జల శక్తి మంత్రిత్వ శాఖ
మరో మైలురాయి సొంతం: లక్షకు పైగా ఓడీఎఫ్ ప్లస్ గ్రామాలు
లక్షకు పైగా ఓడీఎఫ్ ప్లస్ గ్రామాలతో దేశం ఘనత
SBM-G పరిశుభ్రత, సురక్షితమైన పారిశుధ్యాన్ని ప్రోత్సహించడానికి, దాని ద్వారా పౌరుల జీవన నాణ్యతను మెరుగుపరచడానికి ప్రభుత్వ నిబద్ధతను బలపరుస్తుంది
Posted On:
19 AUG 2022 3:16PM by PIB Hyderabad
భారత ప్రభుత్వం యొక్క ప్రధాన కార్యక్రమం స్వచ్ఛ్ భారత్ మిషన్ గ్రామీణ్ (SBM-G), నేడు మరో మైలురాయిని సొంతం చేసుకుంది. దేశవ్యాప్తంగా మొత్తం 1,01,462 గ్రామాలు ODF (బహిరంగ మలవిసర్జన రహిత) ప్లస్ గ్రామాలుగా ప్రకటించుకున్నాయి. ఈ గ్రామాలు ఓడీఎఫ్ స్థితిని కొనసాగిస్తునే, ఘన/ ద్రవ వ్యర్థాలను నిర్వహించడానికి వ్యవస్థలను కలిగి ఉన్నాయి. గ్రామాలు పరిశుభ్రంగా, పచ్చదనంతో పాటు ఆరోగ్యవంతంగా మార్చేందుకు పారిశుద్ధ్య ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాయి.
దాదాపు ఎనిమిదేళ్ల క్రితం, గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, మహాత్మా గాంధీ 150వ జయంతి సందర్భంగా ఆయనకు నివాళిని అర్పిస్తూ, దేశాన్ని బహిరంగ మలవిసర్జన రహితంగా మార్చాలనే దృక్పథంతో ఎర్రకోట నుండి స్వచ్ఛ భారత్ మిషన్‌ను ప్రారంభించారు. ప్రధాని నాయకత్వంలో, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రవర్తన మార్పు ప్రచారానికి దేశం మొత్తం కలిసి వచ్చి, దాని లక్ష్యాన్ని సాధించింది. 2019 అక్టోబర్ 2న, ఐక్యరాజ్యసమితి నిర్దేశించిన ఎస్‌డీజీ-6 లక్ష్యం కంటే 11 ఏళ్ల ముందే, గ్రామీణ భారత్ బహిరంగ మలవిసర్జన రహితంగా మారింది. ఇది మిషన్ యొక్క ముగింపు కాదు, ఇది మరింత సవాలుతో కూడిన, ఇంకా అవసరమైన పనిని చేపట్టడానికి పునాది వేసింది; దేశంలోని గ్రామాలను ఓడీ ఎఫ్ ప్లస్‌గా మార్చడానికి సంపూర్ణ స్వచ్ఛత లేదా పూర్తి పరిశుభ్రతను నిర్ధారించాల్సిన అవసరం ఉంది.
ఒక లక్ష ఓడిఎఫ్ ప్లస్ గ్రామాలు ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణ ప్రక్రియ చేపట్టడం, అందులో సాంకేతిక స్వభావం కలిగి ఉండటం వలన, గ్రామీణ భారతదేశానికి ఇది కొత్తది రెండవ తరం సమస్య. అయినప్పటికీ ఒక లక్ష ఓడీఎఫ్ ప్లస్ గ్రామాలు సాధించిన విజయం అపూర్వమైనది. మరుగుదొడ్లు ఏర్పాటు చేయడం వల్ల మల వ్యర్థాలను నిర్వహించాల్సిన అవసరం తీరింది. అలాగే, త్రాగునీటి సరఫరాతో, మరింత గ్రేవాటర్ ఉత్పత్తి చేయబడి, దానిని శుద్ధికరణ అనంతరం ఉపయోగించాలి; గ్రామీణ ప్రాంతాల్లో జీవనశైలిలో మార్పుల కారణంగా, ప్యాక్ చేయబడిన ఆహార ఉత్పత్తుల వాడకంతో, ప్లాస్టిక్ వ్యర్థాల ముప్పు పెరుగుతోంది. దానిని సమర్థవంతంగా నిర్వహించాల్సిన అవసరం ఉంది.
ఇది స్వచ్ఛ్ భారత్ మిషన్-గ్రామీన్ (SBM-G) యొక్క రెండవ దశ. ఈ దశలో గ్రామాలను పరిశుభ్రంగా మార్చడమే కాకుండా, గ్రామీణ గృహాలకు ఆదాయాన్ని సంపాదించడానికి, నూతన జీవనోపాధి అవకాశాల సృష్టి జరుగుతుంది. వీటితో పాటు సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను నెరవేర్చే దిశగా ముందుకు సాగుతుంది. SBM-G పరిశుభ్రత సురక్షితమైన పారిశుధ్యాన్ని ప్రోత్సహించడానికి, దాని ద్వారా పౌరుల జీవన నాణ్యతను మెరుగుపరచడానికి ప్రభుత్వ నిబద్ధతను కలిగి ఉంది.
పథకం ప్రారంభంలో, డీడీడబ్య్లూఎస్ ఒక గ్రామాన్ని ఓడిఎఫ్ ప్లస్‌గా ప్రకటించే ప్రక్రియలో మధ్యంతర దశలను ప్రవేశపెట్టింది. అన్ని గ్రామాలు బయోడిగ్రేడబుల్ వేస్ట్ మేనేజ్‌మెంట్ (BWM), ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ (PWM), గ్రేవాటర్ మేనేజ్‌మెంట్ (PWM), వర్టికల్స్ కింద అన్ని ప్రమాణాలను పూర్తి చేయకపోవచ్చు. ODF ప్లస్ - ఔత్సాహిక కేటగిరీలో నేడు 54,734 గ్రామాలు ఉన్నాయి. వీటిలో అన్ని గృహాలు మరియు సంస్థలు వ్యక్తిగత గృహ మరుగుదొడ్ల ద్వారా పారిశుద్ధ్యానికి ప్రాప్యత కలిగి ఉంటాయి, SWM లేదా LWM కోసం ఏర్పాట్లు ఉన్నాయి; ఓడీఎఫ్ ప్లస్ - రైజింగ్ క్యాటగిరిలో ఉన్నవాట్లో 17121 గ్రామాలు ఉండగా, వీటిలో ఆస్పైరింగ్‌లోని ప్రమాణాలకు అదనంగా LWM మరియు SWM రెండింటికీ ఏర్పాట్లు ఉన్నాయి. ODF ప్లస్ - మోడల్‌గా ప్రకటించబడినవి 29607 గ్రామాలు, వీటిలో పైన పేర్కొన్నవన్నీ ఉన్నాయి. ఇక్కడ ఐఈసీ సందేశాలు ప్రముఖంగా ప్రచారం, డిస్‌ప్లే చేయబడతాయి.
ఇది దేశవ్యాప్తంగా ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణ కోసం ఏర్పాట్లను కలిగి ఉన్న 99640 గ్రామాలకు కూడా మార్చుతుంది; 78937 ద్రవ వ్యర్థ పదార్థాల నిర్వహణ సౌకర్యాలను కలిగి ఉంది; మరియు దాదాపు 57312 గ్రామాలు ఘన మరియు ద్రవ వ్యర్థ పదార్థాల నిర్వహణ ప్లాంట్లను కలిగి ఉన్నాయి. తెలంగాణ, తమిళనాడు, ఒడిశా, ఉత్తరప్రదేశ్ మరియు హిమాచల్ ప్రదేశ్‌లు అత్యధికంగా ఓడీఎఫ్ ప్లస్‌గా ప్రకటించబడిన మొదటి ఐదు రాష్ట్రాలు వరుసగా.
ఘన మరియు ద్రవ వ్యర్థాల నిర్వహణ ప్రక్రియ సాంకేతికమైనది, అదేవిధంగా గ్రామీణ భారతదేశానికి సాపేక్షంగా కొత్తది అయినందున, రాష్ట్రాలకు నిధులు, సాంకేతిక, సామర్థ్య నిర్మాణ మద్దతు రూపంలో సాధ్యమయ్యే అన్ని సహాయాలు అందించబడతాయి. SBM (G) మొదటి దశలో మాదిరిగానే, కమ్యూనిటీ భాగస్వామ్యం అనేది ప్రచారం యొక్క విజయానికి దారితీస్తుంది. ఎందుకంటే ఇది స్వీయ-అభివృద్ధి మరియు సహకారానికి మార్గం సుగమం చేస్తుంది. ఇది ప్రచారానికి హాల్ మార్క్( ముఖ్య లక్షణం) గా ఉండిపోతుంది.
ఈ ప్రచారం పరిశుభ్రత, సురక్షితమైన పారిశుధ్యాన్ని ప్రోత్సహించడానికి, పౌరుల జీవన నాణ్యతను మెరుగుపరచడానికి 2024-25 నాటికి సంపూర్ణ, స్వచ్ఛ్ మరియు స్వస్త్ భారత్ కలను నెరవేర్చడానికి ప్రభుత్వ నిబద్ధతను బలపరుస్తుంది.
***
(Release ID: 1853411)
Visitor Counter : 211