యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
కామన్వెల్త్ గేమ్స్ 2022 8వ రోజు
కామన్వెల్త్ గేమ్స్ 2022 8వ రోజున 3 స్వర్ణాలు, 1 రజతం మరియు 2 కాంస్యాలతో సహా 6 పతకాలు గెలుచుకున్న భారత్
స్వర్ణం సాధించిన పూనియా, దీపక్ పూనియా, సాక్షి మాలిక్
రజత పతకం సాధించిన అన్షు మాలిక్
కాంస్య పతకం గెలిచిన మోహిత్ గ్రేవాల్
Posted On:
06 AUG 2022 11:50AM by PIB Hyderabad
• అసాధారణ ప్రతిభతో పతకాలు సాధించిన విజేతలను అభినందించిన రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము మరియు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ
• ప్రతిభ కనబరిచి భారతదేశాన్ని స్వర్ణ పతకం సాధించిన వారికి అభినందనలు ; శ్రీ అనురాగ్ ఠాకూర్
కామన్వెల్త్ గేమ్స్ 2022 8వ రోజున భారత రెజ్లింగ్ బృందం అసాధారణ ప్రతిభ ప్రదర్శించి 3 స్వర్ణాలు, 1 రజతం మరియు రెండు కాంస్యాలతో సహా ఆరు పతకాలు సాధించింది. పురుషుల ఫ్రీస్టైల్ 65 కేజీల రెజ్లింగ్‌లో బజరంగ్ పునియా, పురుషుల ఫ్రీస్టైల్ 86 కేజీల రెజ్లింగ్‌లో దీపక్ పునియా, మహిళల ఫ్రీస్టైల్ 86 కేజీల రెజ్లింగ్‌లో దీపక్ పునియా రెజ్లింగ్‌లో బంగారు పతకాలు సాధించారు. మహిళల ఫ్రీస్టైల్ 57 కేజీల రెజ్లింగ్‌లో అన్షు మాలిక్ రజతం సాధించగా, మహిళల ఫ్రీస్టైల్ 68 కేజీల రెజ్లింగ్‌లో దివ్య కక్రాన్, పురుషుల ఫ్రీస్టైల్ 125 కేజీల రెజ్లింగ్‌లో మోహిత్ గ్రేవాల్ కాంస్య పతకాలను గెలుచుకున్నారు. 9 స్వర్ణాలు, 8 రజతాలు, 9 కాంస్య పతకాలతో భారత్ పతకాల సంఖ్య 26 కి చేరుకుంది. రాష్ట్రపతి శ్రీమతి. ద్రౌపది ముర్ము, ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ, కేంద్ర క్రీడా మంత్రి శ్రీ అనురాగ్ ఠాకూర్ దేశ క్రీడాభిమానులు పతకాలు సాధించి విజేతలుగా నిలిచిన క్రీడాకారులను అభినందించారు.
పతకాలు సాధించిన రెజ్లింగ్ బృందాన్ని రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము అభినందించారు . రాష్ట్రపతి ట్వీట్ చేస్తూ, “కామన్వెల్త్ గేమ్స్‌లో రెజ్లింగ్‌లో సాక్షి మాలిక్ బంగారు పతకం సాధించి చరిత్ర సృష్టించింది.గట్టిపోటీని ఎదుర్కొన్న మాలిక్ భారతీయులు గర్వపడేలా విజయం సాధించింది. యువతకు ముఖ్యంగా మహిళలకు మాలిక్ ఆదర్శంగా నిలుస్తారు. మరింత బలం పుంజుకుని మాలిక్ ముందుకు సాగాలి. మాలిక్ కు హృదయపూర్వక అభినందనలు! ” అని అన్నారు.
మరో ట్వీట్‌లో రెజ్లింగ్‌లో స్వర్ణం సాధించిన పూనియాను అభినందించారు. “#కామన్వెల్త్ గేమ్స్‌లో రెజ్లింగ్‌లో వరుసగా రెండో స్వర్ణం గెలిచి చరిత్ర సృష్టించిన బజరంగ్ పునియాకు అభినందనలు. బజరంగ్ పునియా అంకితభావంతో నిలకడగా రాణిస్తూ విజయం సాధించారు. దేశ యువతకు పూనియాను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలి. పూనియా సాధించిన స్వర్ణం ఎల్లపుడూ ముందు ఉండాలి అన్న నవభారత స్ఫూర్తిని ప్రదర్శిస్తోంది" అని రాష్ట్రపతి తన ట్వీట్ చేశారు.
స్వర్ణ పతకం సాధించిన దీపక్ ను అభినందిస్తూ రాష్ట్రపతి మరో ట్వీట్ చేశారు." కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణ పతకం సాధించిన యువ రెజ్లర్ దీపక్ పునియాకు అభినందనలు. ఆటలో మీరు కనబరిచిన విశ్వాసం, సానుకూల దృక్పధం ఆకట్టుకున్నాయి. భారతదేశానికి దీపక్ గౌరవాన్ని, సంతోషాన్ని తెచ్చాడు."అని రాష్ట్రపతి పేర్కొన్నారు.
అన్షు ను అభినందిస్తూ చేసిన ట్వీట్ లో “కామన్వెల్త్ గేమ్స్‌లో రెజ్లింగ్‌లో రజతం సాధించిన అన్షు మాలిక్‌కు అభినందనలు. అత్యుత్తమ అంతర్జాతీయ రెజ్లర్లలో ఒకరిగా గుర్తింపు పొందిన అన్షు మరోసారి తన సత్తాను చాటింది.. భవిష్యత్తులో అన్షు మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నాను" అని రాష్ట్రపతి అన్నారు.
కాంస్య పతకం సాధించిన దివ్యకు అభినందనలు తెలుపుతూ చేసిన ట్వీట్‌లో “కామన్వెల్త్ గేమ్స్‌లో రెజ్లింగ్‌లో కాంస్యం గెలిచినందుకు దివ్య కక్రాన్‌కు అభినందనలు. మీ కదలికలు వేగం భారతదేశానికి సంతోషకరమైన విజయాన్ని అందించింది. దివ్య లాంటి యువ రెజ్లర్లు భారతదేశ క్రీడల రంగానికి ఉజ్వల భవిష్యత్తు అందిస్తారు ” అని రాష్ట్రపతి అన్నారు.
“మరో ప్రతిభావంతులైన యువ రెజ్లర్ మోహిత్ గ్రేవాల్ కామన్వెల్త్ గేమ్స్‌లో కాంస్య పతకాన్ని గెలుచుకోవడం భారతదేశానికి గర్వకారణం. మీరు ఉన్న చోటికి చేరుకోవడానికి మీరు అనేక సవాళ్లను అధిగమించారు. మరెన్నో అవార్డులు తీసుకురావడానికి దేశం మీ కోసం ఎదురుచూస్తోంది." అని మోహిత్ గ్రేవాల్ విజయంపై చేసిన ట్వీట్ లో రాష్ట్రపతి అన్నారు.
అద్భుత ప్రదర్శన చేసిన రెజ్లర్‌లను ప్రధాని అభినందించారు. “ బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ గేమ్స్‌లో అథ్లెట్లు మమ్మల్ని గర్వించేలా చేస్తూనే ఉన్నారు.సాక్షి మల్లిక్ చూపిన అత్యుత్తమ క్రీడా ప్రదర్శన ఎంతో ఆనందం కలిగించింది. ప్రతిష్టాత్మకమైన బంగారు పతకం సాధించినందుకు ఆమెను అభినందిస్తున్నాను. సాక్షి మల్లిక్ ప్రతిభకు చిరునామాగా మారింది. విశేషమైన స్థితిస్థాపకత కలిగి ఉండడం ఆమె అదృష్టం" అని ప్రధానమంత్రి తన ట్వీట్ లో పేర్కొన్నారు.
బంగారు పతకాన్ని సాధించిన బజరంగ్ ప్రధానిని అభినందిస్తూ “ప్రతిభావంతులైన బజరంగ్ పూనియా ప్రతిభ కనబరిచి బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ గేమ్స్‌లో బంగారు పతకాన్ని గెల్చుకున్నాడు. కామన్వెల్త్ గేమ్స్‌లోవరుసగా మూడుసార్లు పతకాన్ని సాధించి బజరంగ్ అద్భుతమైనప్రదర్శన చూపించారు. అతని ఆత్మ విశ్వాసం స్ఫూర్తిదాయకం. బజరంగ్ కి నా శుభాకాంక్షలు .” అని ట్వీట్ చేశారు.
“మన దీపక్ పునియా కనబరిచిన అద్భుతమైన క్రీడా ప్రదర్శన చూసి గర్వపడుతున్నాను! అతను భారతదేశానికి గర్వకారణం. భారతదేశానికి అనేక అవార్డులు అందించారు. అతను గోల్డ్ మెడల్ సాధించడం పట్ల ప్రతి భారతీయుడు హర్షం వ్యక్తం చేస్తున్నారు.భవిష్యత్తులో అన్ని ప్రయత్నాలలో విజయం సాధించాలని కోరుతూ అతనికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ” అని ప్రధానమంత్రి ట్వీట్ చేశారు.
అన్షుకు శుభాకాంక్షలు తెలుపుతూ చేసిన ట్వీట్ లో “ తన పుట్టిన రోజున రెజ్లింగ్‌లో రజత పతకాన్ని గెలుచుకున్నందుకు అన్షుకి అభినందనలు. తన క్రీడా జీవితంలో విజయాలతో అన్షు ముందుకు సాగాలని కోరుకుంటున్నాను. క్రీడల పట్ల ఆమెకున్న అభిరుచి క్రీడాకారులకు స్ఫూర్తి కలిగిస్తుంది" అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.
దివ్యని అభినందిస్తూ ప్రధానమంత్రి మరో ట్వీట్ చేశారు. “భారతదేశ రెజ్లర్లు అత్యుత్తమంగా ఉన్నారు. వారి ప్రతిభ కామన్వెల్త్ గేమ్స్‌లో కనిపిస్తోంది. . కాంస్యం గెలిచినందుకు రెజ్లర్ దివ్యని చూసి గర్వపడుతున్నాను .ఆమె ప్రదర్శన కలకాలం గుర్తు ఉంటుంది. భవిష్యత్తులో దివ్య మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నాను" అని ప్రధానమంత్రి అన్నారు.
మరొక ట్వీట్‌లో ప్రధానమంత్రి ఇలా అన్నారు, “మన రెజ్లర్లు అద్భుతమైన ఆట ప్రదర్శించారు. పతకాల పట్టికలో మోహిత్ గ్రేవాల్ కూడా చేరాడు. కాంస్య పతకంతో మోహిత్ గ్రేవాల్ స్వదేశానికి వస్తారు. మోహిత్ గ్రేవాల్ కి అభినందనలు. భవిష్యత్తులో మోహిత్ గ్రేవాల్ మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నాను" అని ప్రధానమంత్రి అన్నారు.
పతకాలు సాధించిన క్రీడాకారులను కేంద్ర మంత్రి శ్రీ అనురాగ్ ఠాకూర్ శుభాకాంక్షలు, అభినందనలు తెలిపారు. “అద్భుతమైన ప్రదర్శన సాక్షి మాలిక్! అత్యుత్తమ ప్రదర్శనతో భారతదేశం కోసం బంగారు పతకం సాధించిన సాక్షికి అభినందనలు. కామన్వెల్త్ గేమ్స్ 2018లో కాంస్యం సాధించిన వ్యక్తి 2022లో బంగారు పతకం సాధించడం గొప్ప విషయం. ఈ విజయం పట్టుదల, అంకితభావం, కృషికి నిదర్శనం. పతకం సాధించే వరకు ఛాంపియన్‌లా ఆడారు! ” అని శ్రీ ఠాకూర్ అన్నారు.
పునియాకు అభినందనలు తెలుపుతూ చేసిన ట్వీట్ లో శ్రీ ఠాకూర్ “బజరంగ్ పునియా మరో విజయం సాధించారు. కామన్వెల్త్ గేమ్స్ 2022లో రెజ్లింగ్‌లో దేశానికి మొదటి స్వర్ణం సాధించినందుకు అభినందనలు! బజరంగ్ 10 నిమిషాల 14 సెకన్లలో తన కామన్వెల్త్ గేమ్స్ గోల్డ్‌ను కాపాడుకున్నాడు. కామన్వెల్త్ గేమ్స్ లో హ్యాట్రిక్ విజయం సాధించిన బజరంగ్ తానూ ఒక ఛాంపియన్ అని రుజువు చేశారు !" అని అన్నారు.
మరో ట్వీట్‌లో శ్రీ ఠాకూర్ ఇలా అన్నారు, “భారతదేశం కుస్తీ పడుతూ స్వర్ణాన్ని కైవసం చేసుకుంటుంది !అద్భుతమైన దృఢత్వంతో గెలిచిన స్వర్ణం సాధించిన దీపక్ పునియాకు అభినందనలు! పూనియాని చూసి దేశం గర్వపడుతుంది" అని మంత్రి అన్నారు.
అన్షు ను అభినందిస్తూ చేసిన ట్వీట్ లో “తొలిసారిగా కామన్వెల్త్ గేమ్స్ బరిలో దిగిన అన్షు మాలిక్ తన మొట్టమొదటి ప్రయత్నంలో రజతాన్ని గెలుచుకున్నందుకు థ్రిల్‌గా ఉంది!!!. బలమైన ప్రత్యర్థిని ఎదుర్కొన్న అన్షు గొప్ప పోరాత పటిమ ప్రదర్శించారు. ఈ రోజు మీ పుట్టినరోజు కాబట్టి పతకం డబుల్ వేడుక! సాయింకాయే సోనిపట్‌లో పొందిన శిక్షణ, విదేశీ శిక్షణ ఫలితాలనుఇచ్చాయి" అని శ్రీ ఠాకూర్ అన్నారు.
మరో ట్వీట్‌లో శ్రీ ఠాకూర్ ఇలా అన్నారు. “ అన్ని అడ్డంకులు సవాళ్ళను అధిగమించి మోహిత్ గ్రేవాల్ కాంస్య పతకం సాధించారు. లక్ష్యాన్ని చేరుకోవాలని అని అతని సంకల్పానికి ఈ విజయం నిదర్శనం. గాయం నుంచి కోలుకున్న మోహిత్ రెండు సంవత్సరాల తిరిగి బరిలో దిగి విజయం సాధించారు.మొదటిసారి కామన్వెల్త్ గేమ్స్ లో ఆడిన మోహిత్ పతకాన్ని పొందేందుకు పోరాడాడు. ఇది మరిన్ని విజయాలకు నాంది. అభినందనలు మోహిత్."
దివ్య శ్రీ ఠాకూర్‌ను అభినందిస్తూ చేసిన ట్వీట్ లో “30 సెకన్లలో పతకం పట్టింది. కామన్వెల్త్ గేమ్స్ లో భారతదేశానికి చెందిన దివ్య సాధించింది అదే !!! అర నిమిషంలో కాంస్యం సాధించి ఛాంపియన్‌గా అవతరించింది. సాయ్ లక్నో కేంద్రంలో శిక్షణ పొందిన దివ్య ప్రపంచ వేదికపై భారతదేశం గర్వించేలా చేసింది. కామన్వెల్త్ గేమ్స్ 2022లో భారతీయ మల్లయోధులు తమ సత్తా చాటుతున్నారు!" అన్నారు.
(Release ID: 1849396)
Visitor Counter : 139