ఆర్థిక మంత్రిత్వ శాఖ

మధ్యప్రదేశ్‌లో ఆదాయపు పన్ను శాఖ సోదాలు

Posted On: 10 AUG 2022 5:45PM by PIB Hyderabad

మైనింగ్చక్కెర తయారీ మరియు లిక్కర్ వ్యాపారంలో ఉన్న ఓ సంస్థపై ఆదాయపు పన్ను శాఖ 14.07.2022న సోదాలు నిర్వహించింది. ఈ గ్రూపులోని కీలక వ్యక్తి రాజకీయాలలో ఉన్నారు. ఆదాయపు పన్ను మధ్యప్రదేశ్, ముంబైలోని అనేక ప్రదేశాలలో సోదాలు చేసింది.

ఈ సోదాల సమయంలోపెద్ద సంఖ్యలో నేరారోపణ సంబంధిత డాక్యుమెంటరీలను, డిజిటల్ ఆధారాలు కనుగొన్నారు. అనంతరం వాటిని స్వాధీనం చేసుకున్నారు.

ఇసుక మైనింగ్ వ్యాపారానికి సంబంధించి స్వాధీనం చేసుకున్న సాక్ష్యాలను పరిశీలించగాసాధారణ ఖాతా పుస్తకాలలో విక్రయాలను నమోదు చేయకుండా సమూహం పన్ను ఎగవేతకు పాల్పడుతున్నట్లు వెల్లడైంది. డిజిటల్ సాక్ష్యం ప్రకారం వాస్తవ విక్రయాల పోలికసమకాలీన నెలల అమ్మకాలతో పోల్చితేరూ. 70 కోట్ల కంటే ఎక్కువ అమ్మకాలు జరిగినట్లు స్పష్టంగా తేలింది. లెక్కలు చూపని విక్రయాలపై రాయల్టీ చెల్లించలేదన్న ఆధారాలు కూడా లభ్యమయ్యాయి. ఇంకారూ.10 కోట్ల కంటే ఎక్కువ మొత్తాన్ని సంస్థ ద్వారా ఇతర వ్యాపార సహచరులకు నగదు రూపంలో చెల్లించినట్లు అధికారులు కనుగొన్నారు.

చక్కెర తయారీ వ్యాపారం విషయంలోస్టాక్ వ్యత్యాసానికి సంబంధించిన సమస్యలు కూడా గుర్తించబడ్డాయి.

ఇసుక మైనింగ్ వ్యాపారం చేస్తున్న సంస్థలో కొందరు బినామీదార్లను భాగస్వాములను చేసి ఆదాయపు పన్ను రిటర్న్స్‌లో కూడా లాభాలు పొందుతున్నట్లు సోదాల సందర్భంగా సేకరించిన ఆధారాలు వెల్లడిస్తున్నాయి. డబ్బును వాస్తవానికి వారు గ్రూప్ ప్రయోజనకరమైన యజమానికి బదిలీ చేశారు. శోధన సమయంలోఅటువంటి బినామీదారు తన ప్రకటనలోకేవలం జీతం పొందే ఉద్యోగి అనివ్యాపార వ్యవహారాలపై ఎటువంటి అవగాహన లేదని లేదా అటువంటి వ్యాపారం నుండి ఎటువంటి లాభాలు పొందలేదని అంగీకరించాడు.

ఇప్పటి వరకు జరిగిన సోదాలలో రూ.9కోట్లకు మించిన అప్రకటిత ఆస్తులను ఆదాయపు పన్ను శాఖ జప్తు చేసింది.

తదుపరి విచారణ కొనసాగుతోంది.

****



(Release ID: 1850732) Visitor Counter : 134


Read this release in: English , Urdu , Hindi , Marathi