సాంస్కృతిక మంత్రిత్వ శాఖ
75 సంవత్సరాల స్వాతంత్ర్యాన్ని పురస్కరించుకొని 150 స్మారక చిహ్నాలపై జాతీయ జెండాను ఎగురవేయడం ద్వారా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకలను జరుపుకోనున్న ఎఎస్ఐ
Posted On:
05 AUG 2022 5:11PM by PIB Hyderabad
75 సంవత్సరాలు స్వాతంత్యాన్ని స్మారకార్ధం స్వదేశాభిమాన (దేశభక్తి) ప్రచారమైన హర్ ఘర్ తిరంగాలో భాగంగా దేశవ్యాప్తంగా 150 విశేష పురావస్తు ప్రాంతాలలో భారత పురావస్తు శాఖ (ఎఎస్ఐ) జాతీయ జెండాను ఎగురవేయనుంది. జెండా ఎగురవేయడంతో పాటుగా, ఈ స్మారక చిహ్నాలను జెండాలోని మూడు రంగుల దీపాలతో అలంకరిస్తారు.
దేశవ్యాప్తంగా 750 విశేషపురావస్తు, చారిత్రక స్థలాలలో పారిశుద్ధ్య ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం పరిరక్షిస్తున్న ప్రాంతాలలో 5 ఆగస్టు నుంచి 15 ఆగస్టు వరకు ఉచితంగా దర్శించవచ్చునని ప్రకటించారు. జన భాగీదారీ (ప్రజా భాగస్వామ్య) అన్న ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ స్ఫూర్తిని ఇముడ్చుకుని ఎఎస్ఐకి చెందిన 37 సర్కిళ్ళు స్థానిక ప్రజలను కలుపుకొని వివిధ కార్యక్రమాలను నిర్వహించనున్నాయి. ఈ కార్యక్రమాలలో చెట్లు నాటడం, స్కూల్ సంవాదాలు, ఉపన్యాసాలు, వైద్య శిబిరాలు, పిల్లలకు అవగాహనా కార్యక్రమాలు వంటివి ఉన్నాయి.
***
(Release ID: 1848953)
Visitor Counter : 144