హబ్ అండ్ స్పోక్ నమూనాలో దేశవ్యాప్తంగా స్టోరేజి వసతుల ఏర్పాటుకు ఆహారం, పౌర సరఫరాల శాఖ (డిఎఫ్ పిడి) ఆహ్వానించిన టెక్నికల్ బిడ్లకు అద్భుతమైన స్పందన వచ్చింది. ఆహార ధాన్యాల మౌలిక వసతులను ఆధునీకరించాల్సిన అవసరాన్ని గుర్తించి దేశంలో హబ్ అండ్ స్పోక్ నమూనాలో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో ఆహార ధాన్యాల గిడ్డంగు లు డిజైన్ చేసి, నిర్మించి, నిధులు సమకూర్చుకుని, నిర్వహించే విధా నానికి (డిబిఎఫ్ఓటి) రూపొందించిన ప్రత్యేక విధానమే ఇది.
ఉత్తర్ ప్రదేశ్, బిహార్, రాజస్తాన్, పంజాబ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ లలోని 14 ప్రాంతాల్లో 4 బండిల్స్ గా టెక్నికల్ బిడ్లు ఆహ్వానించగా 38 బిడ్లు దాఖలయ్యాయి. 15 మంది ఔత్సాహికులు ఆసక్తి ప్రదర్శించి బిడ్లు దాఖలు చేశారు. టెక్నికల్ అంచనా 3-4 వారాల్లో పూర్తవుతుందని భావిస్తున్నారు.
సుదూర ప్రాంతాల రవాణాను సరళం చేయడానికి విభిన్న ప్రాంతాల్లో చెదురుమదురుగా ఉన్న ప్రాంతాలు –“స్పోక్”- నుంచి కేంద్రీయ నిల్వ ప్రదేశానికి –“హబ్”- ఆహార ధాన్యాలు సరఫరా చేసే విధానాన్ని హబ్ అండ్ స్పోక్ నమూనాగా వ్యవహరిస్తారు. హబ్ లకు ప్రత్యేక రైల్వే సైడింగ్, కంటైనర్ డిపోలుంటాయి. స్పోక్ నుంచి హబ్ కు వస్తువులు రోడ్డు మార్గంలోను, హబ్ నుంచి హబ్ కు వస్తువులు రైలు మార్గంలోను రవాణా చేస్తారు. ఈ నమూనాలో రైల్వే సైడింగ్ వసతులను పూర్ఇ స్థాయిలో వినియోగించడం ద్వారా వస్తు రవాణాలో సామర్థ్యాన్ని పెంచడంతో పాటు వ్యయాలు తగ్గిస్తారు. ఆర్థికాభివృద్ధి, మౌలిక వసతుల అభివృద్ధి, ఉపాధి కల్పనకు ఇది ఉపయోగపడుతుంది. రవాణా వ్యవస్థ సరళం అవుతుంది. లాజిస్టిక్ వ్యయాలు తగ్గించడం ద్వారా రైతుల నుంచి వస్తు సేకరణకు ఉపయోగపడే సబ్ మండీ యార్డులనే సిలోస్ గా వ్యవహరిస్తారు.
హబ్ అండ్ స్పోక్ నమూనాలో దేశంలోని 249 ప్రాంతాల్లో డిజైన్, నిర్మాణం, నిధుల కల్పన, స్వంతంగా నిర్వహించడం, బదిలీ చేయడం విధానంలో (డిబిఎఫ్ఓటి) అమలు ఏజెన్సీ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్ సిఐ) ద్వారా 111.125 ఎల్ఎంటి స్టోరేజి వసతులను అభివృద్ధి చేయాలని ప్రతిపాదించారు.
డిబిఎఫ్ఓటి విధానంలో 14 ప్రాంతాల్లో (10.125) సిలోస్ నిర్మాణానికి ఈ ఏడాది ఏప్రిల్ 26న టెండర్లు ఆహ్వానించారు. అలాగే డిబిఎఫ్ఓఓ నమూనాలో 66 ప్రాంతాల్లో (24.75 ఎల్ఎంటి) సిలోస్ నిర్మాణానికి 2022 జూన్ 21న టెండలర్లు ఆహ్వానించారు.
****