శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
స్టార్టప్ ఎకో సిస్టమ్ లోనూ, యూని కార్న్ ల సంఖ్య పరంగానూ ప్రపంచవ్యాప్తంగా 3వ స్థానంలో ఉన్న భారత్: కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్
భారతీయ సైన్స్, టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ (ఎస్టిఐ) లో పరివర్తనాత్మక మార్పులను తీసుకు రానున్న 2021-30 దశాబ్దం : డాక్టర్ జితేంద్ర సింగ్
డి ఎస్ టి స్టార్టప్ ఉత్సవ్ లో ప్రధానోపన్యాసం చేసిన డాక్టర్ జితేంద్ర సింగ్, భారతదేశం గత కొన్ని సంవత్సరాలలో పరిశోధన , అభివృద్ధిపై స్థూల వ్యయాన్ని మూడు రెట్లు పెంచింది.
స్టార్టప్ లలో 49 శాతం టైర్ -2, టైర్ -3 నగరాలకు చెందిన ఐటీ, వ్యవసాయం, విమానయానం, విద్య, ఇంధనం, ఆరోగ్యం, అంతరిక్ష రంగాలు వంటి రంగాల్లో
పనిచేస్తున్నవే: డాక్టర్ జితేంద్ర సింగ్
Posted On:
12 AUG 2022 2:42PM by PIB Hyderabad
స్టార్ట్-అప్ ఎకోసిస్టమ్ లోనూ, యునికార్న్ ల సంఖ్య పరంగానూ భారతదేశం ప్రపంచవ్యాప్తంగా మూడవ స్థానంలో ఉంది. తాజా డేటా ప్రకారం, ప్రస్తుతం 105 యునికార్న్ లు ఉన్నాయి, వీటిలో 44- 2021
లోనూ, 19 - 2022 లోనూ మొదలయ్యాయి.
కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర హోదా) ఎర్త్ సైన్సెస్ శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర హోదా ) , పీఎంవో, సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్లు, అణుశక్తి, అంతరిక్ష శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఈ విషయం తెలియచేశారు. డాక్టర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్ లో జరిగిన ‘డి ఎస్ టి స్టార్టప్ ఉత్సవ్ ‘ లో ఆయన ప్రధానోపన్యాసం చేశారు.
2021-30 దశాబ్దం భారతీయ సైన్స్, టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ (ఎస్ టిఐ) లో పరివర్తనాత్మక మార్పులను తీసుకువస్తుందని భావిస్తున్నట్టు మంత్రి తెలిపారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో, భారతదేశం గత కొన్నేళ్లలో పరిశోధన , అభివృద్ధిపై స్థూల వ్యయాన్ని మూడు రెట్లు పెంచిందని డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు. తాజా సమాచారం ప్రకారం, భారతదేశంలో 5 లక్షల మందికి పైగా పరిశోధన , అభివృద్ధి సిబ్బంది ఉన్నారని, గత ఎనిమిది సంవత్సరాలలో ఈ సంఖ్య 40-50% పెరిగిందని ఆయన చెప్పారు.
డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ, బాహ్య సంబంధిత (ఎక్స్ట్రామురల్) ఆర్ అండ్ డి లో మహిళల భాగస్వామ్యం కూడా రెట్టింపు అయిందని, ఇప్పుడు సైన్స్ అండ్ ఇంజనీరింగ్ (ఎస్ అండ్ ఇ) లో యుఎస్ఎ, చైనా తరువాత ఇచ్చే పి హెచ్ డి ల సంఖ్య పరంగా భారతదేశం 3 వ ర్యాంకును ఆక్రమించిందని అన్నారు. ప్రపంచ దేశాలలో మారుతున్న పరిణామాలు, సాంకేతిక పరిజ్ఞానం అంతర్జాతీయ భాగస్వామ్యాలు, పాలన విధానాల రూపకల్పనకు కేంద్ర బిందువుగా మారడంతో, నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం ప్రపంచ బెంచ్ మార్క్ అనుగుణంగా పని చేస్తోందని ఆయన పేర్కొన్నారు.
2015లో ఎర్రకోట నుంచి స్టార్టప్ ఇండియాను ప్రధాని మోదీ ప్రారంభించిన విషయాన్ని డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రస్తావిస్తూ, నేడు 75వ స్వాతంత్య్ర దినోత్సవం నాటికి భారత్ 75,000 స్టార్టప్ లకు కేంద్రం గా మారిందని చెప్పారు. సైన్స్, టెక్నాలజీ, ఇన్నోవేషన్ లపై మోదీ ప్రత్యేక దృష్టి దేశంలోని యువతలో సృజనాత్మకతకు, కొత్త ఆలోచనలతో సమస్యలను పరిష్కరించడానికి స్ఫూర్తిని రగిలించిందని మంత్రి అన్నారు.ఈ రోజు భారతదేశ స్టార్టప్ లు మెట్రోలు లేదా పెద్ద నగరాలకు మాత్రమే పరిమితం కాదని, స్టార్టప్ లలో 49 శాతం టైర్ -2 , టైర్ -3 నగరాలకు చెందినవని ఆయన అన్నారు.ఐటి,
వ్యవసాయ రంగం, వైమానిక రంగం, విద్య , ఇంధనం, ఆరోగ్యం , అంతరిక్ష రంగాలలో
స్టార్టప్ లు అభివృద్ధి చెందుతున్నాయని ఆయన తెలిపారు.
టెక్నాలజీ బిజినెస్ ఇంక్యుబేటర్ (టిబిఐ) ఫ్లాగ్ షిప్ ప్రోగ్రామ్ సహా వివిధ ‘నిధి‘ భాగాల కింద ఆశాజనక స్టార్టప్ ల విశేషాలు తెలిపే కలిగి నాలుగు ప్రచురణలను, 51 కవాచ్ (సి ఎ డబ్ల్యు ఎ సి హెచ్ ) నిధులతో పని చేస్తున్న స్టార్ట్-అప్ ల కాఫీ టేబుల్ బుక్ ను డాక్టర్ జితేంద్ర సింగ్ ఈ సందర్భంగా విడుదల చేశారు.
సైన్స్ అండ్ టెక్నాలజీపై బలమైన దృష్టి సారించడం వల్ల ప్రపంచంలో టెక్నాలజీ లావాదేవీలకు అత్యంత ఆకర్షణీయమైన పెట్టుబడుల గమ్యస్థానాలలో భారతదేశం మూడవ స్థానంలో ఉందని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. శాస్త్రీయ పరిశోధన రంగంలో భారత దేశం ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉందని, అంతరిక్షాన్వేషణ రంగంలో తొలి ఐదు దేశాలలో ఒకటిగా నిలబడుతోందని, క్వాంటమ్ టెక్నాలజీలు, ఆర్టిఫిషియ ల్ ఇంటెలిజెన్స్ వంటి అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానాలలో కూడా చురుగ్గా పాలుపంచుకుంటోందని ఆయన అన్నారు.
సెంటర్ ఫర్ ఆగ్మెంటింగ్ వార్ విత్ కోవిడ్-19 (సి ఎ డబ్లు ఎ సి హెచ్) కార్యక్రమాన్ని డి ఎస్ టి కోవిడ్ మహమ్మారి మొదలైన రికార్డు సమయంలోనే రూపొందించిందని, ఇది కోవిడ్ ఉత్పత్తులు, పరిష్కారాలపై పనిచేసే స్టార్టప్లకు మద్దతు ఇచ్చిన మరే ఇతర భారత ప్రభుత్వ శాఖ చేపట్టని మొదటి కార్యక్రమం అని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు.
మొత్తం మీద, సృజనాత్మకత , వ్యవస్థాపకతపై డి ఎస్ టి కార్యక్రమం ప్రభావం , ఫలితం గణనీయంగా ఉందని ఆయన అన్నారు: 160 ఇంక్యుబేటర్లను ప్రోత్సహించడం, 1627 మంది మహిళల నేతృత్వంలోని స్టార్టప్ లతో సహా 12,000 స్టార్టప్ లను పెంపొందించడం, 1,31, 648 ఉద్యోగాలను సృష్టించడం జరిగిందని వివరించారు.
గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ (జిఐఐ) గ్లోబల్ ర్యాంకింగ్ లో భారతదేశం 2015 లో 81 వ స్థానంలో ఉండగా 2021 నాటికి ప్రపంచంలోని 130 ఆర్థిక వ్యవస్థలలో 46 వ స్థానానికి పెరిగిందని డాక్టర్ జితేంద్ర సింగ్ తెలియజేశారు. జిఐఐ పరంగా 34 దిగువ మధ్య-ఆదాయ ఆర్థిక వ్యవస్థలలో భారతదేశం 2 వ స్థానంలోనూ, 10 మధ్య , దక్షిణ ఆసియా ఆర్థిక వ్యవస్థలలో ఒకటవ స్థానంలోనూ ఉంది. జిఐఐ ర్యాంకింగ్ లో స్థిరమైన మెరుగుదలకు అపారమైన నాలెడ్జ్ క్యాపిటల్, శక్తివంతమైన స్టార్టప్ ఎకోసిస్టమ్, ఇంకా ప్రభుత్వ - ప్రైవేట్ పరిశోధనా సంస్థలు చేసిన కొంత అద్భుతమైన కృషి కారణం అని మంత్రి తెలిపారు.
డిఎస్ టి కార్యదర్శి డాక్టర్ ఎస్ చంద్రశేఖర్ మాట్లాడుతూ, భారతదేశం ఇటీవలి 7-8 సంవత్సరాలలో ఎస్ టి ఐ రంగాలలో కొంత అపూర్వమైన పురోగతిని సాధించింది అనేక ప్రచురణల పరంగా దేశం మొత్తం పనితీరులో గణనీయమైన పెరుగుదల ఉంది (నేషనల్ సైన్స్ ఫౌండేషన్ డేటాబేస్ ఆధారంగా 2013లో 6వ స్థానం నుండి ప్రపంచవ్యాప్తంగా 3వ స్థానంలో ఉంది), గత 7 సంవత్సరాలలో పేటెంట్లు (రెసిడెంట్ పేటెంట్ ఫైలింగ్ పరంగా ప్రపంచవ్యాప్తంగా 9వ స్థానంలో ఉంది) పరిశోధన ప్రచురణల నాణ్యత (2013లో 13వ స్థానం నుండి ప్రపంచవ్యాప్తంగా 9వ స్థానంలో) ఉంది. డిఎస్ టి ప్రారంభించిన నిధి కార్యక్రమం స్టార్టప్ లకు చాలా అవసరమైన మద్దతును వేగంగా ప్రాసెస్ చేసిందని, బిజినెస్ ఇంక్యుబేటర్లు , ఇతర బిజినెస్ సపోర్ట్ ప్రొవైడర్ ల క్రియాశీల మద్దతును ఉత్ప్రేరకం చేస్తుందని ఆయన పేర్కొన్నారు.
దేశవ్యాప్తంగా నిధి మద్దతు కలిగిన వివిధ రంగాల 75 ప్రభావవంతమైన ఇంక్యుబేటెడ్ స్టార్టప్ (50 భౌతికంగా) , 25 డిజిటల్ మోడ్) స్టాల్స్ ను ఈ సందర్భంగా డి ఎస్ టి స్టార్టప్ ఎక్స్ పో లో ప్రదర్శించారు.
ఎన్ ఎమ్-ఐసిపిఎస్ టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్ ల నుండి 5 స్టార్టప్ లు కూడా 50 స్టార్టప్ స్టాల్స్ లో ఉన్నాయి.
స్టార్టప్ లు, ఇంక్యుబేటర్లు, ఇంక్యుబేటర్ అసోసియేషన్ ఐఎస్ బిఎ- దేశవ్యాప్తంగా ఉన్న ఆర్గనైజర్ లు, టీమ్ డి ఎస్ టి, ఇన్నోవేషన్ ఛాంపియన్ లను డాక్టర్ జితేంద్ర సింగ్ అభినందించారు. మన గొప్ప దేశం ప్రగతిదాయక గాథను ఉత్ప్రేరకం చేయడానికి, డి ఎస్ టి స్టార్టప్ ఉత్సవ్ గొప్ప విజయం సాధించడానికి వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలవంతం కావాలని కేంద్ర మంత్రి ఆకాంక్షించారు.
<><><><><>
(Release ID: 1851495)
Visitor Counter : 280