ఉక్కు మంత్రిత్వ శాఖ
తొలి త్రైమాసిక ఫలితాలను ప్రకటించిన ఎన్ఎండిసి
Posted On:
06 AUG 2022 9:07AM by PIB Hyderabad
నేషనల్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్ఎండిసి) శుక్రవారం నాడు తన తొలి త్రైమాసిక (క్యూ1) గణాంకాలను ప్రకటించింది. ఆర్థిక సంవత్సరం 2022-23లోని తొలి త్రైమాసికంలో కంపెనీ 8.92 మిలియన్ టన్నుల ఇనుము ధాతువును ఉత్పత్తి చేసి 7.80 మిలియన్ టన్నులను విక్రయించింది. గత సంవత్సరం ఇదే కాలానికి, ఎన్ఎండిసి 8.91 మిలియన్ టన్నుల ఉత్పత్తిని నమోదు చేసి 9.45 మిలియన్ టన్నులను విక్రయించింది.
ఆర్థిక సంవత్సరం 2022- తొలి త్రైమాసికంలో రూ. 4,767 కోట్ల టర్నోవర్‌తో ఎన్ఎండిసి స్థిరమైన ఆర్థిక ఫలితాలను నమోదు చేసింది. ఇందులో పిబిటి రూ. 1,946 కోట్లు, పిఎటి రూ. 1,469 కోట్లు ఉన్నాయి. ఆర్థిక సంవత్సరం 2021-2022 తొలి త్రైమాసికంలో కంపెనీ రూ. 6,512 కోట్ల టర్నోవర్‌ను నమోదు చేయగా, అందులో పిబిటి రూ. 4,263 కోట్లు, పిఎటి రూ. 3,193 కోట్లుగా ఉంది.
ఈ ఫలితాలపై వ్యాఖ్యానిస్తూ, రుతుపవనాలు త్వరగా రావడం, డిమాండ్ కొరత తొలి త్రైమాసికంలో మందగమనానికి కారణమని ఎన్ఎండిసి సిఎండి, శ్రీ సుమీత్ దేవ్ అన్నారు. సానుకూల దృక్పథంలో, మా స్థిరమైన సాంకేతిక, డిజిటల్, ఆర్థిక వృద్ధి ఎన్ఎండిసి ప్రస్తుత సవాళ్లను ఉపశమింపచేసి, వార్షిక లక్ష్యాలను సాధించే సౌలభ్యాన్ని అందిస్తాయి.
****
(Release ID: 1849095)
Visitor Counter : 137