మత్స్య పరిశ్రమ, పశు పోషణ మరియు పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ

"మత్స్య సేతు" యాప్‌లో ఆన్‌లైన్ మార్కెట్ ‌ప్లేస్ ఫీచర్ "ఆక్వా బజార్"ని ప్రారంభించిన శ్రీ పరుషోత్త‌మ్ రూపాలా


- ఎన్ఎఫ్‌డీబీ 9వ జనరల్ బాడీ స‌మావేశం సందర్భంగా ప్రారంభించిన కేంద్ర మంత్రి

Posted On: 19 AUG 2022 3:06PM by PIB Hyderabad

నేషనల్ ఫిషరీస్ డెవలప్‌మెంట్ బోర్డ్ (ఎన్ఎఫ్‌డీబీ) 9వ జనరల్ బాడీ స‌మావేశం సందర్భంగా కేంద్ర మత్స్య, పశుసంవర్ధక మరియు పాడిపరిశ్రమ శాఖ మంత్రి శ్రీ పరుషోత్త‌మ్ రూపాలా "మత్స్యసేతు" మొబైల్ యాప్‌లో ఆన్‌లైన్ మార్కెట్ ప్లేస్ ఫీచర్ "ఆక్వా బజార్"ని ప్రారంభించారు. ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన (పీఎంఎంఎస్‌వై) ద్వారా జాతీయ మ‌త్స్య సంప‌ద అభివృద్ధి బోర్డు (ఎన్ఎఫ్‌డీబీ), హైదరాబాద్ వారి నిధుల సహకారంతో భువనేశ్వర్‌లోని ఐసీఏఆర్‌-సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్రెష్ వాటర్ ఆక్వాకల్చర్ (ఐసీఏఆర్‌-సీఐఎఫ్ఏ) ఈ యాప్‌ను అభివృద్ధి చేసింది. ఆన్‌లైన్ మార్కెట్‌ప్లేస్ చేపల పెంపకందారులకు మరియు వాటాదారులకు చేప విత్తనాలు, దాణా, మందులు మొదలైన ఇన్‌పుట్‌లను సోర్స్ చేయడానికి సహాయపడుతుంది. దీనికి తోడు చేపల పెంపకానికి అవసరమైన సేవలతో పాటు రైతులు కూడా తమ టేబుల్-సైజ్ చేపలను అమ్మకానికి ఇక్క‌డ జాబితా చేయవచ్చు. ఆక్వాకల్చర్ రంగంలో ఉన్న వివిధ  వాటాదారులందరినీ అనుసంధానం చేయడం మార్కెట్‌ప్లేస్ లక్ష్యం.
మత్స్యకారుల సామర్థ్యాన్ని పెంపొందించేలా శిక్ష‌ణనివ్వాలి..
ఈ సందర్భంగా కేంద్ర మత్స్య, పశుసంవర్ధక, పాడిపరిశ్రమ శాఖల మంత్రి శ్రీ పురుషోత్తం రూపాల మాట్లాడుతూ, మత్స్యకారుల సామర్థ్యాన్ని పెంపొందించేందుకు అత్యంత ప్రాధాన్యతనివ్వాలని అన్నారు. ఇందుకు గాను వారికి  స‌మీకృత శిక్ష‌ణా కోర్సుల‌ను నిర్వహించాల‌ని,  రైతులకు విష‌య అవ‌గాన‌ పెంచేలా ప‌ర్య‌ట‌న‌లు నిర్వహించాల‌ని సూచించారు.  ఈ సంద‌ర్భంగా మత్స్య, పశు సంవర్థక శాఖ స‌హాయ మంత్రి శ్రీ ఎల్‌.మురుగన్‌ ప్రసంగిస్తూ ప్రభుత్వం తొలిసారిగా ఆజాదికా అమృతమహోత్సవ్‌ కింద లక్ష్యిత చేపల ఉత్పత్తిని సాధించేందుకు పారిశ్రామికవేత్తల ద్వారా స్టార్టప్‌ను ప్రోత్సహించడం ప్రారంభించిందని వివ‌రించారు. దేశంలో పెరుగుతున్న చేపల డిమాండ్‌ నెరవేర్చేందుకు నూతన తరం పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని మత్స్యశాఖ పశుసంవర్ధక శాఖ సహాయ మంత్రి శ్రీ సంజీవ్ బల్యాన్ ఉద్ఘాటించారు.
మ‌త్స్య సాగు రంగంలొ స‌మ‌స్య‌ల‌కు చెక్‌..
దేశంలో మంచినీటి ఆక్వాకల్చర్ విజయం మరియు అభివృద్ధికి సరైన స్థలంలో నాణ్యమైన ఇన్‌పుట్‌ల సకాలంలో లభ్యత గురించి విశ్వసనీయ సమాచారం చాలా చాలా కీలకం. కొన్నిసార్లు  చేపల పెంపకందారుల‌కు పంట కాలంలో చేపల విత్తనాలు, దాణా, సంబంధిత  పదార్థాలు, ఎరువులు, న్యూట్రాస్యూటికల్స్, వివిధ ర‌కాల సంకలనాలు, మందులు మొదలైన కీలకమైన, నాణ్యమైన ఇన్‌పుట్‌లను సేకరించడంలో సమస్యలను ఎదుర్కొంటారు. ఈ ఇన్‌పుట్‌లను పొందడంలో ఏదైనా ఆలస్యం జ‌రిగితే అది చేపల పెంపకం ప్ర‌క్రియ ఉత్పాదకతలో గణనీయమైన పరిణామాలను కలిగిస్తుంది. కొన్నిసార్లు, రైతులు వ్యవసాయ నిర్మాణం, అద్దె సేవలు, కోతల‌కు మానవశక్తి మొదలైన సేవల కోసం కూడా ఎదురు చూస్తారు. అదేవిధంగా, కొన్ని సమయాల్లో, చేపల పెంపకందార్లు తమ ఉత్పత్తుల్ని మార్కెట్లో విక్రయించడంలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఉత్పత్తి చేసిన చేపలను కొనుగోలు చేయడానికి పరిమిత సంఖ్యలో కొనుగోలుదారులు/ ఏజెంట్లపై మాత్రమే ఆధారపడతారు. ఈ సమస్యను పరిష్కరించడానికి, ఐసీఏఆర్‌-సీఐఎఫ్ఏ మరియు ఎన్ఎఫ్‌డీబీ వాటాదారులందరినీ ఒకే చోటికి తీసుకురావడానికి ఈ డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ను అభివృద్ధి చేశాయి. ఈ ప్లాట్‌ఫారమ్ ద్వారా  ఏదైనా నమోదిత విక్రేత వారి ఇన్‌పుట్ మెటీరియల్‌లను జాబితా చేయవచ్చు. జాబితా చేయబడిన అంశాలు యాప్ వినియోగదారుకు భౌగోళిక సామీప్యత ఆధారంగా మార్కెట్‌లో ప్రదర్శించబడతాయి. యాప్ జాబితాలో చేప విత్తనాలు, ఇన్‌పుట్ పదార్థాలు, సేవలు, ఉద్యోగాలు మరియు టేబుల్ ఫిష్.అనే  వర్గాలుగా వర్గీకరించబడ్డాయి.
అందుబాటులో చేప‌ల ధ‌రలు‌, విక్రేత సంప్రదింపు వివరాలు..
ప్రతి లిస్టింగ్‌లో విక్రేత సంప్రదింపు వివరాలతో పాటు ఉత్పత్తి, ధర, అందుబాటులో ఉన్న పరిమాణం, సరఫరా ప్రాంతం మొదలైన వాటి గురించిన వివరణాత్మక సమాచారం అందుబాటులో ఉంటుంది. అవసరమైన రైతులు/ ‌వాటాదారుల‌ను  విక్రేతను సంప్రదించి వారి సేకరణను పూర్తి చేయవచ్చు. ధర ఆఫర్‌తో పాటు లభ్యత తేదీని సూచించే ఎంపికతో చేపల పెంపకందారులు తమ పెరిగిన టేబుల్-సైజ్ చేపలు/ చేపల విత్తనాలను విక్రయించేందుకు కూడా ఈ ఫీచర్ అనుమతిస్తుంది. ఆసక్తి ఉన్న చేపల కొనుగోలుదారులు రైతులను సంప్రదించి వాటి ధరలను అందజేస్తారు. ఇది చేపలను కొనుగోలు చేసే కొనుగోలుదారులు లేదా కొనుగోలుదారుల ఏజెంట్ల నుండి మరింత వ్యాపార విచారణలను స్వీకరించడానికి రైతులకు క‌చ్చితంగా సహాయం చేస్తుంది, మార్కెట్ పరిస్థితిపై అవగాహన పెంచేందుకు మరియు రైతుల ఉత్పత్తులకు మెరుగైన ధరను పొందేందుకు మార్గం సుగమం చేస్తుంది. నీతిఆయోగ్ సభ్యుడు డాక్టర్ రమేష్ చంద్, వివిధ రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన మత్స్యశాఖ మంత్రులు, వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖల కార్యదర్శులు, ఐసీఏఆర్‌ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ (ఫిషరీస్) డాక్టర్ జె.కె.జెనా,  భార‌త ప్ర‌భుత్వ మత్స్య శాఖ జనరల్ బాడీ సభ్యుల కార్య‌ద‌ర్శి శ్రీ జె.ఎన్.స్వైన్‌తో పాటుగా  భారత ప్రభుత్వం మరియు మత్స్య శాఖ సీనియర్ అధికారులు ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు.

 

******(Release ID: 1853409) Visitor Counter : 185