ప్రధాన మంత్రి కార్యాలయం
ఫ్రాన్స్అధ్యక్షుడు శ్రీ ఇమేనుయెల్ మేక్రోన్ కు మరియు ప్రధాన మంత్రి కి మధ్య టెలిఫోన్ ద్వారా జరిగిన సంభాషణ
Posted On:
16 AUG 2022 9:54PM by PIB Hyderabad
ఫ్రెంచ్ రిపబ్లిక్ అధ్యక్షుడు శ్రీ ఇమేనుయెల్ మేక్రోన్ తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న టెలిఫోన్ లో మాట్లాడారు.
ఫ్రాన్స్ లో అడవి లో మంటలు చెలరేగడం మరియు అనావృష్టి ఘటనల ను దృష్టి లో పెట్టుకొని అధ్యక్షుడు శ్రీ ఇమేనుయెల్ మేక్రోన్ కు ప్రధాన మంత్రి తన సంఘీభావాన్ని వ్యక్తం చేశారు.
నేతలు ఇద్దరు రక్షణ సహకారం సంబంధి ప్రాజెక్టు లు మరియు శాంతియుత ప్రయోజనాల కోసం పరమాణు శక్తి రంగం లో సహకారం సహా ప్రస్తుతం అమలవుతున్నటువంటి ద్వైపాక్షిక కార్యక్రమాల ను సమీక్షించారు.
వారు ప్రపంచం లో ఆహార భద్రత సహా ముఖ్యమైనటువంటి భౌగోళిక - రాజకీయ సవాళ్ళ ను గురించి కూడా చర్చించారు.
ఉభయ నేత లు ఇటీవలి కొన్ని సంత్సరాల లో భారతదేశం-ఫ్రాన్స్ వ్యూహాత్మక భాగస్వామ్యం ప్రగాఢత్వాన్ని మరియు పటిష్టత్వాన్ని సంతరించుకోవడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు. అంతేకాక, సహకారాన్ని మరిన్ని కొత్త రంగాల లో సైతం విస్తరించుకోవడానికి కలసి పని చేయడాన్ని కొనసాగించాలనే అంశం లో సమ్మతి ని వ్యక్తం చేశారు.
***
(Release ID: 1852493)
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam