సాంస్కృతిక మంత్రిత్వ శాఖ
నేషనల్ వర్చువల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా (ఎన్ విఎల్ ఐ) లో మొత్తం 3.04 లక్షల డిజిటల్ కళాఖండాలు, 34.91 లక్షల గ్రంథాల వివరాలు ( బిబిలోగ్రఫిక్ ఎంట్రీలు) ఉన్నాయి. : శ్రీ జి.కిషన్ రెడ్డి
Posted On:
04 AUG 2022 4:55PM by PIB Hyderabad
నేషనల్ వర్చువల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాను ఇండియన్ కల్చర్ పోర్టల్ (ఐసిపి)గా 10-12-2019న అభివృద్ధి చేయడం జరిగింది. భారతదేశానికి చెందిన అన్ని రూపాలలోని సాంస్కృతిక వారసత్వాన్ని తెలియజేసేందుకు దీనిని ఉద్దేశించారు. దీని యు.ఆర్.ఎల్ https://indianculture.gov.in ఇది పబ్లిక్ డోమైన్ లో అందుబాటులో ఉంది. ప్రస్తుతం ఈ పోర్టల్ కు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి..
ఈ పోర్టల్ లో 3.04 లక్షల డిజిటల్ కళాఖండాలు మెటాడేటాతో ఉన్నాయి. ఇందులో 34.91 లక్షల గ్రంథ పట్టికలు కూడా ఉన్నాయి.
ఇందులోని సమాచారం 18 కేటగిరీలలో ఉంది, అవి అరుదైన పుస్తకాలు, ఈ పుస్తకాలు , ఆర్కైవ్స, గజెట్‌లు, చిత్రాలు, వీడియోలు, యునెస్కో నుంచి అందిన కంటెంట్, పరిశోధన పత్రాలు, భారత జాతీయ గ్రంథపట్టిక, నివేదికలు, ప్రోసీడింగ్స్, యూనియన్ కేటలాగ్, ఇతర కేటలాగ్‌లు ఉన్నాయి..
ఇందులో 12 కేటగిరీల కంటెంట్ కూడా ఉంది. అందులో కథలు, కథానికలు, ఫోటో వ్యాసాలు, భారతదేశంలోని కోటలు, భారతదేశ వస్త్రాలు, దుస్తులు, భారతదేశ చారిత్రక నగరాలు, వాద్యపరికరాలు, ఆహారం, సంస్కృతి, వర్చువల్ వాక్ థాట్స్, స్వాతంత్ర ఉద్యమానికి సంబంధించిన ఘట్టాలు, వీరుల గాధలు, అజంతా గుహలు, ఈశాన్య ప్రాంతానికి సంబంధించిన ఆర్కైవ్స్ ఉన్నాయి.
ప్రస్తుతం ఈ పోర్టల్ ఇంగ్లీషు, హిందీలలో లభ్యమవుతోంది.
ఈపోర్టల్ ను ఇండియన్ కల్చర్ యాప్‌పై చూడచ్చు, ఇది ఆండ్రాయిడ్, ఐఫోన్ లు రెండింటిలోనూ లభ్యమవుతుంది.
ఉమాంగ్ యాప్ ద్వారా కూడా ఇది అందుబాటులో ఉంటుంది.
మంత్రిత్వశాఖకు చెందిన అన్ని సంస్థలు తమ గ్రంథ పట్టికలు, డిజిటల్ వనరులను అన్నింటినీ నేషనల్ వర్చువల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాతో రెగ్యులర్ పద్థతిలో ఇండియన్ కల్చర్ పోర్టల్‌తో అనుసంధానం చేస్తుంంది.
నేషనల్ వర్చువల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా కింద ఔట్‌రీచ్ టీమ్‌ను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ టీమ్‌ద్వారా దేశవ్యాప్తంగా గల విద్యాసంస్థలలో ఇండియన్ కల్చర్ పోర్టల్‌ను ప్రమోట్ చేస్తారు. ప్రెజెంటేషన్లు, ఈవెంట్లను రోజువారీగా రెగ్యులర్‌గా వివిధ విద్యాసంస్థలలో ఏర్పాటు చేస్తారు. దీని ద్వారా ఇండియన్ కల్చర్ పోర్టల్ (ఎన్‌విఎల్ ఐ ప్రాజెక్టు)ను ప్రమోట్ చేస్తారు.
ఈ సమాచారాన్ని కేంద్ర సాంస్కృతిక వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ జి.కిషన్ రెడ్డి ఈ రోజు రాజ్యసభలో ఈ విషయం తెలియజేశారు.
***
(Release ID: 1848831)
Visitor Counter : 173