సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ

ఆకాశవాణిలో స్వాతంత్ర్యం సిద్దించిన నాటి నుంచి నేటి వరకు మధుర, జ్ఞాపకాలు మరియు మధుర క్షణాలు


ఆగస్టు 15 నుంచి ప్రతిరోజూ తన ప్రధాన వార్తల బులెటిన్‌లలో ప్రసారం చేయనున్న ఆకాశవాణి

"ఆకాశవాణితో స్వేచ్ఛా భారతదేశ వాణి " కార్యక్రమంతో 75 సంవత్సరాల భారతావని ప్రయాణాన్ని గుర్తు చేయనున్న ఆకాశవాణి

100.1FM గోల్డ్ ఛానెల్, @AkashvaniAir, Twitter newsonairofficial YouTube ఛానెల్, newsonair.gov.in, NewssonAir యాప్, Facebook మరియు Instagram

Posted On: 13 AUG 2022 1:38PM by PIB Hyderabad

ఆకాశవాణి కేంద్రం.. వార్తలు చదువుతున్నది... గత 75 సంవత్సరాల నుంచి  స్వతంత్ర భారతదేశంలో ప్రతిరోజూ 130 కోట్ల మంది ప్రజలకు చిరపరిచితమైన వ్యాఖ్యలు ఇవి. అతి పెద్ద ప్రజా ప్రసార మాధ్యమంగా గుర్తింపు పొందిన ఆకాశవాణి  75 సంవత్సరాల స్వాతంత్ర్య వేడుకలను వినూత్నంగా తనదైన ప్రత్యేక శైలిలో నిర్వహించేందుకు సన్నాహాలు పూర్తి చేసింది. దీనికోసం "ఆజాద్ భారత్ కీ బాత్- ఆకాశవాణి కే సాథ్" పేరుతో ఆగష్టు 15 నుంచి ఆకాశవాణి ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది. ఈ కార్యక్రమం 90 సెకండ్ల పాటు ఉంటుంది. 100.1ఎఫ్ఎం గోల్డ్ ఛానల్,  ప్రధాన వార్తల బులెటిన్‌లతో సహా అన్ని సామాజిక మాధ్యమాల్లో ఆకాశవాణి ప్రసారం చేస్తుంది. వివిధ రంగాలలో భారతదేశం సాధించిన ప్రగతి, అభివృద్ధి ని వివరిస్తూ కథల రూపంలో ఆకాశవాణి ప్రసారం చేస్తుంది. 

స్వతంత్ర దేశంగా అవతరించిన నాటి నుంచి  సూపర్ పవర్ గా ఎదిగిన భారతావని సాధించిన ప్రగతిపై  తమ విలేకరుల వ్యవస్థ ద్వారా సేకరించిన వార్తలు, కధనాలను ఆకాశవాణి ప్రసారం చేస్తుంది. దేశ వాణి పేరిట ప్రసారమయ్యే కార్యక్రమంలో మహాత్మా గాంధీ, హోమీ జహంగీర్ భాభా, సర్ సి వి రామన్, డాక్టర్ కురియన్ వర్గీస్, డాక్టర్ ఎం ఎస్ ఎస్ స్వామినాథన్, పండిట్ భీంసేన్ జోషి, మెల్విన్ డి మెల్లో, జస్దేవ్ సింగ్ వంటి ప్రముఖుల ప్రసంగాలు, స్వరాలను శ్రోతలకు  వినిపిస్తుంది. ప్రతిరోజు ఒక ప్రత్యేక కథనాన్ని ఆకాశవాణి ప్రసారం చేస్తుంది. ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్, ఫేస్‌బుక్ మరియు యూట్యూబ్‌లలోని ఆకాశవాణి  సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో  కథనం  అప్‌లోడ్ చేయబడుతుంది.Twitter లో @AkashvaniAir & @airnewsalerts,  newsonairofficial YouTube ఛానెల్, newsonair.gov.in, NewsonAir యాప్, Facebook మరియు Instagram లో కథనం అందుబాటులో ఉంటుంది. 

 8 జూన్, 1936 న ఆకాశవాణి ప్రారంభమయ్యింది. ప్రారంభమైనప్పటి నుంచి ఆకాశవాణి అనేక  మొదటి స్వాతంత్ర్య దినోత్సవం తో సహా దేశ చరిత్రలో అనేక ప్రధాన ఘట్టాలకు  సాక్షిగా నిలిచింది, 1947లో బంగ్లాదేశ్‌కు విముక్తి కలిగించడం  ప్రపంచ కప్ క్రికెట్‌లో భారతదేశం సృష్టించిన చరిత్ర కు ఆకాశవాణి సాక్షిగా నిలిచింది. 

  దేశవ్యాప్తంగా 479 కేంద్రాల నుంచి   23 భాషలు మరియు 179 మాండలికాలలో కార్యక్రమాలు ప్రసారం చేస్తున్న ఆకాశవాణి ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార సంస్థలలో ఒకటిగా గుర్తింపు పొందింది. ఆకాశవాణి ప్రసారాలు . దేశంలో  92 శాతం భౌగోళిక ప్రాంతం మరియు మొత్తం జనాభా లో 99.19 శాతానికి చేరుతున్నాయి.  'బహుజన్ హితయ: బహుజన్ సుఖాయ', అంటే 'ప్రజల  సంతోషం కోసం, ప్రజల  సంక్షేమం కోసం' స్ఫూర్తిగా ఆకాశవాణి పనిచేస్తోంది.

సామాజిక మాధ్యమాలు, ఆకాశవాణి ప్రసారాల ద్వారా  గత స్మృతులను,  అద్భుతమైన క్షణాలు ఆస్వాదించేందుకు శ్రోతలు సిద్ధంగా ఉండాలని ఆకాశవాణి కోరుతోంది. 

 

***



(Release ID: 1851751) Visitor Counter : 175