శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

వాతావరణ పరిరక్షణ కోసం భారతదేశ రోడ్ మ్యాప్ ను వివరించిన కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్


ప్రపంచ స్థాయిలో ఈ సమస్యను పరిష్కరించడంలో ప్రధాన పాత్ర పోషిస్తున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ

" సమగ్ర విధాన రూపకల్పనకు దోహదపడే వ్యవస్థల విశ్లేషణ " పై న్యూఢిల్లీ లో జరిగిన అంతర్జాతీయ సదస్సులో ప్రారంభోపన్యాసం చేసిన మంత్రి

సిస్టమ్స్ విశ్లేషణ సాధనాల బహుళ విధ అనువర్తనాన్ని ఉపయోగించి పరిష్కారాలను రూపొందిస్తున్న మలేషియా, శ్రీలంక, ఆస్ట్రియా, యు ఎస్ ఎ చైనా, ఇరాన్, ఫిలిప్పీన్స్, జపాన్ , జోర్డాన్ ప్రతినిధులు

విపత్తు నిర్వహణలో భారతదేశం అగ్రగామిగా ఉన్నందున, వాతావరణ మార్పు వంటి ప్రపంచ సవాళ్ల కోసం ప్రపంచం మన వైపు చూస్తోంది: డాక్టర్ జితేంద్ర సింగ్

Posted On: 10 AUG 2022 5:17PM by PIB Hyderabad

‘‘ఇంటిగ్రేటెడ్ పాలసీ మేకింగ్ పై సిస్టమ్స్ ఎనాలిసిస్" అనే అంశంపై 3 రోజుల అంతర్జాతీయ సదస్సును ఈ రోజు ఢిల్లీ లో ప్రారంభించిన సందర్భంగా, కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర హోదా) ఎర్త్ సైన్సెస్ శాఖ  సహాయ మంత్రి (స్వతంత్ర హోదా ) , పీఎంవో, సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్లు, అణుశక్తి, అంతరిక్ష శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ వాతావరణ పరిరక్షణ కోసం భారతదేశ రోడ్ మ్యాప్ ను పంచుకున్నారు.  ప్రపంచ స్థాయిలో ఈ సమస్యను పరిష్కరించడంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రముఖ పాత్ర పోషిస్తున్నారని ఆయన చెప్పారు.

 

డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ, ప్రధాని మోదీ ఆధ్వర్యంలో భారతదేశం ఉమ్మడి-  కానీ భిన్నమైన బాధ్యత (సి బి డి ఆర్) సూత్రంపై ఉపశమన చర్యల రోడ్‌మ్యాప్‌ ను రూపొందించి ప్రపంచానికి అందించిందని అన్నారు.2030 నాటికి భారతదేశం మొత్తం గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాలను (GHG) ఒక బిలియన్ టన్నుల మేరకు తగ్గించేందుకు కట్టుబడి ఉందని, 2030లో మొత్తం వినియోగంలో శిలాజ ఇంధనాలపై ఆధారపడటాన్ని 50 శాతం తగ్గించాలని ఆయన సూచించారు; 2005 స్థాయిల నుండి జి డి పి తీవ్రతకు కార్బన్‌ను 45 శాతం తగ్గించాలని, 2070 నాటికి దేశం మొత్తాన్ని కార్బన్‌ తటస్థంగా చేయాలని సూచించారు.

 

ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ అప్లైడ్ సిస్టమ్స్ అనాలిసిస్ (ఐ.ఐ.ఎ.ఎస్.ఎ)తో కలిసి డిపార్ట్ మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (డిఎస్ టి) ఆధ్వర్యంలోని స్వయంప్రతిపత్తి కలిగిన సంస్థ అయిన టెక్నాలజీ ఇన్ఫర్మేషన్, ఫోర్ కాస్టింగ్ అండ్ అసెస్ మెంట్ కౌన్సిల్ (టిఐఎఫ్ఎసి) నిర్వహించిన ఈ సదస్సుకు సుమారు 1000 మంది విద్యావేత్తలు, పరిశోధకులు, అభ్యాసకులు, ప్రభుత్వ అధికారులు, ఐఎఎస్ఎ ప్రతినిధులు, వివిధ విభాగాలకు చెందిన పాలసీ ప్లానర్లు హాజరయ్యారు. ఆలోచనలను రూపొందించడం, వాతావరణ మార్పుల సంక్లిష్ట సమస్యలను గుర్తించడం జరుగుతోంది.  కాలుష్యం, పరిశుభ్రమైన ఇంధనం, జీవనోపాధి, డిజిటలైజేషన్ ను మూడు రోజుల సదస్సులో ఆసియా అంతటా ఉన్న దేశాలు విస్తృతంగా పంచుకున్నాయి.

 

మలేసియా, శ్రీలంక, ఆస్ట్రియా, యుఎస్ఎ, చైనా, ఇరాన్, ఫిలిప్పీన్స్, జపాన్ ,జోర్డాన్ దేశాల ప్రతినిధులు వివిధ భాగస్వాముల మధ్య విస్తృతమైన పరస్పర చర్యలపై దృష్టి సారించి వ్యవస్థల విశ్లేషణ సాధనాల బహుళ విధ అనువర్తనాన్ని ఉపయోగించి పరిష్కారాలను రూపొందిస్తున్నారు.

 

భారతదేశం దాని ప్రత్యేకమైన భౌగోళిక-వాతావరణ పరిస్థితుల కారణంగా సాంప్రదాయకంగా ప్రకృతి వైపరీత్యాలకు గురవుతుందని మంత్రి అన్నారు. వరదలు, కరువులు, తుఫానులు, భూకంపాలు, కొండచరియలు విరిగిపడటం పునరావృతమయ్యే ఉపద్రవాలుగా ఉన్నాయి, కానీ ఇటీవలి సంఘటనలు వాతావరణ మార్పుకు ఆపాదించబడుతున్న అనూహ్యమైన తరచుదనం , తీవ్రతతో అస్థిరంగా మారాయి. విపత్తుల నిర్వహణలో భారతదేశం అగ్రగామిగా ఉన్నందున, వాతావరణ మార్పు వంటి ప్రపంచ సవాళ్ల కోసం ప్రపంచం మన వైపు చూస్తోందని మంత్రి అన్నారు.

 

20 వ శతాబ్దం ప్రారంభం నుండి ప్రపంచ సగటు ఉష్ణోగ్రత పెరిగిందని, సముద్ర మట్టాలు పెరిగాయని, మహాసముద్రాలు వేడెక్కాయని, ఆమ్లంగా మారాయని, భూమి, సముద్ర మంచు కరిగిపోయిందని, వాతావరణ కార్బన్ డయాక్సైడ్ స్థాయి పెరిగిందని డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు.

వాతావరణ మార్పులకు మానవ కార్యకలాపాలే ఎక్కువగా కారణమని విస్తృతంగా భావిస్తున్నామని, ఇవి ఆహార అభద్రత ,నీటి కొరతకు దారితీయవచ్చునని ఆయన అన్నారు: అదేవిధంగా, విపత్తులు, వాతావరణ మార్పుల ఘటనలు వర్షపాతం పెరగడానికి లేదా తగ్గడానికి దారితీశాయని, ఇది నీటి సరఫరాపై ప్రభావం చూపిందని, ఇది కొరత లేదా వరదలు లేదా స్తబ్దతకు దారితీసిందని మంత్రి తెలిపారు.

 

ఈ భారీ వాతావరణ మార్పులకు వ్యతిరేకంగా ఒంటరిగా పోరాడలేమని, వాతావరణ మార్పులను తగ్గించడం , సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను (ఎస్ డిజిలు) సాధించడం అనే భాగస్వామ్య లక్ష్యం దిశగా శాస్త్రీయ సమాజాలు సామరస్యంగా మాట్లాడాల్సిన అవసరం ఉందని డాక్టర్ జితేంద్ర సింగ్ నొక్కి చెప్పారు.

 

వాతావరణ మార్పులను ఎదుర్కోవడానికి సమష్టి కృషితో వ్యవస్థల పరిశోధన , రూపకల్పన విధాన నిర్దేశాల కోసం బలమైన ప్రాంతీయ సహకారాన్ని నిర్మించాలని మంత్రి పిలుపునిచ్చారు.

 

కోవిడ్-19 సహజసిద్ధమైన స్థితిస్థాపకత సామర్థ్యాలను తీసుకువచ్చిందని, మహమ్మారి విజృంభించినప్పుడు, పిపిఈ కిట్లు, తగినంత మాస్క్లు లేదా చికిత్స ప్రోటోకాల్స్ లేవు, కానీ మోడీ విజన్ కింద భారతదేశం తక్కువ వ్యవధిలో దేశీయంగా రెండు వ్యాక్సిన్లు - కోవాగ్జిన్ ,కోవిషీల్డ్ లను  విజయవంతంగా అభివృద్ధి చేసి ముందుకు వచ్చిందని,  తరువాత డిఎన్ఎ వ్యాక్సిన్ ను కూడా  అభివృద్ధి చేసిందని డాక్టర్ జితేందర్ సింగ్ తెలిపారు.

 

ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ గా ప్రసిద్ధి చెందిన భారతదేశ 75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని వ్యవస్థ విశ్లేషణపై ఈ అతి ముఖ్యమైన సదస్సుకు ఆతిథ్యం ఇవ్వడం భారతదేశానికి గర్వకారణమని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు.

ప్యానెల్ చర్చలు, ప్లీనరీలు , సంప్రదింపుల రూపంలో జరిగే చర్చలు, సిస్టమ్స్ విశ్లేషణ యొక్క విభిన్న డొమైన్‌లలోని చర్చలతో శాస్త్రీయ సమాజం తనను తాను సుసంపన్నం చేసుకుంటుందని , స్థిరమైన భవిష్యత్తు కోసం సామూహిక సంకల్పాన్ని మరింత బలోపేతం చేస్తుందని కూడా ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

 

భారత ప్రభుత్వ ప్రధాన శాస్త్రీయ సలహాదారు ప్రొఫెసర్ అజయ్ కె సూద్ మానవాళి ఎదుర్కొంటున్న అపూర్వమైన సవాళ్లను ఎదుర్కోవడానికి కొత్త సమీకృత విధానాలు, సాధనాలు అవసరమని నొక్కిచెప్పారు. వాతావరణ మార్పు, ఆహార భద్రత వంటి

భవిష్యత్తు సవాళ్ల నష్టాలు తగ్గించడానికి

దృఢమైన సమిష్టి వ్యవస్థ , దీర్ఘకాలిక పరిష్కారాలు అవసరమని ఆయన అన్నారు. ఈ వర్క్ షాప్ కొత్త ఆలోచనలు, తక్కువ హాని కlలిగిన ప్రపంచం కోసం దార్శ నికతను తీసుకు వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

 

ఎర్త్ సైన్సెస్ మంత్రిత్వ శాఖ, పర్యావరణ, అటవీ ,వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ, వ్యవసాయ ,రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, జల్ శక్తి మంత్రిత్వ శాఖ ,ఇతర మంత్రిత్వ శాఖ ల నుండి ప్రతినిధులు, అలాగే

యునైటెడ్ నేషన్స్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం (యు ఎన్ డి పి), వరల్డ్ రిసోర్సెస్ ఇన్‌స్టిట్యూట్ ( డ బ్ల్యూ ఆర్ ఐ) , ఆసియన్ అండ్ పసిఫిక్ సెంటర్ ఫర్ ట్రాన్స్‌ఫర్ ఆఫ్ టెక్నాలజీ (ఏ పి సి టి టి) నుండి,  ఇంకా  డ్యూయిష్ గెసెల్స్చాఫ్ట్ (జిఐజడ్) జిఎంబిహెచ్ వంటి ప్రముఖ సంస్థల ప్రతినిధులు కూడా ఈ సదస్సు లో వివిధ అంశాలకు సంబంధించిన అంతర్దృష్టులను అందజేస్తున్నారు.

  <><><><><>



(Release ID: 1850676) Visitor Counter : 139


Read this release in: English , Urdu , Hindi , Marathi