జౌళి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

చేనేత రంగం మన దేశ సుసంపన్నమైన మరియు విభిన్నమైన సాంస్కృతిక వారసత్వానికి ప్రతీక: జౌళి శాఖ స‌హాయ మంత్రి శ్రీమతి దర్శన జర్దోష్


- హ్యాండ్లూమ్ హాత్‌లోని ప్రత్యేకమైన చేనేత ప్ర‌ద‌ర్శ‌న‌ను సందర్శించిన మహిళా పార్లమెంట్ సభ్యులు

Posted On: 05 AUG 2022 5:42PM by PIB Hyderabad

జౌళి, రైల్వేల‌ శాఖ స‌హాయ మంత్రి శ్రీమతి దర్శన విక్ర‌మ్ జర్దోష్ గౌరవనీయులైన మహిళా పార్లమెంట్ సభ్యులు శ్రీమతి హేమ మాలిని, శ్రీమతి నవనీత్ కౌర్ రాణా, శ్రీమతి మహువా మొయిత్రా మరియు ఇతరుల‌తో క‌లిసి ఈ రోజు హ్యాండ్లూమ్ హాట్‌లో 'మై హ్యాండ్లూమ్ మై ప్రైడ్ ఎక్స్‌పో' పేరుతో ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన చేనేత ప్ర‌ద‌ర్శ‌న‌ను ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా వారు  నేత కార్మికులు, చేతివృత్తుల వారితో సంభాషించారు. సున్నితమైన చేనేత ఉత్పత్తులను కొనుగోలు చేశారు. శ్రీమతి దర్శనా జర్దోష్, నేత కార్మికులను ప్రోత్సహించడానికి మరియు చేనేత పరిశ్రమను ప్రోత్సహించడానికి జన్‌పథ్ హాత్‌లోని ప్రత్యేక చేనేత ఎక్స్‌పోను సందర్శించి, గొప్ప చేనేత వారసత్వాన్ని వీక్షించాలని పార్లమెంటులోని మహిళా సభ్యులందరినీ ఆహ్వానించారు. 

 

14 రాష్ట్రాల నుండి మొత్తం 55 మంది సంత్ కబీర్ మరియు జాతీయ అవార్డు గ్రహీతలు త‌మ‌త‌మ సున్నితమైన ప‌లు చేనేత ఉత్పత్తులను ప్రదర్శంచి విక్రయిస్తున్నారు. ఈ ఎగ్జిబిషన్ 2022 ఆగస్టు 11 వరకు 7 రోజుల పాటు ఉదయం 11 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు ప్రజలకు తెరిచి ఉంటుంది. ఈ ఎక్స్‌క్లూజివ్ హ్యాండ్‌లూమ్ ఎక్స్‌పోను  నేషనల్ హ్యాండ్‌లూమ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎన్‌హెచ్‌డీసీ) లిమిటెడ్ ద్వారా భారత ప్రభుత్వ జౌళి మంత్రిత్వ శాఖ యొక్క  డెవలప్‌మెంట్ కమిషనర్ (చేనేత వస్త్రాలు) కార్యాల‌యం వారి చొరవ‌తో ఏర్పాటు చేశారు. 

ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ  "చేనేత రంగం మన దేశ సుసంపన్నమైన మరియు విభిన్న సాంస్కృతిక వారసత్వానికి చిహ్నం" అని శ్రీమతి జర్దోష్ అన్నారు.

 

 

 

 

 

 

 

 

 "1905 ఆగస్టు 7న ప్రారంభించబడిన స్వదేశీ ఉద్యమం దేశీయ పరిశ్రమలను మరియు ముఖ్యంగా చేనేత కార్మికులను ప్రోత్సహించింది. 2015లో, భారత ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఆగస్టు 7వ తేదీని జాతీయ చేనేత దినోత్సవంగా నిర్వహించాలని నిర్ణయించింది. ఈ రోజున మేము మా చేనేత స‌మూహాన్ని గౌరవిస్తాము మరియు ఈ దేశ సామాజిక-ఆర్థిక అభివృద్ధిలో ఈ రంగం యొక్క సహకారాన్ని ప్ర‌ధానంగా వెలుగులోకి  తెస్తాము.
చేనేత వారసత్వాన్ని కాపాడుకోవడానికి, కార్మికులకు మరిన్ని అవకాశాలతో సాధికారత కల్పించాలనే మా సంకల్పాన్ని మేము పునరుద్ఘాటిస్తున్నాము. చేనేత కళ సాంప్రదాయక విలువను కలిగి ఉంది. దేశంలో  ప్రతీ ప్రాంతంలోనూ సున్నితమైన రకాలు ఉన్నాయి. పోచంపల్లి, తంగలియా చీర, కోట డోరియా, బనారసి, జమ్దానీ, బాలుచారి, ఇక్కత్, కలంకారి మొదలైన ఉత్పత్తుల మ‌న  ప్రత్యేకత, ప్రత్యేకమైన నేత, డిజైన్‌లు మరియు సాంప్రదాయ మూలాంశాలతో ప్రపంచ వ్యాప్తంగా వినియోగదారులను ఆకర్షిస్తుంది. ఈ ప్రదర్శనల ద్వారా  చేనేత నేత కార్మికులు తమ ఉత్పత్తులను సరసమైన ధరలకు విక్రయించడమే కాకుండా, ఉత్పత్తి యొక్క భవిష్యత్తు మెరుగుదల కోసం రంగు, డిజైన్ మరియు నేయడం వంటి వాటికి సంబంధించి వినియోగదారుల ఎంపికను కూడా తెలుసుకుంటారు. ఎగ్జిబిషన్ అవార్డు గ్రహీత చేనేత కార్మికులు మరియు వినియోగదారుల‌ మధ్య ప్రత్యక్షంగా మాటాటుకొనేందుకు వెసులుబాటును క‌ల్పిస్తుంది.  భారతదేశంలోని కొన్ని అన్యదేశ ప్రాంతాల నుండి తెచ్చిన  చేనేత ఉత్పత్తులు ప్రదర్శనలో అమ్మకానికి ఉన్నాయి. వాటి సంక్షిప్త జాబితా కింద ఇవ్వబడింది: 

 

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌

వెంకటగిరి జమ్దానీ కాటన్ చీర

అస్సాం

వెజిటబుల్ డైడ్ సిల్క్ చీర

. గుజ‌రాత్‌

తంగలియా చీర, దుపట్టా మెరినో ఉన్ని శాలువా

.హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌

కులు షాల్

జమ్మూ & కాశ్మీర్

కనీ శాలువా

·మధ్యప్రదేశ్

చందేరీ చీరలు, సూట్, దుపట్టా

 మణిపూర్                       

మణిపూర్ సాంప్రదాయ హెచ్‌/ఎల‌్‌ ఉత్పత్తులు

· నాగాలాండ్

నాగాలాండ్ సాంప్రదాయ H/L ఉత్పత్తులు

ఒడిషా

త్రియంత్ర చీర, ప్రతిజ్ఞ, రామశిల, బేటి కాటన్ చీర

రాజస్థాన్

పుంజ దూరి, కోట డోరియా చీర

తమిళనాడు

కాంచీపురం కొర్వాయి సిల్క్ చీర

తెలంగాణ

డబుల్ ఇకత్ తెలియా రుమల్ చీర

ఉత్తర ప్రదేశ్

రంగత్ చీర, కాటన్ జమ్దానీ, కట్‌వర్క్ స్టోల్

పశ్చిమ బెంగాల్                  

జామ్దానీ చీరలు, డ్రెస్ మెటీరియల్, స్టోల్స్

 

*****


(Release ID: 1848954) Visitor Counter : 274


Read this release in: English , Urdu , Hindi , Manipuri