పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ

పునరుద్ధరించిన జాతీయ పంచాయితీ అవార్డుల రోడ్ మ్యాప్ సంసిద్ధతపై జాతీయ రైట్ షాప్ ను రేపు ప్రారంభించనున్న పంచాయితీ రాజ్ శాఖ సహాయ మంత్రి శ్రీ కపిల్ మోరేశ్వర్ పాటిల్

Posted On: 15 AUG 2022 4:58PM by PIB Hyderabad

కేంద్ర పంచాయితీ రాజ్ శాఖ సహాయ మంత్రి శ్రీ కపిల్ మోరేశ్వర్ పాటిల్ రేపు న్యూఢిల్లీలో జాతీయ పంచాయితీ అవార్డుల కోసం రోడ్ మ్యాప్ సంసిద్ధతపై జాతీయ రైట్ షాప్ ను ప్రారంభించనున్నారు. పునరుద్ధరించిన జాతీయ పంచాయితీ అవార్డులపై కార్యాచరణ మార్గదర్శకాలను కూడా ఆయన విడుదల చేస్తారు.

 

నేషనల్ రైట్ షాప్ జాతీయ పంచాయితీ అవార్డుల అప్లికేషన్ ప్రక్రియపై లైన్ డిపార్ట్ మెంట్ లకు చెందిన రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల అధికారులకు ఓరియెంటేషన్ ని అందిస్తుంది, వారు దానిని క్యాస్కేడ్ మోడ్ లో పంచాయితీ రాజ్ ఇన్ స్టిట్యూషన్ ల (పిఆర్ఐలు) వరకు మరింత విస్తరించనున్నారు.

 

పునరుద్ధరించిన విధానం కింద, గ్రామ, బ్లాక్, జిల్లా పంచాయితీలకు దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ పంచాయితీ సతత్ వికాస్ పురస్కార్ (వ్యక్తిగత థీమ్ వారీ పనితీరుకు),  నానాజీ దేశ్ ముఖ్ సర్వోత్తం పంచాయితీ సతత్ వికాస్ పురస్కార్ (అన్ని ఇతివృత్తాల కింద మొత్తం పనితీరుకు) అనే రెండు కేటగిరీల్లో ఈ అవార్డులను అందిస్తారు.

 

ఆయా స్థాయిల్లోని ప్రతి థీమ్ కు సంబంధించిన థీమ్ థీమాటిక్ సెలక్షన్ కమిటీలు అవార్డు గ్రహీత పంచాయితీలను ఎంపిక చేస్తాయి. ఇది కాకుండా, గ్రామ పంచాయితీలకు కొన్ని ప్రత్యేక కేటగిరీల అవార్డులు ఇస్తారు. అవి : పునరుత్పాదక శక్తి వనరులను స్వీకరించడం , ఉపయోగించడం కోసం గ్రామ ఉర్జా స్వరాజ్ విశేష్ పంచాయితీ పురస్కార్; నికర-జీరో కర్బన ఉద్గారాలను సాధించే దిశగా ఆదర్శవంతమైన కృషి కి గానూ కార్బన్ న్యూట్రల్ విశేష్ పంచాయితీ పురస్కార్;  జాతీయ పంచాయతీ రాజ్ అవార్డ్ లకు అర్హత సాధించి, తరువాతి సంవత్సరాల్లో కూడా జాతీయ పంచాయితీ అవార్డులకు షార్ట్ లిస్ట్ చేయబడిన గ్రామ పంచాయతీలకు

నానాజీ దేశ్ ముఖ్ సర్వోత్తం పంచాయితీ సతత్ వికాస్ పురస్కార్; ఎల్  ఎస్ డి జి లు,  సాధించడం లో గ్రామ పంచాయతీ లకు, అత్యుత్తమంగా పాల్గొనే రాష్ట్రం/l/జిల్లా/బ్లాక్ పంచాయితీలకు సంస్థాగత మద్దతును అందించిన సంస్థలకు పంచాయితీ క్షమత నిర్మాణ సర్వోత్తం సంస్థాన్ పురస్కార్.

 

పునరుద్ధరించిన జాతీయ పంచాయితీ అవార్డులను విజయవంతంగా అమలు చేసే దిశగా, ఎంఒపిఆర్ నోడల్ కేంద్ర మంత్రిత్వ శాఖలు/ విభాగాలైన గ్రామీణాభివృద్ధి, ఆరోగ్యం -కుటుంబ సంక్షేమం, స్త్రీ -శిశు అభివృద్ధి, త్రాగునీరు -పారిశుధ్యం, సామాజిక న్యాయం -సాధికారత ,నీటి వనరులు, నదుల అభివృద్ధి -గంగా పునరుజ్జీవనం వంటి వాటితో కలిసి పనిచేస్తోంది. ఈ నోడల్ మంత్రిత్వ శాఖలు సంబంధిత థీమ్ లపై జాతీయ స్థాయి అవార్డుల ఎంపికకు థీమాటిక్ సెలక్షన్ కమిటీలకు నాయకత్వం వహిస్తాయి ఇతర లైన్ మంత్రిత్వ శాఖలు/డిపార్ట్ మెంట్ లు ఈ కమిటీల్లో సభ్యులుగా ఉంటాయి.

 

ఇంతకు ముందు, 2022 జూలై 4-6 తేదీలలో, పంచాయతీరాజ్ సంస్థల్లో (పిఆర్ఐలు) సుస్థిర అభివృద్ధి లక్ష్యాల స్థానికీకరణపై రోడ్ మ్యాప్  ,కార్యాచరణ ముసాయిదా ప్రణాళికపై జాతీయ రైట్ షాప్ ను రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాల కోసం కూడా నిర్వహించారు.

 

కేంద్ర పంచాయితీ రాజ్ మంత్రి శ్రీ గిరిరాజ్ సింగ్ 2021 డిసెంబర్ 7 న ఈ మంత్రిత్వ శాఖలో ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ ఎస్ డి జి ల పై పంచాయితీ రాజ్ సంస్థల ద్వారా రూపొందించిన నివేదికను విడుదల చేశారు.

2030 నాటికి సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను సాధించడానికి ఒక మార్గంగా స్థానిక (గ్రామ పంచాయితీ) స్థాయిలో చర్య కోసం 17 సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సమీకరించే 9 అంశాలను కమిటీ తన నివేదికలో గుర్తించింది. ఈ తొమ్మిది ఇతివృత్తాలు ( 1) పేదరిక రహిత ,మెరుగైన జీవనోపాధి గ్రామం, (2) ఆరోగ్యవంతమైన గ్రామం, (3) బాలలకు స్నేహపూర్వక గ్రామం, (iv) నీరు తగినంత కలిగిన గ్రామం, (5) పరిశుభ్రమైన ,హరిత గ్రామం, (6) గ్రామంలో స్వయం సమృద్ధి మౌలిక సదుపాయాలు, (viii) సామాజికంగా సురక్షితంగా ఉన్న గ్రామం, (viii) సుపరిపాలన కలిగిన గ్రామం (ix) మహిళా-స్నేహపూర్వక గ్రామం (ఇంతకు ముందు ఎన్ జండర్డ్ విలేజ్ గా పిలిచే వారు).

 

నేపథ్యం

 

సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధన కోసం ప్రధాన పథకాలు/కార్యక్రమాలను అమలు చేయడంలో పంచాయితీలు కీలక పాత్ర పోషిస్తాయి. పంచాయితీలను అవార్డుల రూపంలో ప్రోత్సహించడం అనేది అభివృద్ధి ప్రణాళికలను సంపూర్ణంగా అమలు చేయడం కోసం కఆరోగ్యవంతమైన ,పోటీతత్వ పర్యావరణ వ్యవస్థను సృష్టించడంలో అంతర్భాగం. అందువల్ల, రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ (ఆర్జిఎస్ఎ) కేంద్ర ప్రాయోజిత పథకం ప్రధాన భాగాలలో ఒకటైన పంచాయితీల ప్రోత్సాహక పథకం కింద జాతీయ పంచాయితీ అవార్డుల ద్వారా ఉత్తమ పనితీరు కనబరిచిన పంచాయితీలు / రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాలను పంచాయితీ రాజ్ మంత్రిత్వ శాఖ (ఎంఓపిఆర్) ప్రోత్సహిస్తోంది. 1993 ఏప్రిల్ 24 నుంచి అమల్లోకి వచ్చిన 73వ రాజ్యాంగ సవరణ చట్టం, 1992 గుర్తుగా ఏటా జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం గా జరుపుకునే ఏప్రిల్ 24న ఈ అవార్డులను ప్రదానం చేస్తారు.

 

పంచాయితీ స్థాయిలో సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించే దిశగా ఒక క్రమబద్ధమైన ప్రణాళిక,అమలు, పర్యవేక్షణ ,జవాబుదారీతనం కోసం పిఆర్ఐ లను పురోగమింప చేయడానికి బ్లాక్, డిస్ట్రిక్ట్, స్టేట్/యుటి నేషనల్ లెవల్ లో అవార్డుల పోటీ కి సంబంధించి బహుళ స్థాయి యంత్రాంగం ఏర్పాటు చేయడానికి జాతీయ పంచాయితీ అవార్డులను పునరుద్ధరించడం జరిగింది, ఇది 9 సుస్థిర అభివృద్ధి లక్ష్యాల ( el ఎస్ డి జిలు) థీమ్ లతో సమలేఖనం చేయబడింది:

 

గుర్తించిన 9 థీమ్ ల ద్వారా ఎస్ డీ జి లను సాధించడంలో పిఆర్ఐల పనితీరును మదింపు చేస్తారు.

 

పిఆర్ఐల మధ్య పోటీ స్ఫూర్తిని

పెంపొందిస్తారు.

 

పిఆర్ఐల ద్వారా ఎస్ డీ జి ల స్థానికీకరణ' ప్రక్రియను ప్రోత్సహించి 2030 నాటికి ఎల్ ఎస్ డీ  జి ని సాధించడం ప్రాముఖ్యత గురించి పిఆర్ఐలకు అవగాహన కల్పిస్తారు.

 

******



(Release ID: 1852161) Visitor Counter : 175


Read this release in: English , Urdu , Hindi , Marathi