రక్షణ మంత్రిత్వ శాఖ
వ్యూహాత్మక నాయకత్వ కార్యక్రమం
Posted On:
10 AUG 2022 5:12PM by PIB Hyderabad
2022 జూలై నెలలో భారత వైమానిక దళం (ఐఎఎఫ్) , ఈజిప్టు వైమానిక దళం (ఇఎఎఫ్) తో కలసి , కైరో పశ్చిమ వైమానిక స్థావరంలోని ఈజిప్షియన్ ఫైటర్ వెపన్ స్కూలులో నెల రోజుల పాటు కార్యక్రమాలు నిర్వహించింది. ఈ తరహా కార్యక్రమాన్ని నిర్వహించడం ఉభయ వైమానిక దళాలకు ఇది ప్రథమం. దీనిని ఉభయ దేశాల ఫైటర్ వెపన్ స్కూల్స్ మధ్య నిర్వహించడం జరిగింది. ఐఎఎఫ్ తరఫున వ్యూహాత్మక, ఎయిర్ కంబాట్ డవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్ మెంట్ (టిఎసిడిఇ) ఈకార్యక్రమంలో పాల్గొనింది. మూడు సుఖోయ్ 30 ఎంకెఐ ఎయిర్ క్రాఫ్ట్ లు , ఆరు కంబాట్ ఇన్ స్ట్రక్టర్ పైలట్‌లు ఇందులో పాల్గొన్నారు.
రెండు వైమానిక దళాల మద్య పరస్పర సంభాషణలు ఇఎఎఫ్ వ్యూహాత్మక నాయకత్వ కార్యక్రమం కింద జరిగాయి. దీనిద్వారా సంక్లిష్టమైన, బహుళ ఎయిర్ క్రాఫ్ట్ మిషన్‌ల విషయంలో పెద్ద ఎత్తున బలగాలను వినియోగించే రంగానికి సంబంధించి ఉభయపక్షాల మధ్య ఫలవంతమైన రీతిలో అభిప్రాయాలు ఇచ్చిపుచ్చుకోవడం జరిగింది.
ఈ సమావేశం సందర్బంగా ఐఎఎఫ్ పైలట్లు బహుళ సంక్లిష్టలతో కూడిన ఇఎఎఫ్ మిషన్ లో పాల్గొన్నవారితో కలసి విన్యాసాలలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు తమ అనుభవాలను ఇతరులతో పంచుకున్నారు. అలాగే ఎయిర్ కంబాట్ శాస్త్రం,ఇతర అంశాల గురించి చర్చించారు. అలాగే వారు అనుసరించిన అత్యుత్తమ విధానాలు వివరించారు..
ఇండక్షన్ , డి-ఇండక్షన్‌లో విమానాలు ఆరుగంటలకు పైగా పాల్గొన్నాయి. ఈ సందర్భంగా ఐఎఎఫ్, యుఎఇ కి చెందిన గగన తలంలో ఇంధనం నింపే వ్యవస్థలు తమ మద్దతునిచ్చాయి.
సినర్జిస్టిక్ ఎయిర్ ఆపరేషన్స్‌తో కూడిన ఈ కార్యక్రమం రెండు వైమానిక దళాల మధ్య ఉన్నత స్థాయి వృత్తిపరమైన విశ్వాసాన్ని కల్పించింది.
రెండు వైమానిక దళాల మధ్య బంధం 1960ల నాటిది.
గ్రూప్ కెప్టెన్ కపిల్ భార్గవ , ఇఎఎప్ టెస్ట్ పైలట్‌గ, ఈజిప్షియన్ హెచ్ ఎ 300 కుసంబంధించిన ఈజిప్షియన్ నమూనాను ప్రయోగాత్మకంగా నడిపి చూశారు. దీని తర్వాత భారతీయ క్వాలిఫైడ్ ఫ్లయింగ్ ఇన్‌స్ట్రక్టర్లు యువ ఈజిప్షియన్ పైలట్‌లకు శిక్షణ ఇచ్చారు - ఈ కార్యక్రమం 1980ల వరకు కొనసాగింది.
(Release ID: 1851111)
Visitor Counter : 133