రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ జరుపుకోవడానికి క్వాంటమ్ కమ్యూనికేషన్ టెక్నాలజీలో దూసుకుపోవడానికి ఎంఓడీ సిద్ధంగా ఉంది


బెంగళూరు ఆధారిత స్టార్టప్,ఐడెక్స్‌ ఆధ్వర్యంలో క్వాంటం కీ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్ ద్వారా అధునాతన సురక్షిత కమ్యూనికేషన్‌ను ఆవిష్కరించింది.

ట్రయల్స్ విజయవంతం అయిన తర్వాత భారత సైన్యం వాణిజ్య ఆఎఫ్‌పిని జారీ చేస్తుంది

Posted On: 14 AUG 2022 1:28PM by PIB Hyderabad

దేశం స్వాతంత్ర్యం పొంది 75 సంవత్సరాలు పూర్తవుతోంది. ఈ క్రమంలో ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ జరుపుతున్న నేపథ్యంలో భారతదేశం తన సాయుధ దళాలను అత్యాధునిక రక్షణతో సన్నద్ధం చేయడానికి స్వదేశీ మరియు మరింత అధునాతన క్వాంటం కమ్యూనికేషన్ టెక్నాలజీతో ప్రపంచ నాయకుల లీగ్‌లో చేరడానికి సిద్ధంగా ఉంది. ఇన్నోవేషన్ ఫర్ డిఫెన్స్ ఎక్సలెన్స్ (ఐడిఈఎక్స్) - డిఫెన్స్ ఇన్నోవేషన్ ఆర్గనైజేషన్ (డిఐఓ) ఆధ్వర్యంలో బెంగళూరుకు చెందిన డీప్ టెక్ స్టార్ట్ అప్ క్యూఎన్‌యు ల్యాబ్స్, క్వాంటం కీ డిస్ట్రిబ్యూషన్ (క్యూకెడి) సిస్టమ్‌ల ద్వారా అధునాతన సురక్షిత కమ్యూనికేషన్‌ను ఆవిష్కరించడం ద్వారా దూర అడ్డంకులను అధిగమించింది. ఈ ప్రాజెక్ట్‌ను ఇండియన్ ఆర్మీతో కలిసి ఐడెక్స్-డిఐఓ క్యూరేట్ చేసింది. విజయవంతమైన ట్రయల్స్ తర్వాత ఇప్పుడు భారత సైన్యం క్యూఎన్‌యు ల్యాబ్స్ అభివృద్ధి చేసిన క్యూకెడి సిస్టమ్‌ల సేకరణ ప్రక్రియను వాణిజ్య అభ్యర్థన కోసం ప్రతిపాదన (ఆర్‌ఎఫ్‌పి) మరియు దాని విస్తరణ ద్వారా ప్రారంభించింది.

క్వాంటం సాంకేతికత సైనిక అవసరాలను తీర్చగల భారీ సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఆధునిక యుద్ధంపై  ప్రభావాన్ని చూపగలదు. క్యూకెడి వ్యవస్థ భూసంబంధమైన ఆప్టికల్ ఫైబర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో నిర్దిష్ట దూరం (ఈ సందర్భంలో 150 కిమీ కంటే ఎక్కువ) ద్వారా వేరు చేయబడిన రెండు ముగింపు పాయింట్‌ల మధ్య క్వాంటం సురక్షిత రహస్య జత సిమెట్రిక్ కీలను సృష్టించడానికి అనుమతిస్తుంది. క్యూకెడి అనేది హ్యాక్ చేయలేని రహస్య కీలను సృష్టించడం కోసం నాన్-హ్యాక్ చేయదగిన క్వాంటం ఛానెల్‌ని రూపొందించడంలో సహాయపడుతుంది. వీటిని ఎండ్ పాయింట్‌లలో క్లిష్టమైన డేటా/వాయిస్/వీడియోను గుప్తీకరించడానికి ఉపయోగిస్తారు.

స్టార్టప్ విజయంతో ఉల్లాసంగా ఉన్న రక్షణ కార్యదర్శి డాక్టర్ అజయ్ కుమార్..స్వదేశీ క్యూకేడీ టెక్నాలజీని అభివృద్ధి చేయడం ‘ఆజాదీ కా అమృత్ కాల్’లో ఒక మైలురాయిగానూ, ‘ఆత్మనిర్భర్ భారత్’కు తగిన విజయగాథగానూ పేర్కొన్నారు. ఆధునిక మరియు భవిష్యత్ యుద్ధాలకు వినూత్న పరిష్కారాలతో సాయుధ దళాలను సన్నద్ధం చేస్తున్నందున లోతైన సాంకేతిక పరిజ్ఞానంలో పనిచేస్తున్న ఐడెక్స్ స్టార్టప్‌ల ప్రయత్నాలను ఆయన అభినందించారు. డిఫెన్స్ ప్రొడక్షన్ డిపార్ట్‌మెంట్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ డిఫెన్స్, ఐడెక్స్-డియో, ఆర్మీ డిజైన్ బ్యూరో మరియు ఇండియన్ ఆర్మీ సిగ్నల్స్ డైరెక్టరేట్‌లు దేశంలో మొదటిసారిగా హై ఎండ్ క్వాంటం టెక్నాలజీని అభివృద్ధి చేయడంలో దోహదపడుతున్నాయని రక్షణ కార్యదర్శి ప్రశంసించారు. ఐడెస్క్ రక్షణ ఆవిష్కరణలో విప్లవాత్మక మార్పులు చేస్తుందని మరియు ఖర్చు మరియు సమయాన్ని ఆదా చేయగల కొత్త సాంకేతిక పరిష్కారాలను రూపొందించడంలో సహాయపడుతుందని ఆయన తెలిపారు.

క్యూఎన్‌యు ల్యాబ్స్ సహ వ్యవస్థాపకులు మరియు సిఈఓ శ్రీ సునీల్ గుప్తా మాట్లాడుతూ, క్వాంటమ్ టెక్నాలజీని ఉపయోగించడం ద్వారా డేటా భద్రత రంగంలో భారతదేశాన్ని అత్యాధునిక సాంకేతికతలలో ముందంజలో ఉంచాలనే దృక్పథం చివరకు ఫలించిందని అన్నారు. ఐడెక్స్‌ ఓపెన్ ఛాలెంజ్-2లో గెలుపొందడం వల్ల ఈ అద్భుతమైన విజయాన్ని సాధించడానికి క్యూఎన్‌యు ల్యాబ్స్‌కు లాంచింగ్ ప్యాడ్‌ని అందించామని ఆయన తెలిపారు.

***(Release ID: 1851901) Visitor Counter : 93


Read this release in: English , Urdu , Hindi , Marathi