శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
ఈరోజు విడుదలైన ‘విజ్ఞాన ప్రగతి’ ప్రత్యేక సంచిక
ఎన్ ఐ ఎస్ సి పి ఆర్ ప్రత్యేక సంచికలో సైన్స్ ప్రాచుర్యంలో నిమగ్నమైన భారతీయ సంస్థలు గురించిన అంశాలు
Posted On:
23 AUG 2022 6:13PM by PIB Hyderabad
సి ఎస్ ఐ ఆర్ - నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ కమ్యూనికేషన్ అండ్ పాలసీ రీసెర్చ్ (CSIR-NIScPR), న్యూఢిల్లీ తన పాపులర్ సైన్స్ హిందీ మ్యాగజైన్ “విజ్ఞాన్ ప్రగతి” ప్రత్యేక సంచిక విడుదల కార్యక్రమాన్ని 23 ఆగస్టు 2022న నిర్వహించింది. ఎన్ ఐ ఎస్ సి పి ఆర్ (NIScPR)కి చెందిన ఈ ప్రముఖ మ్యాగజైన్ ప్రజలలో సైన్స్‌ను వ్యాప్తి చేయడంలో 2022 సంవత్సరంలో అద్భుతమైన 70 సంవత్సరాలను పూర్తి చేసింది. ఈ పత్రిక యొక్క మొట్టమొదటి సంచిక ఆగష్టు, 1952లో ప్రచురించబడింది. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగం వెలువరించిన ఈ ప్రత్యేక సంచికలో (ఆగస్టు 2022) 'విజ్ఞాన్ ప్రగతి'లో సైన్స్ ప్రాచుర్యంలో నిమగ్నమైన భారతదేశంలోని ప్రముఖ సంస్థలు గురించిన వ్యాసాలు ఉన్నాయి. ఈ ప్రత్యేక సంచికలో ప్రభుత్వం మరియు స్వచ్ఛంద సంస్థలు రెండింటికి సంబందించిన సమగ్రమైన సమాచారం వుంది.
‘విజ్ఞాన్ ప్రగతి’ మ్యాగజైన్ ప్రత్యేక సంచిక విడుదల, సైన్స్ ప్రాచుర్యంలో నిమగ్నమైన భారతీయ సంస్థలపై ఈ ప్రత్యేక సంచిక దృష్టి సారించింది.
శాస్త్ర విజ్ఞానం వెలుగుతో దుష్ప్రచారాల అంధకారాన్ని పారద్రోలే సంకేతంగా జ్యోతి ప్రజ్వలనం తో కార్యక్రమాన్ని ప్రారంభించారు. సిఎస్ఐఆర్-ఎన్ ఐ ఎస్ సి పి ఆర్ (NIScPR) డైరెక్టర్ ప్రొఫెసర్ రంజన అగర్వాల్ ముఖ్య అతిథి డాక్టర్ శేఖర్ సి మండే మరియు గౌరవ అతిథి డాక్టర్ షర్మిలా మండేలకు ఘనంగా స్వాగతం పలికారు. ఆమె తన ప్రసంగంలో సైన్స్ మ్యాగజైన్ 'విజ్ఞాన్ ప్రగతి' యొక్క గొప్ప వారసత్వాన్ని మరియు సైన్స్ ప్రాచుర్యంలో సిఎస్ఐఆర్-ఎన్ ఐ ఎస్ సి పి ఆర్ యొక్క సహకారాన్ని వివరించారు. పాశ్చాత్య సంస్కృతిలో సైన్స్ సమగ్ర భాగం కాదని ఆమె అన్నారు. భారతదేశం పురాతన కాలం నుండి విజ్ఞాన శాస్త్రాన్ని అభ్యసిస్తోంది మరియు మన దేశానికి గొప్ప శాస్త్రీయ వారసత్వం మరియు సాంప్రదాయ జ్ఞానం సంపద ఉంది. ఆమె పందొమ్మిదవ శతాబ్దంలో సైన్స్ ప్రాచుర్యంలో ముఖ్యమైన పాత్ర పోషించిన ఆచార్య పి.సి. రే ని కొనియాడారు.
గౌరవ అతిథి డాక్టర్ షర్మిలా మండే, టి సి ఎస్ రీసెర్చ్ & ఇన్నోవేషన్ చీఫ్ సైంటిస్ట్, ప్రాంతీయ భాషల్లో సైన్స్ కమ్యూనికేషన్ పాత్రను గుర్తు చేశారు. ఈ విధంగా, సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో ఆవిష్కరణలు సమాజంలోని విస్తృత స్థాయి లో జన బాహుళ్యానికి చేరుకోగలవని ఆమె తెలిపారు. ముఖ్య అతిథి డాక్టర్ శేఖర్ సి. మండే, డిఎస్ ఐ ఆర్ మాజీ సెక్రటరీ & సి ఎస్ ఐ ఆర్ మాజీ డైరెక్టర్ జనరల్ దేశ ప్రగతిలో సైన్స్ మరియు శాస్త్రీయ దృక్పథం పాత్రను నొక్కి చెప్పారు. గొప్ప శాస్త్రీయ చరిత్ర ఉన్నప్పటికీ, సైన్స్ పట్ల ప్రజల సాధారణ అవగాహన గురించి ఆయన ఆందోళన చెందారు. శాస్త్రీయ సమాజానికి, సమాజానికి మధ్య ఇప్పటికీ అంతరం ఉందని ఆయన పేర్కొన్నారు. సైన్స్‌ను తెలియజేసేంత వరకు పూర్తి శాస్త్ర సాంకేతిక ప్రగతి సాధన పూర్తి కాదని ఆయన అన్నారు. ఇంకా, సమాజ శ్రేయస్సు కోసం సి ఎస్ ఐ ఆర్ సంస్థలు సాధించిన చారిత్రక విజయాలను నొక్కి చెప్పారు. అన్ని వేళలా అదే సమయంలో అయినా వలస కాలం లేదా కోవిడ్ మహమ్మారి లేదా ఏదైనా ప్రకృతి విపత్తు యొక్క సవాలు సమయం అయినా సైన్స్‌కు నిత్యం సవాళ్లు ఎన్నో ఎదురవుతుంటాయని, అయినప్పటికీ సి ఎస్ ఐ ఆర్ తన బాధ్యత నుండి ఎప్పుడూ వెనక్కి తగ్గలేదని ఆయన అన్నారు. సి ఎస్ ఐ ఆర్ సేవ సహాయ సహకారాల గురించి ఎవరికీ తెలియకపోవచ్చు కానీ తెలియకుండానే సి ఎస్ ఐ ఆర్ ప్రతి ఒక్కరి రోజువారీ జీవితంలో భాగం. డాక్టర్ శేఖర్ గత 70 ఏళ్లలో ‘విజ్ఞాన్ ప్రగతి’ అందించిన సేవలను గుర్తుచేసుకున్నారు. ఈ మ్యాగజైన్‌తో పాటు దాని ప్రసిద్ధ సైన్స్ సమచారం సామాన్య ప్రజలకు విస్తృతంగా చేరాలని అన్నారు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 100 ఏళ్లు పూర్తి చేసుకోనున్న రాబోయే 25 ఏళ్లలో దేశ భవిష్యత్తును ఇది నిర్ణయిస్తుంది.
‘విజ్ఞాన ప్రగతి’ ప్రత్యేక సంచిక ముఖచిత్రం (ఆగస్టు 2022)
కార్యక్రమం ముగింపులో, సిఎస్ఐఆర్-ఎన్ ఐ ఎస్ సి పి ఆర్ శాస్త్రవేత్త డాక్టర్ మనీష్ మోహన్ గోర్ మరియు ఎడిటర్, విజ్ఞాన్ ప్రగతి ధన్యవాదాలు తెలిపారు. పత్రిక ప్రత్యేక సంచిక లోని ముఖ్యాంశాల గురించి సంక్షిప్త వివరణను అందించారు. మ్యాగజైన్ ప్రత్యేక సంచిక (ఆగస్టు 2022)లో దేశవ్యాప్తంగా సైన్స్ ప్రచారం చేస్తూ ప్రజాదరణ కోసం పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థలు మరియు ప్రభుత్వ సంస్థలు గురించిన వ్యాసాలు ఉన్నాయి. స్వాతంత్య్రం రాకముందే కొన్ని సంస్థలు సైన్స్‌కు ప్రాచుర్యం కల్పించాలని భావించి సైన్స్‌ని సామాన్య ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశాయని చెప్పారు. దేశంలోని విస్తృత ప్రజా బాహళ్యానికి సైన్స్ చేరువయ్యేలా సమాజంలోకి లోతుగా చొచ్చుకుపోయేలా ‘విజ్ఞాన్ ప్రగతి’ పనిచేస్తుందని ఆయన హామీ ఇచ్చారు.
******
(Release ID: 1854001)
Visitor Counter : 243