కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఎంసీఏ 21 వెర్షన్-3 ఆధునీకరణ

Posted On: 24 AUG 2022 2:57PM by PIB Hyderabad
విధానాలను మరింత పటిష్టంగా అమలు చేసి, సులభతర వ్యాపార నిర్వహణను ప్రోత్సహించి, వినియోగదారులు మరింత సులభంగా వినియోగించేందుకు వీలుగా సాంకేతికతో  ఎంసీఏ 21  వెర్షన్-3.0 ను రూపొందించడం జరిగింది. ఎటువంటి అంతరాయం లేకుండా  నిబంధనల ప్రకారం  పత్రాలను దాఖలు చేసేందుకు ఎంసీఏ 21  వెర్షన్-3.0 సహకరిస్తుంది. దశలవారీగా ఎంసీఏ 21  వెర్షన్-3.0 ను అమలులోకి తీసుకు రావాలని నిర్ణయించారు. 
తొమ్మిది రకాల కంపెనీ ఫారమ్‌లు (CHG-1, CHG-4, CHG-6, CHG-8, CHG-9, DIR-3 KYC, DIR-3 KYC WEB, DPT-3 మరియు DPT-4)  01.09.2022 (00:00 గంటలు) నుండి ప్రత్యక్షంగా అనుంగుబాటులోకి వస్తాయి. మిగిలిన కంపెనీ ఫారమ్‌లు మరియు ఇ-అడ్జుడికేషన్, కంప్లయన్స్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ వంటి ఇతర మాడ్యూళ్ళను  ఈ ఏడాది అందుబాటులోకి తెచ్చేందుకు ప్రణాళిక రూపొందింది. 
కంపెనీ ఫారమ్‌లు ధాఖలు చేసేందుకు ఎంసీఏ 21  వెర్షన్-3.0 ను ప్రారంభిస్తున్న నేపథ్యంలో 27 ఆగస్టు (00. 00 గంటలు) నుంచి ఆగస్టు 28 వ తేదీ(23.59 గంటలు) వరకు  ఎంసీఏ 21   వి -3  ఎల్ఎల్ పి దాఖలు చేసేందుకు అందుబాటులో ఉండదు. అయితే, కంపెనీ ఫారమ్‌లు ధాఖలు చేసేందుకు  ఎంసీఏ 21   వి -2 అందుబాటులో ఉంటుంది.  

 ఈ 09 ఫారమ్‌ల కోసం తరచుగా అడిగే ప్రశ్నలు (FAQలు) మరియు డెమో MCA ( www.mca.gov.in ) వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి . ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ICAI) మరియు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా (ICSI) సహకారంతో సంబంధిత వర్గాలకు  అవగాహన కల్పించడానికి అనేక వెబ్‌నార్లు నిర్వహించబడ్డాయి.

 ఇ.బుక్ , ఇ. కన్సల్టేషన్ మాడ్యూల్స్ మరియు పునరుద్ధరించబడిన వెబ్‌సైట్ ప్రారంభం కావడంతో 24 మే 2021న మొదటి దశ అమలు పూర్తయింది.  .
ఫేజ్-2లో భాగంగా అన్ని L ఎల్ఎల్ పి ల దాఖలుకు సహకరించే  ఎల్ఎల్ పి మాడ్యూల్ 
2022 మార్చి 08 న ప్రారంభించబడింది.

***


(Release ID: 1854272) Visitor Counter : 175


Read this release in: Malayalam , English , Urdu , Hindi