ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

రాష్ట్ర/యూటీ స్థాయిలో ఆరోగ్య సంరక్షణ నిపుణులు మరియు ఆరోగ్య సౌకర్యాల రిజిస్ట్రీలను బలోపేతం చేయడానికి పనితీరు ఆధారిత నిధుల కేటాయింపును నేషనల్ హెల్త్ అథారిటీ ప్రకటించింది


5 సంవత్సరాల వ్యవధిలో ఏబిడిఎం రాష్ట్ర కార్యాలయాల ఏర్పాటు కోసం రూ.500 కోట్లు కేటాయించారు. రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల పనితీరు ఆధారంగా రూ.100 కోట్లు కేటాయించబడతాయి

Posted On: 16 AUG 2022 5:26PM by PIB Hyderabad

హెల్త్ ఫెసిలిటీ రిజిస్ట్రీ (హెచ్‌ఎఫ్‌ఆర్‌) మరియు హెల్త్‌కేర్ ప్రొఫెషనల్స్ రిజిస్ట్రీ (హెచ్‌పిఆర్‌)లో రికార్డింగ్ డేటాలో వారి పనితీరు ఆధారంగా ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ (ఏబిడిఎం) అమలు కోసం నేషనల్ హెల్త్ అథారిటీ (ఎన్‌హెచ్‌ఏ) రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలకు నిధుల కేటాయింపును ప్రకటించింది. ఈ పనితీరు ఆధారిత నిధుల కేటాయింపు పథకం కింద నిర్మించబడుతున్న కీలక జాతీయ రిజిస్ట్రీలను బలోపేతం చేసే ధృవీకరించబడిన ఎంట్రీలతో రాష్ట్రం/యూటీ స్థాయిలో ఏబిడిఎం యొక్క నిర్మాణాత్మక అమలులో సహాయపడుతుంది.

ఎన్‌హెచ్‌ఏ గతంలో జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం  5 సంవత్సరాల వ్యవధిలో (ఎఫ్‌వై 2021-22 నుండి ఎఫ్‌వై 2025-26 వరకు) రాష్ట్రం/యూటీ స్థాయిలో ఏబిడిఎం కార్యాలయాల ఏర్పాటు కోసం రూ. 500 కోట్లు కేటాయించబడ్డాయి. ఈ నిధులలో ఇరవై శాతం అంటే రూ. 100 కోట్లను ప్రోత్సాహక ఆధారిత నిధులుగా కేటాయించారు. ఈ ఆలోచనను మరింత ముందుకు తీసుకువెళ్లి, సంస్థల సంఖ్య (డాక్టర్లు, నర్సులు మొదలైన ఆరోగ్య సంరక్షణ నిపుణులు మరియు ఆసుపత్రులు, క్లినిక్‌లు, హెల్త్ & వెల్‌నెస్ సెంటర్‌లు వంటి ఆరోగ్య సదుపాయాలు, వంటి వాటి సంఖ్య) పరంగా సంబంధిత రాష్ట్రాలు మరియు యూటీల పనితీరు ఆధారంగా ప్రస్తుత నిధుల కేటాయింపును పొడిగించాలని ఎన్‌హెచ్‌ఏ నిర్ణయించింది. డయాగ్నస్టిక్ ల్యాబ్‌లు, ఫార్మసీలు మొదలైనవి సంబంధిత రాష్ట్రాలు/యుటిలు నిర్ణీత వ్యవధిలో నమోదు చేసి ధృవీకరించాలి.

ఈ కార్యక్రమంపై ఎన్‌హెచ్‌ఏ, సిఈఓ డాక్టర్ ఆర్‌. ఎస్‌. శర్మ మాట్లాడుతూ – “హెచ్‌పిఆర్ మరియు హెచ్‌ఎఫ్‌ఆర్‌లు ఏబిడిఎం  కీలక స్తంభాలు. మరింత మంది ఆరోగ్య సంరక్షణ నిపుణులు మరియు ఆరోగ్య సౌకర్యాలను నమోదు చేయడంలో రాష్ట్రాలు మరియు యూటీల నుండి ఉత్సాహభరితమైన మద్దతుతో మనం డిజిటల్ ఆరోగ్య సేవల ప్రయోజనాలను ప్రజల్లోకి తీసుకెళ్లగలము. రాష్ట్రాలు మరియు యూటీలలోని సంబంధిత సంస్థలు రిజిస్ట్రేషన్ సమయంలో నమోదు చేసిన వివరాలను ధృవీకరించే బాధ్యతను కూడా కలిగి ఉంటాయి. వారి మద్దతు ఆరోగ్య సంరక్షణ నిపుణులు మరియు ఆరోగ్య సౌకర్యాల జాతీయ స్థాయి రిజిస్ట్రీలను రూపొందించడంలో సహాయపడుతుంది, ఇది ఆరోగ్య సేవలను కోరుకునే వ్యక్తులకుఏకైక మూలం" అని తెలిపారు.

ఏబిడిఎం ఉద్దేశించిన లక్ష్యాన్ని సాధించడానికి హెల్త్ ఫెసిలిటీ రిజిస్ట్రీ (హెచ్‌ఎఫ్‌ఆర్‌) మరియు హెల్త్‌కేర్ ప్రొఫెషనల్స్ రిజిస్ట్రీ (హెచ్‌పిఆర్‌) జనాభా చాలా కీలకం. రాష్ట్రాలు & కేంద్ర పాలిత ప్రాంతాలకు పనితీరు ఆధారిత నిధులను ప్రవేశపెట్టడం ఈ దిశలో ఒక చొరవ. దానికి అనుగుణంగా ఎన్‌హెచ్‌ఏ ఫండ్ కేటాయింపు కోసం నిబంధనలను నిర్వచించింది:

 

  • 31 డిసెంబర్ 2022 వరకు హెచ్‌ఎఫ్‌ఆర్‌ &హెచ్‌పిఆర్‌లో ధృవీకరించబడిన ప్రతి ఎంట్రీలకు రూ.100
  • హెచ్‌ఎఫ్‌ఆర్‌ &హెచ్‌పిఆర్‌లో 1 జనవరి 2023 నుండి 31 మార్చి 2023 మధ్య వెరిఫై చేయబడిన ప్రతి ఎంట్రీలకు రూ.50
  • 31 మార్చి 2023 తర్వాత హెచ్‌ఎఫ్‌ఆర్‌ &హెచ్‌పిఆర్‌లో వెరిఫై చేయబడిన ఎంట్రీలకు నిధులు కేటాయించబడవు
  • ఎబిడిఎం కోసం పూర్తి సమయం లేదా పార్ట్‌టైమ్ మానవ వనరులను వినియోగించుకోవడానికి రాష్ట్రాలు మరియు యూటీలకు ఈ నిధులను ఉపయోగించుకునే స్వేచ్ఛ ఉంది.

 

ఏబిడిఎం గురించి మరింత సమాచారం https://abdm.gov.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు.


 

****


(Release ID: 1852404) Visitor Counter : 155


Read this release in: English , Urdu , Marathi , Hindi , Odia