సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
దూరదర్శన్, ఆకాశవాణి లేకుండా భారత తత్వ వ్యాప్తి అసాధ్యం!
స్వరాజ్ సీరియల్ ఆవిష్కరణలో
కేంద్రమంత్రి అమిత్ షా ప్రకటన..
ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న
మరో మంత్రి అనురాగ్ ఠాకూర్..
Posted On:
05 AUG 2022 5:58PM by PIB Hyderabad
న్యూఢిల్లీలోని ఆకాశవాణి భవన్‌లో ఈ రోజు జరిగిన స్వరాజ్ అనే వినూత్నమైన సీరియల్‌ను కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి అమిత్ షా, కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ ప్రారంభించారు, భారత్ కే స్వతంత్ర సంగ్రామ్ కీ సమగ్ర గాథా అనే ధారావాహికను కేంద్ర సమాచార, ప్రసార శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్. మురుగన్, సమాచార, ప్రసారశాఖ కార్యదర్శి శ్రీ అపూర్వ చంద్ర, ప్రసార భారతి సి.ఇ.ఒ. మాయాంక్ అగర్వాల్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ప్రసంగిస్తూ 550 మందికి పైగా స్వాతంత్ర్య స మర యోధుల సాహసోపేతమైన గాథల పునరుద్ధరణలో దూరదర్శన్, ఆకాశవాణి చేసిన కృషి ప్ర శంసనీయమని, గుర్తింపునకు నోచుకోని సమర యోధుల గురించి యవత అవగాహన కల్పించుకోవడానికి ఈ సీరియల్ కథనాలు దోహదపడ్డాయన్నారు.
సీరియల్ గురించి కేంద్రమంత్రి మాట్లాడుతూ స్వరాజ్య భావనలో ఇమిడి ఉన్న దార్శనికతను పునఃకల్పన చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామని, గతకాలంనుంచి ఈ వీరులపట్ల మనకున్న గౌరవానికి ఈ సీరియల్ ఒక నిదర్శనమని అన్నారు. ఈ సీరియల్ రూపకల్పనకోసం తీవ్రస్థాయిలో పరిశోధన జరిగిందని, ఇందుకోసం దేశంలోని అన్ని మూలలనుంచి సమాచారాన్ని, సంబంధిత పత్రాలను తెప్పించామని మంత్రి అన్నారు. మన స్వాతంత్ర్య సమరకాలానికి సంబంధించిన ఈ గాథలకు జీవాన్ని జోడించడానికి గట్టి కృషి చేసినట్టు చెప్పారు.
కేంద్ర హోం, సహకారశాఖ మంత్రి అమిత్ షా మాట్లాడుతూ, స్వరాజ్ సీరియల్ రూపకల్పనలో ప్రభుత్వ ప్రసార వ్యవస్థలు పోషించిన పాత్రను గురించి ప్రస్తావించారు. సంగీత ప్రముఖులు పండిట్ జస్‌రాజ్, ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్‌ల పేర్లను ఆయన గుర్తు చేసుకుంటూ, వారి విషయంలో ఆకాశవాణి చేసిన కృషిని అభినందించారు. “దూరదర్శన్, ఆకాశవాణి లేకుండా భారత తత్వాన్ని, భారతీయ భావనను వ్యాప్తి చేయడం ఎంతమాత్రం సాధ్యంకాదు.” అని అమిత్ షా అన్నారు.
ల
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమాల నిర్వహణలో దాగిన అంతరార్ధాన్ని గురించి ఆయన ప్రస్తావించారు. ఇది కేవలం మన స్వాతంత్ర్య సమరంపై వేడుకలు చేసుకోవడం మాత్రమే కాదని, స్వాతంత్ర్య సముపార్జన తర్వాత గత 75 సంవత్సరాల్లో సాధించిన విజయాలను గుర్తు చేసుకోవడం, అలాగే గుర్తింపు పొందిన, గుర్తింపునకు నోచుకోని స్వరాజ్య వీరుల త్యాగాలను గురించి తెలుసుకోవడం ఈ కార్యక్రమాల లక్ష్యమని అన్నారు. భారతదేశపు ఉజ్వల భవిష్యత్తును గురించి కలలుగనేందుకు కూడా ఇదే తగిన తరుణమని, ఇక్కడనుంచి ప్రతిభాపాటవాల్లో భారతదేశం మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించగలదని ఆయన అన్నారు.
స్వరాజ్ అనేది ఎంతో సంక్లిష్టమైన భావన అని, అది కేవలం స్వయంపాలనకే పరిమితం కాబోదని అమిత్ షా అన్నారు. మనకే సొంతమైన విభిన్న మార్గంలో దేశాన్ని పరిపాలించుకునే ప్రత్యేక ప్రక్రియ అని అన్నారు. మన సొంత భాషలు, సొంత సంస్కృతి కూడా ఇందులో అంతర్భాగాలేనని అన్నారు. స్వాతంత్ర్య శతాబ్ది సంవత్సరంలో మన భాషలను, విభిన్నమైన సంస్కృతులను పరిరక్షించుకుని, మన తదుపరి తరాలకు అందించాలని ఆయన సూచించారు.
సీరియల్ రూపకల్పనలో పనిచేసిన సిబ్బంది కృషిని ఆయన ప్రశంసించారు. విద్యనుంచి సంపద వరకు, సంస్కృతినుంచి ప్రభుత్వపాలనా ప్రక్రియ వరకూ అన్ని అంశాల్లోనూ వలసవాద దేశాలకంటే భారతదేశమే ముందువరుసలో ఉండేదని అమిత్ షా అన్నారు. అయితే, భారతదేశం గురించి తప్పుడు సమాచారాన్నే తయారు చేసి, తాము తక్కువవారమన్న న్యూనతా భావననను ప్రజల్లో సృష్టించారని ఆయన అన్నారు. దేశప్రజల మనసుల్లోనుంచి ఇలాంటి న్యూనతా భావనలన్నింటినీ స్వరాజ్ సీరియల్ నిర్మూలించగలదని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్లమెంటు సభ్యులు, మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారులు, దూరదర్శన్, ఆకాశవాణి సంస్థల సీనియర్ అధికారులు పాల్గొన్నారు.
ప్రసార భారతి ముఖ్య కార్యనిర్వహణాధికారి మాయాంక్ అగర్వాల్ మాట్లాడుతూ, దూరదర్శన్‌తో పాటుగా, ఆకాశవాణిలో కూడా ఈ సీరియల్ ప్రసారమవుతుందన్నారు. ఈ సీరియల్ రూపకల్పనలో వెనక ఉండి ప్రోత్సహించిన కన్సల్టేటివ్ కమిటీ సభ్యుల కృషిపట్ల మాయాంక్ అగర్వాల్ ధన్యవాదాలు తెలిపారు.
స్వరాజ్ – స్వాతంత్ర్య సంగ్రామ్ కీ సమగ్ర గాథ గురించి..
స్వరాజ్ అనేది 75 భాగాలతో కూడిన ధారావాహిక (సీరియల్), 4K/HD నాణ్యతతో దీన్ని నిర్మించారు. 2022 ఆగస్టు 14నుంచి ప్రతి ఆదివారం ఇది ప్రసారమవుతుంది. ఆ రోజు రాత్రి 9నుంచి పది గంటలవరకూ ఈ సీరియల్‌ను దూరదర్శన్ నేషనల్ ఛానెల్ ప్రసారం చేస్తుంది. ఇంగ్లీషుతో సహా తొమ్మిది ప్రాంతీయ భాషల్లోకి ఈ సీరియల్‌ను అనువదిస్తున్నారు. తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, మరాఠీ, గుజరాతీ, ఒరియా, బెంగాళీ, అస్సామీ భాషల్లో దూరదర్శన్ ప్రాంతీయ టెలివిజన్ ఛానెళ్లలో ఇది ఆగస్టు 20వ తేదీనుంచి ప్రసారమవుతుంది. క్రీస్తుశకం 1498వ సంవత్సరంలో వాస్కొడ గామా భారతదేశం చేరుకున్నప్పటి కాలంతో ఈ సీరియల్ ప్రారంభమవుతుంది. గర్తింపునకు నోచుకోని భరత వీరుల సాహసోపేత గాథల గురించిన వర్ణనలతో ఈ సీరియల్ సాగుతుంది. తిరోథ్ సింగ్, సిద్ధూ ముర్ము, కాన్హూ ముర్ము, శివప్ప నాయక, కన్హోజీ ఆంగ్రే, రాణి గైదిన్ల్యూ, తిల్కా మాఝీ తదితరుల గాథలను ఈ సీరియల్ వివరిస్తుంది. సుప్రసిద్ధ స్వాతంత్ర్య సమరయోధులైన రాణీ లక్ష్మీబాయి, శివాజీ మహారాజ్, తాత్యా తోపే, మేడం భికాజీ కామా తదితరులను గురించి కూడా ఈ సీరియల్ వివరిస్తుంది.
*****
(Release ID: 1848961)
Visitor Counter : 173