భారత ప్రభుత్వ ప్రధాన శాస్త్రీయ సలహాదారు కార్యాలయం

భారత ప్రభుత్వ ప్రధాన శాస్త్ర సలహాదారు మంథన్‌ను ఆవిష్కరించారు.

Posted On: 16 AUG 2022 12:58PM by PIB Hyderabad

మంథన్  పరిశోధన మరియు అభివృద్ధి రంగంలో సహకారాన్ని భారీ స్థాయిలో పెంపొందించడంలో  మరియు భారతదేశం యొక్క శాస్త్రీయ మిషన్ల లక్ష్యాలను మరియు ఐక్య రాజ్య సమితి సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించడం కోసం భారతదేశం యొక్క ప్రత్యేక వేదిక.

 

భారత ప్రభుత్వ ప్రధాన శాస్త్ర సలహాదారు (PSA) కార్యాలయం దేశంలోని అన్ని విజ్ఞాన శాస్త్రాలు మరియు సాంకేతిక రంగాలను అభివృద్ధి చేయడం మరియు సాధికారత కల్పించడం అనే లక్ష్యంతో మంథన్ వేదిక ను ప్రారంభించినట్లు ప్రకటించింది.

 

పరిశోధన మరియు అభివృద్ధి రంగంలో సహకారాన్ని భారీ స్థాయిలో పెంపొందించడంలో  పరిశ్రమ మరియు వైజ్ఞానిక పరిశోధన మరియు అభివృద్ధి పర్యావరణ వ్యవస్థల మధ్య సహకారాన్ని పెంపొందించడం అలాగే ఐక్య రాజ్య సమితి సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించడం లక్ష్యంగా పెట్టుకుంది.  భారతదేశానికి  స్వాతంత్ర్యం వచ్చిన 75 సంవత్సరాల  - ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌ సంధర్భంగా ప్రారంబించిన  ఈ ఆవిష్కరణ భారతదేశ సాంకేతిక విప్లవానికి జాతీయ మరియు ప్రపంచ దేశాల శాస్త్ర నిపుణులను చేరువ చేసే అవకాశాన్ని అందిస్తుంది.

 

భారత ప్రభుత్వ ప్రధాన శాస్త్ర సలహాదారు (PSA)  కార్యాలయం నేతృత్వంలో, మంథన్ భారతదేశంలో శాస్త్ర మరియు సాంకేతిక ఆధారితంగా సమాజం పై ప్రభావం చూపే ఆవిష్కరణలు మరియు పరిష్కారాల ఆవరణాన్ని సమర్థవంతంగా మార్చగలదు.  ఆవిష్కరణలు,శాస్త్రభవిష్యత్ మరియు సాంకేతికత వృద్ధి కోసం, వేదిక నేతృత్వంలో  సమాచార మార్పిడి సమావేశలు, ప్రదర్శనలు మరియు సదస్సు ల ద్వారా పరిజ్ఞాన బదిలీలు మరియు పరస్పర అనుసంధానం కోసం ఒక వ్యవస్థ ను అభివృద్ధి చేయడాన్ని  సులభతరం చేస్తుంది.

 

ఎన్ ఎస్ ఈ ఐ టి  అధ్వర్యంలో పనిచేసే ఈ ప్లాట్‌ఫారమ్ లబ్దిదారుల మధ్య పరస్పర అనుసంధానం పెంచడానికి, పరిశోధన మరియు ఆవిష్కరణలను సులభతరం చేయడానికి మరియు సామాజిక ప్రభావాన్ని కలిగించే వాటితో సహా వివిధ అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలు మరియు శాస్త్రీయ పరిష్కారాలకోసం చేసే అన్వేషణ లో ఎదురయ్యే సవాళ్లను, నూతన పరిష్కారాలను పంచుకోవడానికి ఉపయోగ పడుతుంది.

 

ఈ కార్యక్రమం పై తన అభిప్రాయాలను పంచుకుంటూ, భారత ప్రభుత్వ ప్రధాన శాస్త్ర సలహాదారు ప్రొఫెసర్. అజయ్ కుమార్ సూద్ , “వాస్తవ ప్రపంచ వర్తమాన అవసరాలకు అనుగుణంగా  దేశాన్ని శాస్త్ర మరియు సాంకేతిక రంగ పురోగతిని ముందంజలో ఉంచడానికి భారత ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఆర్ అండ్ డి లో పరిశ్రమల భాగస్వామ్యాన్ని  పెంపొందించడానికి  ఐక్య రాజ్య సమితి సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించడం పట్ల మా నిబద్ధతకు నిదర్శనం  మంథన్  వేదిక ను ప్రారంభించడం, ఈ ప్లాట్‌ఫారమ్ అభివృద్ధికి సహకరించిన సహదాతలు, విజ్ఞాన భాగస్వాములు, పరిశ్రమ అధికారులు మరియు నా సహోద్యోగులను అభినందిస్తున్నాను" అన్నారు.

 

"మంథన్ ప్లాట్‌ఫారమ్ ప్రత్యేకమైనది, విశిష్టమైనది  వినూత్న ఆలోచనలు, ఆవిష్కరణల ఆలోచనలు మరియు ప్రభుత్వ-ప్రైవేట్-విద్యా సంస్థల సహకారం ద్వారా మన దేశాన్ని మార్చడానికి సుస్థిరత లక్ష్యాలను సాధించడానికి అవసరమైన పూర్తి శక్తి ని అందిస్తుంది. సాంకేతిక ప్రేరేపిత శాస్త్ర సాంకేతిక వేదికను రూపొందించడంలో కీలకపాత్ర పోషించిన ప్రతి ఒక్కరినీ నేను అభినందించాలనుకుంటున్నాను" అని భారత ప్రభుత్వ ప్రధాన శాస్త్ర సలహాదారు కార్యాలయం యొక్క సైంటిఫిక్ సెక్రటరీ డాక్టర్ పర్వీందర్ మైని అన్నారు.

 

“ఒక దేశం అభివృద్ధి చెందాలంటే, పౌరసేవలు అందించడానికి మరియు కార్యనిర్వహణ కి ఒక వేదిక అవసరం. మంథన్ ప్లాట్‌ఫారమ్ గిరాకీ వైపు మరియు సరఫరా వైపు వాడుకదారుల మధ్య సహకారాన్ని  అందిస్తుంది, తద్వారా ఆలోచనలు వృద్ధి చెందడానికి, సమాజలను మెరుగుపరచడానికి సాంకేతికతతో దేశాన్ని ఎంతో అద్భుతమైన అభివృద్ధి వైపు నడిపించే ఫలితాలను అందించడానికి సహాయపడుతుంది, ”అని డా. సప్నా పోటి, డైరెక్టర్ – వ్యూహాత్మక భాగస్వామ్యం, భారత ప్రభుత్వ ప్రధాన శాస్త్ర సలహాదారు కార్యాలయం అన్నారు.

 

“మంథన్ ప్రపంచ వేదికగా మారడానికి అన్ని హంగులను కలిగి ఉంది. డిజిటల్ ఇండియా మరియు ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కోసం గౌరవ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ ఆవిష్కరించిన భవిష్య దృష్టిని నేను అభినందిస్తున్నాను. ప్రపంచానికి పరిష్కారాలనందించే వినూత్న  వేదికను నిర్మించిన పి ఎస్ ఎ కార్యాలయం మరియు దాని భాగస్వాములను అభినందిస్తున్నాను, ”అని ఆశిష్‌కుమార్ .

 చౌహాన్, ఎం డి అండ్ సి ఇ ఓ, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అన్నారు

 

ప్లాట్‌ఫారమ్ ఆవిష్కరణ సభలో ఎన్ ఎస్ ఈ ఐ టి ఎం డి అండ్ సి ఇ ఓ శ్రీ అనంతరామన్ శ్రీనివాసన్ మాట్లాడుతూ మంథన్ కొత్త భావనలు, శాస్త్రీయ ఆలోచనలు మరియు కొత్త టెక్నాలజీ ఫలితాలను దేశవ్యాప్తంగా వేగంగా విస్తరించటనికి సహాయం చేస్తుంది. "విశ్వసనీయమైన పరిజ్ఞానం మరియు సాంకేతిక భాగస్వామిగా, మేము పి ఎస్ ఎ  కార్యాలయంతో అనుబంధం కలిగి ఉన్నందుకు సంతోషిస్తున్నాము మరియు ఈ ప్రతిష్టాత్మక ఆవిష్కరణకు కు వారిని అభినందిస్తున్నాము" అని ఆయన తెలిపారు. 

 

***(Release ID: 1852388) Visitor Counter : 270