సూక్ష్మ, లఘు, మధ్య తరహా సంస్థల మంత్రిత్వ శాఖష్
ఆత్మ నిర్భర్ భారత్ కింద ఎంఎస్ఎంఈల కోసం పథకాలు
Posted On:
08 AUG 2022 3:25PM by PIB Hyderabad
దేశంలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (MSMEలు) రంగాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ కింద అనేక కార్యక్రమాలు చేపట్టింది. రెండు ప్రధాన పథకాల వివరాలు:
- ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారెంటీ స్కీమ్ (ECLGS): ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారెంటీ పథకాన్ని మే, 2020లో ఆత్మ నిర్భర్ భారత్ ప్యాకేజీలో భాగంగా, అర్హత కలిగిన ఎంఎస్ఎంఈలు మరియు ఇతర వ్యాపార సంస్థలకు కోవిడ్-19 సంక్షోభం నుంచి కోలుకునేందుకు తమ కార్యకలాపాల నిర్వహణ మరియు పునఃప్రారంభం చేయడానికి సహాయం చేస్తుంది. ఈ పథకం ఆర్థిక వ్యవస్థలోని అన్ని రంగాలను కవర్ చేస్తుంది. దీని కింద, అర్హత కలిగిన రుణగ్రహీతలకు విస్తరించిన క్రెడిట్ సదుపాయానికి సంబంధించి సభ్య రుణ సంస్థలకు (మెంబర్ లెండింగ్ ఇన్స్టిట్యూషన్స్) 100% హామీ అందించబడుతుంది. పథకం వ్యాలిడిటీ 31.03.2023.
- స్వయం సమృద్ధ భారత్ (SRI) ఫండ్: ఎంఎస్ఎంఈలలో ఈక్విటీ ఫండింగ్‌ను పెంచడానికి, వృద్ధి చెందగల సామర్థ్యం మరియు సాధ్యాసాధ్యాలు కలిగిన ఈక్విటీ ఫండ్స్‌ను అందించడానికి భారత ప్రభుత్వం సెల్ఫ్ రిలయన్ట్ ఇండియా (SRI) నిధులతో ఫండ్ ఆఫ్ ఫండ్‌లను ప్రకటించింది. ఈ పథకం కింద ప్రభుత్వం భారత ప్రభుత్వం నుండి రూ.10,000 కోట్ల కార్పస్‌ను అందిస్తుంది
ఎంఎస్ఎంఈ రంగంపై ఎంఎస్ఎంఈ క్లాసిఫికేషన్ (వర్గీకరణ)లో మార్పు ప్రభావాన్ని అంచనా వేయడానికి ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ 7 సెప్టెంబర్, 2021న స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SIDBI)కి ఒక అధ్యయనాన్ని అప్పగించింది. కోవిడ్-19 మహమ్మారి కారణంగా ఎంఎస్ఎంఈ రంగం ఎదుర్కొన్న నష్టాల అంచనాను కూడా పేర్కొన్న అంతర్గత ఇబ్బందులను ఇందులో చేర్చాయి. 20 రాష్ట్రాలు మరియు 2 కేంద్ర పాలిత ప్రాంతాలలో విస్తరించి ఉన్న 1,029 ఎంఎస్ఎంఈ లతో కూడిన రాండమ్ శాంపిల్ పూల్‌ను తీసుకొని సిడ్బీ నిర్వహించిన సర్వే ఆధారంగా ఈ అధ్యయనం జరిగింది. 2022 జనవరి 27న సమర్పించిన అధ్యయన నివేదిక ప్రకారం, 67 శాతం ఎంఎస్ఎంఈ లు 3 నెలల వరకు తాత్కాలికంగా మూసివేయబడ్డాయి. సర్వే చేసిన ఎంఎస్ఎంఈ లలో దాదాపు 65 శాతం మంది ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారెంటీ స్కీమ్ కింద ప్రయోజనాలను పొందారని మరియు ప్రతివాదులు 36 శాతం మంది మైక్రో అండ్ స్మాల్ ఎంటర్‌ప్రైజెస్ స్కీమ్ కోసం క్రెడిట్ గ్యారెంటీ ఫండ్ ట్రస్ట్ కింద రుణాలు పొందారని అధ్యయనం వెల్లడించింది.
సూక్ష్మ చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల శాఖ సహాయ మంత్రి శ్రీ భాను ప్రతాప్ సింగ్ వర్మ రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానంలో ఈ సమాధానం ఇచ్చారు.
*****
(Release ID: 1850219)