటే, లావాదేవీ స‌ల‌హాదారులు అభివృద్ధి చేసిన నిబంధ‌న ప‌త్రం (మాన్యువ‌ల్‌) గురించి కూడా చూత‌న్య‌ప‌ర‌చడం జ‌రిగింది. ఈ నిబంధ‌న ప‌త్రం ద‌శ‌ల‌వారీ మార్గ‌ద‌ర్శ‌నం.  లావాదేవీ స‌ల‌హాదారును క‌లుపుకునేందుకు ప్రాజెక్టు పోష‌క అధికారులు ప్ర‌స్తావించేందుకు వీలైన ప‌త్రం. ఈ ప్ర‌క్రియ‌లో ఉండే ద‌శ‌లు - ప్రాజెక్టు అవ‌స‌రాల‌ను నిర్ధారించ‌డం; ఆ కేటాయించిన ప‌ని ల‌క్ష్యాల‌ను నిర్వచించ‌డం, ఆ ప‌నికి ఉల్లేఖ‌న నిబంధ‌న‌ల‌ను అభివృద్ధి చేయ‌డం, అర్హ‌త క్రైటీరియాను నిర్వ‌చించ‌డం, ప్రాజెక్టు అమ‌లుకు కీల‌క సిబ్బందిని గుర్తించ‌డం, ఉల్లేఖ‌న నిబంధ‌న‌ల‌ను ముద్రించ‌డం వంటి దిశ‌ల గురించి అధికారుల‌కు వివ‌రించారు. 
 ఆర్థికంగా స‌మ‌ర్ధించిన‌ప్ప‌టికీ, వాణిజ్య‌ప‌రంగా లాభ‌దాయం కాని ప్రాజెక్టుల‌కు తోడ్ప‌డేందుకు వ‌య‌బిలిటీ గ్యాప్ ఫండింగ్ ( నిధుల అంత‌ర సాధ్య‌త - విజిఎఫ్‌) ప‌థ‌కం, లావాదేవీ స‌ల‌హాదారును నియ‌మించుకోవ‌డం స‌హా పిపిపి ప్రాజెక్టు అభివృద్ధికి అవ‌స‌ర‌మ‌య్యే వ్య‌య స‌హాయం కోసం ది ఇండియా ఇన్ ఫ్రాస్ట్ర‌క్చ‌ర్ ప్రాజెక్ట్ డెవ‌ల‌ప్‌మెంట్ ఫండ్ (ఐఐపిడిఎఫ్‌) కూడా క‌లిపిన  పిపిపిల‌కు ఆర్థిక మ‌ద్ద‌తు కోసం డిఇఎ ప‌థ‌కాల గురించి అధికారుల‌కు వివ‌రించారు. 
వ‌ర్క్‌షాప్‌లో కేంద్ర‌, రాష్ట్ర‌/  కేంద్ర పాలిత ప్రాంత ప్ర‌భుత్వ అధికారులు చురుగ్గా పాల్గొన‌డ‌మే కాక పాల్గొన్న‌వారికి వ‌చ్చిన ర‌సందేహాల‌ను ప‌రిష్క‌రించ‌డం జ‌రిగింది.  టిఎ ప్యానెల్‌, విజిఎఫ్ ప‌థ‌కాలు, ఐఐపిడిఎఫ్ ప‌థ‌కాల‌కు సంబంధించిన మ‌రింత స‌మాచారం పిపిపిఇన్ఇండియా. గ‌వ్‌. ఇన్ (pppinindia.gov.in.)లో అందుబాటులో ఉంటుంది. 

 

***
 


(Release ID: 1854608)
Read this release in: English , Urdu , Hindi , Punjabi