సాంస్కృతిక మంత్రిత్వ శాఖ
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా దేశంలోని భిన్న వస్త్రసంప్రదాయాలను ఒక చోట చేర్చేందుకు సూత్ర్ సంతతి ప్రదర్శన
Posted On:
19 AUG 2022 2:56PM by PIB Hyderabad
భారతదేశం స్వతంత్ర దేశంగా జన్మించిన 75 సంవత్సరాల అయిన సందర్భంగా గురువారం నాడు దేశంలోని విభిన్న వస్త్ర సంప్రదాయాలను ఒకచోట చేర్చి సూత్ర్ సంతతి ప్రదర్శనను అభేరాజ్ బల్డోటా ఫౌండేషన్ సహకారంతో సాంస్కృతిక మంత్రిత్వ శాఖ & నేషనల్ మ్యూజియం సంయుక్తంగా నిర్వహించాయి.
ఈ ప్రదర్శన న్యూఢిల్లీలో 20 సెప్టెంబర్, 2022 వరకు కొనసాగుతుంది.
ప్రదర్శనను సాంస్కృతిక మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ గోవింద్ మోహన్ ప్రారంభించారు.
సూత్ర్ సంతతి అంటే నూలు కొనసాగింపు అని అర్థం. భారతీయ సంస్కృతి, సమాజంలో కొనసాగుతున్న సంవాదానికి ఒక రూపం దీని శీర్షిక. ఇది గతానికి భవిష్యత్తుకు వంతెనగా ఉంటూ దాని పరిణామాన్ని మలుస్తుంది. ప్రదర్శనలో 75మంది ప్రముఖ చేతివృత్తి పనివారు, కళాకారులు, డిజైనర్లు, హస్తకళాకారుల చేత రూపొందించిన 100 రకాల నేత వస్త్రాలను ప్రదర్శనలో ఉంచారు.
లవీనా బల్దోతా నిర్వహిస్తున్న ఈ ప్రదర్శన నైపుణ్యాలను, పర్యావరణ పరిరక్షణలనే కీలక అంశాలను పట్టి చూపుతుంది. ప్రదర్శనలో చేతితో నేసినవి, చేతి ఎంబ్రాయిడరీ, రెసిస్ట్ డయ్యింగ్, ప్రింటింగ్, పెయింటింగ్, ఆప్లిక్ వర్క్ సహా ఇతర రకాల నూలు, వస్త్రాల చేతిపనిలో నేర్పుతో సృష్టించినవి ఉన్నాయి. కందు, నల్లపత్తి, మల్బరీ, అటవీ పట్టు, ఒంటె, గొర్రెల ఉన్ని, మేక, యాక్ ఉన్ని వంటి స్థానిక రకాల నుంచి ఈ ప్రదర్శనలో పెట్టిన వస్త్రాలలో ఉపయోగించే ఫైబర్‌లు ఉన్నాయి. ప్రదర్శన పరిరక్షణ దార్శనికత - సేంద్రీయ, నిదానమైన వినియోగదారువాదం భారత్ ఒక జాతిగా స్వీయ విలు, స్వాభావిక సామూహికత్వం, అటువంటి లక్ష్యాల దిశగా నడిపించేందుకు అవసరమైన సమన్వయ కృషిని ప్రోత్సహించడంగా ఉంది.
పాల్గొంటున్నవారికి సంబంధించిన ముఖ్యాంశాలుః
చేతివృత్తి కళాకారులుః వసీం (అరీ, కనీ, చేతితో నేసిన పష్మానా జమావర్ సహా కలంకారీ పెంయింట్), విజయ్ గులేల్ (ఇల్కల్), శూన్య (బతిక్- టాగోర్ కవిత్వం).
సంస్థలు/ ఎన్జీవోలు - రాహుల్ జూన్ కింద ఆషా (ఎఎస్‌హెచ్ఎ) (అంజనా సొమానీ కలెక్షన్ నుంచి); మనీష్ సక్సేనాచే ఆద్యం; కరిష్మా స్వాలి చే చాణక్య స్కూల్ ఆఫ్ క్రాఫ్ట్; మాళవికా శివకుమారి & జీన్ ఫ్రాంకాయిస్ లెసేజ్ చే వస్త్ర కళ; గుడ్ ఎర్త్.
పాల్గొంటున్న ఫ్యాషన్ & టెక్స్‌టైల్ డిజైనర్లు, వస్త్రధారణ చేసేవారు, బహుశాస్త్ర సమ్మిళిత కళాకారులలో అబూ సందీప్, అష్దీన్, అంజుల్ భండారీ, ఆషిష్ షా, గౌరవ్ గుప్తా, గౌరంగ్ షా, మనీష్ మల్హోత్రా, పీటర్ డి అస్కోలీ, సంజయ్ గార్గ్ (రా మాంగో), స్మృతి మొరార్కా, తరుణ్ తహిలియానీ వంటివారు ఉన్నారు.
నేత పునరుద్ధరణ వాదులుః ఆసిఫ్ షేక్ (సిడిఎస్) ఛార్లీ మత్లీనా, దర్శన్ షా (వీవర్స్ స్టూడియో), జమీనా జెలియాంగ్ (హైర్లూం నాగా), పూర్వీ పటేల్, రాధికా రాజె (బరోడా షాలూ), స్వాతి & సునయన, ఉమంగ్ హతీసింగ్ సహా పలువురు ఉన్నారు.
జౌళి కళాకారులుః అజయ్ భోజ్, అషితా సింఘల్ (పైవాంద్ స్టూడియో), జిగ్నేష్ పాంచాల్, లక్ష్మీ మాధవన్, ప్రగతి మాధుర్, పుష్యమిత్ర జోషి (ఇకో ఫాబ్), సబీహా దోహద్‌వాలా, సుకన్యా గార్గ్ సహా పలువురు ఉన్నారు.
***
(Release ID: 1853407)
Visitor Counter : 192