భూ శా స్త్ర మంత్రిత్వ శాఖ

ఎల్ ఈడి దీపాలకు శక్తిని అందించడానికి ప్రత్యేకంగా రూపొందించిన ఎలక్ట్రోడ్ ల మధ్య సముద్రపు నీటిని ఎలక్ట్రోలైట్గా ఉపయోగించే భారతదేశపు మొట్టమొదటి సెలైన్ వాటర్ లాంతర్ను ఆవిష్కరించిన కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్


డీప్ ఓషన్ మిషన్ ఆఫ్ ఇండియా అమలు పురోగతిని సమీక్షించడానికి చెన్నైలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ (ఎన్ ఐ ఒ టి) నిర్వహించి, ఉపయోగించిన కోస్టల్ రీసెర్చ్ వెసల్ -సాగర్ అన్వేషిక- ను సందర్శించిన మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్

సెలైన్ వాటర్ లాంతరు పేదలకు, , అవసరం లో ఉన్నవారికి, ముఖ్యంగా భారతదేశంలోని 7500 కిలోమీటర్ల పొడవైన తీర రేఖ వెంబడి నివసిస్తున్న మత్స్యకార సమాజానికి "జీవన సౌలభ్యాన్ని" అందిస్తుంది: డాక్టర్ జితేంద్ర సింగ్

ఉప్పునీటితో నడిచే రోషిణి ఎల్ఈడి దీపాలు కూడా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఉజాలా పథకానికి ఊతమిచ్చి, అనుబంధంగా ఉంటాయి.

నౌక పై త్రివర్ణ పతాకాన్ని ఎగుర వేసి 'హర్ ఘర్ తిరంగా' ప్రచారాన్ని 'హర్ జహాజ్ తిరంగా' వరకు విస్తరించిన డాక్టర్ జితేంద్ర సింగ్

Posted On: 13 AUG 2022 12:51PM by PIB Hyderabad

కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర హోదా) ఎర్త్ సైన్సెస్ శాఖ  సహాయ మంత్రి (స్వతంత్ర హోదా ) , పీఎంవో, సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్లు, అణుశక్తి, అంతరిక్ష శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ భారతదేశపు మొట్టమొదటి సెలైన్ వాటర్ లాంతర్ ను ప్రారంభించారు, ఇది ఎల్ ఇడి దీపాలకు శక్తిని అందించడానికి ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఎలక్ట్రోడ్ ల మధ్య ఎలక్ట్రోలైట్ గా సముద్రపు నీటిని ఉపయోగిస్తుంది.

చెన్నైలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ (ఎన్ఐఓటీ) ఆధ్వర్యంలోని సాగర్ అన్వేషిక అనే కోస్టల్ రీసెర్చ్ నౌక ను సందర్శించిన సందర్భంగా డాక్టర్ జితేంద్ర సింగ్ రోష్ని పేరుతో మొట్టమొదటి లాంతరును ఆవిష్కరించారు. సెలైన్ వాటర్ లాంతరు

భారత దేశం లోని 7500 కిలోమీటర్ల పొడవైన తీర రేఖ వెంట నివసిస్తున్న పేదలకు, 

అవసరమైన వారికి, ప్రత్యేకించి మత్స్యకార

కమ్యూనిటీకి  జీవన సౌలభ్యాన్ని తీసుకు

వస్తుందని డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు.

దేశవ్యాప్తంగా ఎల్ఈడి బల్బుల పంపిణీ కోసం 2015 లో ప్రారంభించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఉజాలా పథకానికి సెలైన్ వాటర్ లాంతరు కూడా ఊతం ఇచ్చి అనుబంధం గా ఉంటుందని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. ఇంధన మంత్రిత్వ శాఖ సోలార్ స్టడీ ల్యాంప్స్ వంటి పథకాలతో పాటు రోషిణి ల్యాంప్స్ ఇంధన భద్రత, ఇంధన ప్రాప్యత , జాతీయ ఆర్థిక వ్యవస్థ కార్బన్ ఉనికిని తగ్గించే లక్ష్యంతో శక్తివంతమైన పునరుత్పాదక ఇంధన కార్యక్రమాన్ని నడుపుతుందని ఆయన అన్నారు.

ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని సముద్ర జలాలు అందుబాటులో లేని లోతట్టు ప్రాంతాలలో కూడా ఉపయోగించవచ్చని, ఎందుకంటే ఏదైనా ఉప్పు నీరు లేదా ఉప్పుతో కలిపిన సాధారణ నీటిని లాంతరు ను  శక్తివంతం చేయడానికి ఉపయోగించవచ్చని , ఇది తక్కువ ఖర్చుతో కూడుకున్నది మాత్రమే గాక, నిర్వహణ కూడా చాలా సులభం అని డాక్టర్ జితేంద్ర సింగ్ సూచించారు, రోషిణి దీపాన్ని కనుగొన్నందుకు ఎన్ఐఓటి బృందాన్ని మంత్రి అభినందించారు. గ్రామీణ ,మారుమూల ప్రాంతాల లోనూ,  ఇంకా విపత్తుల సమయంలోనూ అపారమైన సహాయం చేయగల ఈ బహుళ ప్రయోజన దీపాల భారీ ఉత్పత్తి కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిశ్రమకు బదిలీ చేయాలని వారికి సూచించారు.

అనంతరం డాక్టర్ జితేంద్ర సింగ్, ఎంవోఈఎస్ కార్యదర్శి డాక్టర్ ఎం.రవిచంద్రన్ తో  కలిసి ప్రయోగశాలలను సందర్శిచారు. ఈ సందర్భంగా  'హర్ ఘర్ తిరంగా' ప్రచారాన్ని 'హర్ జహాజ్ తిరంగా' వరకు విస్తరిస్తూ మంత్రి నౌక పై  త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. నౌకలో ఉన్న ఎన్ఐఓటీకి చెందిన సీనియర్ శాస్త్రవేత్తలతో సమావేశమైన ఆయన డీప్ ఓషన్ మిషన్ ఆఫ్ ఇండియా అమలు పురోగతిని సమీక్షించారు.

లక్షద్వీప్ దీవుల్లో విజయవంతంగా ప్రదర్శించబడిన సముద్రపు నీటిని త్రాగునీరుగా మార్చడానికి ఎన్ఐఓటి అభివృద్ధి చేసిన లో టెంపరేచర్ థర్మల్ డీశాలినేషన్ (ఎల్టిటిడి) సాంకేతిక పరిజ్ఞానం పురోగతిని కూడా డాక్టర్ జితేంద్ర సింగ్ సమీక్షించారు. కేంద్ర పాలిత ప్రాంతమైన లక్షద్వీప్ లోని కవరట్టి, అగటి, మినికాయ్ దీవుల్లో ఎల్ టిటిడి టెక్నాలజీ ఆధారంగా మూడు డీశాలినేషన్ ప్లాంట్లను అభివృద్ధి చేసి ప్రదర్శించినట్లు ఆయన తెలియజేశారు. ఈ ప్రతి ఎల్ టిటిడి ప్లాంట్ రోజుకు లక్ష లీటర్ల త్రాగునీటిని అందించే సామర్థ్యం కలిగి ఉంది.

ఈ ప్లాంట్ల విజయం ఆధారంగా కేంద్ర పాలిత ప్రాంతం లక్షద్వీప్ ద్వారా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ (ఎంహెచ్ఎ) అమిని, ఆండ్రోత్, చెట్లెట్, కద్మత్, కల్పెని , కిల్టాన్ లలో రోజుకు 1.5 లక్షల లీటర్ల సామర్థ్యంతో మరో ఆరు ఎల్టిటిడి ప్లాంట్లను ఏర్పాటు చేసే పనిని అప్పగించిందని ఎంఒఇఎస్ కార్యదర్శి డాక్టర్ ఎం. రవిచంద్రన్ డాక్టర్ జితేంద్ర సింగ్ కు  వివరించారు. ఎల్ టిటిడి టెక్నాలజీ లక్షద్వీప్ దీవులకు అనువైనదిగా కనుగొన్నారు, సముద్ర ఉపరితల నీరు , లోతైన సముద్ర జలాల మధ్య 15⁰ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వ్యత్యాసం ఇప్పటి వరకు లక్షద్వీప్ తీరాల సమీపంలో మాత్రమే గుర్తించారు.

డీశాలినేషన్ ప్లాంట్ కయ్యే ఖర్చు- ఉపయోగించిన టెక్నాలజీ ,ప్లాంట్ లొకేషన్ తో సహా అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. లక్షద్వీప్ దీవుల్లోని ఆరు ఎల్ టి టి డి ప్లాంట్ల మొత్తం వ్యయం రూ. 187.75 కోట్లు.

 

 

<><><><><>



(Release ID: 1851745) Visitor Counter : 191