పౌర విమానయాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

అకాసా ఎయిర్ కి చెందిన ముంబై నుండి అహ్మదాబాద్‌ మొదటి విమానానికి శ్రీ జ్యోతిరాదిత్య ఎం. సింధియా జెండా ఊపారు.


భారతదేశ పౌర విమానయాన పరిశ్రమ ప్రజాస్వామ్యీకరణను చూస్తోంది: శ్రీ సింధియా

వచ్చే నాలుగేళ్లలో దేశంలో 40 కోట్ల మంది విమాన ప్రయాణికులను చేరుకోవాలని అంచనా వేస్తోంది: శ్రీ సింధియా

Posted On: 07 AUG 2022 4:58PM by PIB Hyderabad

పౌర విమానయాన శాఖ మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య ఎం. సింధియా మరియు పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి (రిటైర్డ్) వి కె సింగ్ ఈరోజు ముంబై నుండి అహ్మదాబాద్‌కు మొదటి అకాస ఎయిర్ (QP1101) విమానాన్ని ప్రారంభించారు.

 

శ్రీ సింధియా, పౌర విమానయాన మంత్రిత్వ శాఖ, జనరల్ (డా.) వి.కె. సింగ్ (రిటైర్డ్.) శ్రీ రాజీవ్ బన్సల్, కార్యదర్శి, ఎం ఓ సి ఎ లతో కలిసి ఢిల్లీ లో ముంబై నుండి, ఆగస్ట్ 07, ఆదివారం ఉదయం 10:05 గంటలకు  ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం (టి 1) నుండి బయలుదేరిన అకాసా ఎయిర్ మొదటి విమానానికి జెండా ఊపారు. ఎం ఓ సి ఎ సహ కార్యదర్శి శ్రీమతి ఉషా పాధీ,  అకాస ఎయిర్ వ్యవస్థాపకుడు శ్రీ రాకేష్ ఝున్‌ఝున్‌వాలా,  శ్రీమతి రేఖ జున్‌జున్‌వాలా మరియు ఆకాసా ఎయిర్ సీఈఓ మరియు వ్యవస్థాపకుడు శ్రీ వినయ్ దూబే, సహ వ్యవస్థాపకుడు మరియు సీనియర్ వైస్ ప్రెసిడెంట్  నీలు ఖత్రి  అకాస ఎయిర్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

 

ఈ కార్యక్రమంలో శ్రీ జ్యోతిరాదిత్య ఎం. సింధియా మాట్లాడుతూ “ఈరోజు ప్రారంభమైన విమానం భారతదేశంలోని పౌర విమానయాన చరిత్రలో ఒక నవోదయం. ప్రధానమంత్రి దూరదృష్టి, లక్ష్యశుద్ధి మరియూ ఉత్సాహం కారణంగానే భారతదేశంలో మొదటిసారిగా పౌర విమానయాన ప్రజాస్వామ్యాన్ని మనం చూశాము.

 

ఇంతకుముందు పౌర విమానయానం చాలా ఖరీదైన ఉన్నత వర్గాలవారికి చెందిన పరిశ్రమ గా పరిగణించబడేది, కానీ ఇప్పుడు ప్రధాని  భవిష్యదృష్టి కారణంగా గత ఎనిమిదేళ్లుగా చేరువ,అందుబాటు ధర, లభ్యత పరంగా మనం ఇంతకు ముందెన్నడూ చూడని పరివర్తనను చూస్తున్నాము. ఈ కొత్త నేపథ్యంలో నేను ఆకాశ ఎయిర్‌ని స్వాగతించాలనుకుంటున్నాను. రాబోయే రోజుల్లో ఆకాశ ఎయిర్ ఖచ్చితంగా తనదైన ముద్ర ను బలంగా వేస్తుందని నేను చాలా నమ్మకంగా ఉన్నాను".

 

“గత ఎనిమిదేళ్లలో భారతదేశ పౌర విమానయాన పరిశ్రమ ప్రధాని మోదీ నాయకత్వంలో పూర్తిగా రూపాంతరం చెందింది. ఉడాన్ పథకం కింద, మేము 1000 మార్గాలకు వెళ్లాలనే లక్ష్యంలో, ఇప్పటికే 425 మార్గాలను చేరుకున్నాం.  100 విమానాశ్రయాల లక్ష్యం లో 68 కొత్త విమానాశ్రయాలు వచ్చాయి. వచ్చే 4 సంవత్సరాల్లో భారతదేశంలో పౌర విమానయాన శాఖ ద్వారా 40 కోట్ల మంది ప్రయాణికులు విమానయానం చేస్తారని మేము ఆశిస్తున్నాము. రైలు రవాణా రోడ్డు రవాణాతో పాటు పౌర విమానయానం భారతదేశంలో రవాణాకు మరో మార్గం గా అవతరించే రోజు ఎంతో దూరంలో లేదు అని మంత్రి చెప్పారు.

 

పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి (జనరల్) డాక్టర్ వికె సింగ్ (రిటైర్డ్) కూడా అకాసా ఎయిర్‌ను అభినందించారు. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ దేవేంద్ర ఫడ్నవీస్ వీడియో సందేశం ఇచ్చారు.

 

ముంబైలో కార్పొరేట్ ప్రధాన కార్యాలయం గల అకాసా ఎయిర్ 7వ షెడ్యూల్ ఎయిర్‌లైన్ కు బోయింగ్ మ్యాక్స్ - 8 ఎయిర్‌క్రాఫ్ట్‌ ఉంది. దీనిని ఎస్ ఎన్ వి  ఏవియేషన్ బ్రాండ్ పేరుతో వ్యవహరిస్తారు. అకాసా ఎయిర్  అన్ని ఎకానమీ సీట్లతో తక్కువ ధర తో ఒక విమానం వున్న కారియర్ . అకాసా ఎయిర్ తన కార్యకలాపాలను వచ్చే ఐదేళ్లలో 72 విమానాలకు విస్తరించాలని యోచిస్తోంది, ఇది భారతదేశంలో దేశీయ విమానయాన సేవలను గణనీయంగా పెంచుతుంది.

***


(Release ID: 1849558) Visitor Counter : 224