రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ

హిందుస్థాన్ ఉర్వారక్ & రసాయాన్ లిమిటెడ్ (హెచ్.యు.ఆర్.ఎల్)-సింద్రీ మరియు బరౌని ప్రాజెక్టుల పురోగతితో పాటు, కోల్ గ్యాసిఫికేషన్ టెక్నాలజీ ఆధారంగా దేశం లోని మొట్టమొదటి యూరియా ప్లాంట్ అయిన తాల్చేర్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ (టి.ఎఫ్.ఎల్) పురోగతిని కూడా సమీక్షించిన - కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ


“25 ఎల్.ఎం.టి.పి.ఏ. కంటే ఎక్కువగా యూరియాను దేశీయంగా ఉత్పత్తి చేయడంతో పాటు, ఇదే మొత్తంలో యూరియా దిగుమతిని తగ్గించడంలో ఈ రెండు ప్లాంట్లు సహాయపడతాయి."

“ఆత్మనిర్భర్ భారత్” మరియు “ఆత్మనిర్భర్ కృషి” సాధించడానికి ఈ ప్లాంట్ల నుండి ఉత్పత్తి అవుతున్న స్వదేశీ యూరియా, ఒక ముందడుగవుతుందన్న - డా. మన్సుఖ్ మాండవీయ

"యూరియా ఉత్పత్తి లో భారతదేశం ఆత్మనిర్భర్ అవుతుంది"

Posted On: 16 AUG 2022 5:28PM by PIB Hyderabad

హిందుస్థాన్ ఉర్వారక్ & రసాయాన్ లిమిటెడ్ (హెచ్.యు.ఆర్.ఎల్)-సింద్రీ మరియు బరౌని ప్రాజెక్టుల పురోగతిని కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ సమీక్షించారు.  హెచ్‌.యూ.ఆర్‌.ఎల్-బరౌనీ మరియు సింద్రీ ప్లాంట్ల నుంచి యూరియా ఉత్పత్తి ని త్వరలో ప్రారంభించేందుకు భారత ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ సమావేశంలో కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు.  " రెండు ప్లాంట్లు 25 ఎల్.ఎం.టి.పి.కంటే ఎక్కువగా యూరియాను దేశీయంగా ఉత్పత్తి చేయడంతో పాటుఇదే మొత్తంలో యూరియా దిగుమతిని తగ్గించడంలో సహాయపడతాయి." అని ఆయన పేర్కొన్నారు. 

అమ్మోనియా / యూరియా ఉత్పత్తి కోసం కోల్ గ్యాసిఫికేషన్ టెక్నాలజీ ఆధారంగా దేశంలోనే మొట్టమొదటి యూరియా ప్లాంట్ అయిన తాల్చేర్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ (టి.ఎఫ్.ఎల్.) సంస్థ ప్రగతి ని కూడా కేంద్ర మంత్రి సమీక్షించారు.  టి.ఎఫ్.ఎల్. ఉత్పత్తి సామర్థ్యం 12.7 ఎల్.ఎం.టి.పి.ఏ. గా ఉంది.  టి.ఎఫ్.ఎల్. ను 2024 సంవత్సరంలో ప్రారంభించాలని అంచనా వేయడం జరిగింది. 

ఈ ప్లాంట్ల నుంచి స్వదేశీ యూరియా ఉత్పత్తి “ఆత్మనిర్భర్-భారత్” మరియు “ఆత్మనిర్భర్-కృషి” సాధించడానికి ఒక ముందడుగని డాక్టర్ మన్సుఖ్ మాండవీయ వ్యాఖ్యానించారు.   "ప్రభుత్వ కేంద్రీకృత ప్రయత్నాల ద్వారా, భారతదేశం యూరియా ఉత్పత్తిలో స్వావలంబన గా మారడంతో పాటు,   ఈ ప్లాంట్లు ఒక్కొక్కటి 500 మందికి  ప్రత్యక్షంగా, మరో 1500 మందికి పరోక్షంగా ఉపాధి కల్పిస్తాయి." అని ఆయన పేర్కొన్నారు.

 

నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్.టి.పి.సి.), ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐ.ఓ.సి.ఎల్), కోల్ ఇండియా లిమిటెడ్ (సి.ఐ.ఎల్) మరియు ఫర్టిలైజర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎఫ్.సి.ఐ.ఎల్) / హిందుస్థాన్ ఫర్టిలైజర్ కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్.ఎఫ్.సి.ఎల్) వంటి నామినేటెడ్ పి.ఎస్‌.యు.లతో జాయింట్ వెంచర్ కంపెనీని ఏర్పాటు చేయడం ద్వారా గోరఖ్‌పూర్, సింద్రీ మరియు బరౌని యూనిట్ల పునరుద్ధరణను ప్రభుత్వం తప్పనిసరి చేసింది,   దీని ప్రకారం, గోరఖ్ పూర్, సింద్రి, బరౌనీ లలో ఒక్కొక్కటి 12.7 ఎల్.ఎం.టి.పి.ఏ. సామర్ధ్యం గల గ్యాస్ ఆధారిత అమ్మోనియా యూరియా ప్లాంట్‌ లను ఏర్పాటు చేయడం కోసం, ఎన్.టి.పి.సి., ఐ.ఓ.సి.ఎల్., సి.ఐ.ఎల్. సంస్థలు ఒక్కొక్కటి 29.67 శాతం చొప్పున,  ఎఫ్.సి.ఐ.ఎల్. సంస్థ 11 శాతం చొప్పున  ఈక్విటీ భాగస్వామ్యంతో, హిందుస్థాన్ ఉర్వారక్ & రసాయాన్ లిమిటెడ్ అనే జాయింట్ వెంచర్ కంపెనీ అనే సంస్థ ను ఏర్పాటు చేయడం జరిగింది.  

గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా (గై.ఏ.ఐ.ఎల్); కోల్ ఇండియా (సి.ఐ.ఎల్); రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్ ( ఆర్.సి.ఎఫ్.); ఎఫ్.సి.ఐ.ఎల్. వంటి నామినేటెడ్ పి.ఎస్‌.యు.ల. జాయింట్ వెంచర్ కంపెనీని ఏర్పాటు చేయడం ద్వారా నామినేషన్ పద్ధతిలో తాల్చెర్ యూనిట్‌ను పునరుద్ధరించాలని ప్రభుత్వం ఆదేశించింది.  దీని ప్రకారం,  జి.ఏ.ఐ.ఎల్., ఆర్.సి.ఎఫ్., సి.ఐ.ఎల్. ల 31.85 శాతం ఈక్విటీ భాగస్వామ్యంతో తాల్చేర్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ (టి.ఎఫ్.ఎల్) అనే జాయింట్ వెంచర్ కంపెనీ ని ఏర్పాటు చేయడం జరిగింది, కాగా, ఎఫ్.సి.ఐ.ఎల్. సంస్థ ఇందులో 4.45 శాతం ఈక్విటీని కలిగి ఉంది.

 

****

 



(Release ID: 1852479) Visitor Counter : 133


Read this release in: English , Urdu , Hindi , Bengali , Odia