పి ఎమ్ ఇ ఎ సి
భారత్@100 కోసం పోటీతత్వ రోడ్‌మ్యాప్‌ను విడుదల చేయనున్న ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి (EAC-PM)
Posted On:
25 AUG 2022 11:59AM by PIB Hyderabad
భారత్@100 కోసం కాంపిటేటివ్‌నెస్ రోడ్‌మ్యాప్‌ను ప్రధానమంత్రి ఆర్థిక సలహామండలి 30 ఆగస్ట్ 2022న విడుదల చేయనుంది. ఈ రోడ్‌మ్యాప్‌ను ఈఏసీ-పీఎం, ఇన్‌స్టిట్యూట్ ఫర్ కాంపిటేటివ్‌నెస్ సంయుక్తంగా తయారు చేశాయి. దీనికి డా. అమిత్ కపూర్, ప్రొఫెసర్ మైఖేల్ ఈ. పోర్టర్, డా.క్రిస్టియన్ కేటెల్స్(హార్వర్డ్ బిజినెస్ స్కూల్) అధ్యక్షత వహించారు.
ఈఏసీ-పీఎం రూపొందించిన ఈ రోడ్‌మ్యాప్ పత్రాన్ని డాక్టర్ బిబేక్ దేబ్రాయ్, ఛైర్మన్ ఈఏసీ-పీఎం, అమితాబ్ కాంత్, షెర్పా, జీ-20, సంజీవ్ సన్యాల్, సభ్యులు ఈఏసీ-పీఎం సమక్షంలో విడుదల చేయబడుతుంది. ఈ కార్యక్రమానికి ఇన్‌స్టిట్యూట్ ఫర్ కాంపిటీటివ్‌నెస్, విజిటింగ్ లెక్చరర్, స్టాన్‌ఫోర్డ్ యూనివర్శిటీ గౌరవాధ్యక్షుడు డాక్టర్ అమిత్ కపూర్ కీలకోపన్యాసం చేయనున్నారు; హార్వర్డ్ బిజినెస్ స్కూల్‌కు చెందిన ప్రొఫెసర్ మైఖేల్ ఇ. పోర్టర్ మరియు డాక్టర్ క్రిస్టియన్ కెటెల్స్, డాక్టర్ బిబేక్ దేబ్రాయ్, అమితాబ్ కాంత్ మరియు సంజీవ్ సన్యాల్ ప్రసంగించనున్నారు. ఈ విడుదలలో చొరవలో భాగంగా ఏర్పాటైన స్టేక్‌హోల్డర్ గ్రూప్ సభ్యుల ప్యానెల్ చర్చ కూడా ఉంటుంది. ప్యానెల్‌లో హరి మీనన్, డైరెక్టర్ ఇండియా కంట్రీ ఆఫీస్, బీఎంజీఎఫ్; రవి వెంకటేశన్, గ్లోబల్ ఎనర్జీ అలయన్స్ ఫర్ పీపుల్ అండ్ ప్లానెట్ చైర్మన్; గురుచరణ్ దాస్, రచయిత; సుమంత్ సిన్హా, ఛైర్మన్ & ఎండీ, రెన్యూ పవర్ మరియు ఇతరులు ఉండనున్నారు.
భారత్@100 కోసం పోటీతత్వ రోడ్‌మ్యాప్ ప్రొఫెసర్ మైఖేల్ ఇ. పోర్టర్ అభివృద్ధి చేసిన ఫ్రేమ్‌వర్క్‌పై ఆధారపడింది. భారత్@100 అనేది మన దేశం యొక్క శతాబ్ది సంవత్సరానికి సంబంధించిన ప్రయాణానికి ఒక రోడ్‌మ్యాప్, ఇది మన దేశం కోసం మీరు వివరించిన విస్తారమైన సామర్థ్యాన్ని మరియు భారీ ఆశయాలను సాకారం చేసుకోవడానికి అవసరమైన దశలను గుర్తిస్తుంది. 2047 నాటికి భారతదేశం అధిక-ఆదాయ దేశంగా అవతరించే మార్గాన్ని తెలియజేయడానికి, మార్గనిర్దేశం చేయడానికి రోడ్‌మ్యాప్ వివరిస్తుంది. ఇది సామాజిక పురోగతి మరియు భాగస్వామ్య శ్రేయస్సులో పొందుపరిచిన సుస్థిరత మరియు స్థితిస్థాపకత దిశలో భారతదేశ ఆర్థిక వ్యవస్థను మరింత ముందుకు తీసుకెళ్లడానికి విధాన లక్ష్యాలు, సూత్రాలు ప్రతిపాదిస్తుంది. భారతదేశ ప్రస్తుత ఆర్థిక స్థితి మరియు పోటీ ప్రయోజనాలను క్షుణ్ణంగా పరిశీలించడంపై ఆధారపడిన ప్రాధాన్య కార్యక్రమాల సమగ్ర ఎజెండాను రోడ్‌మ్యాప్ అందిస్తుంది. ఇటీవలి సంవత్సరాలలో మీ ప్రభుత్వం అమలులోకి తెచ్చిన అనేక సంస్కరణల ఆధారంగా, భారతదేశం ఇప్పుడు ఏ చర్యలకు ప్రాధాన్యత ఇవ్వాలి మరియు ఈ చర్యలను సమర్థవంతంగా అందించడానికి ఎలా నిర్వహించాలి అనే రెండింటినీ ఇది సూచిస్తుంది.
భారతదేశ వృద్ధిని మరింత ముందుకు నడిపించడానికి, దీర్ఘకాలికంగా దానిని కొనసాగించడానికి పోటీతత్వ విధానం భారతదేశ ఆర్థిక మరియు సామాజిక విధానానికి మూలస్తంభంగా ఉపయోగపడుతుందని కూడా ఈ పత్రం చెబుతుంది.
విడుదల కార్యక్రమం ఇందిరా గాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ఆర్ట్స్ (IGNCA), జనపథ్, న్యూఢిల్లీలో ఉదయం 11:00 గంటలకు జరుగుతుంది. యూట్యూబ్ లో ఈ కార్యక్రమాన్ని www.YouTube.com/arthsastra లో ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించవచ్చు.
***
(Release ID: 1854524)
Visitor Counter : 211