మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ

కేంద్రీయ విశ్వవిద్యాలయాల (సవరణ), బిల్లు 2022ను ఆమోదించిన లోక్‌సభ


గతి శక్తి విశ్వవిద్యాలయం రవాణా రంగాల కోసం ప్రపంచ స్థాయి, బహు శాస్త్ర మిశ్రిత , బహు మితీయ, భవిష్యత్ సంస్థగా ఉంటుంది - శ్రీ ధర్మేంద్ర ప్రధాన్

Posted On: 03 AUG 2022 8:40PM by PIB Hyderabad
నేషనల్ రైల్ అండ్ ట్రాన్స్‌పోర్టేషన్ ఇన్‌స్టిట్యూట్ (ఎన్‌ఆర్‌టిఐ)ని డీమ్డ్ టుబి యూనివర్శిటీని గతి శక్తి విశ్వవిద్యాలయంగా(జిఎస్‌వి) మార్చడానికి కేంద్రీయ విశ్వవిద్యాలయాలు (సవరణ), బిల్లు 2022ను లోక్‌సభ ఈరోజు ఆమోదించింది.

లోక్‌సభలో కేంద్ర విద్య, నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ సమాధానమిస్తూ, ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఎల్లప్పుడూ భవిష్యత్తు కోసం ఒక దృక్పథంతో పనిచేస్తారని, ఆయన నాయకత్వంలో, నాల్గవ పారిశ్రామిక విప్లవాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలని  చెప్పారు. ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ నేతృత్వంలో జ‌రుగుతున్న సాంకేతిక ప‌రిణామాల గురించి కూడా ఆయ‌న ప్ర‌స్తావిస్తూ, 2022 నాటికి భార‌త‌దేశం ఫ్రాన్షియ‌ర్ టెక్నాలజీల విష‌యంలో ఆత్మ‌నిర్భ‌ర్‌గా మారుతుంద‌ని అన్నారు.

రోడ్లు, రైల్వేలు, షిప్పింగ్, విమానయానం మొదలైన వాటితో కూడినది ఎల్‌ఆర్‌ఎస్. రవాణా రంగం వృద్ధి, చిన్న నగరాల్లో దేశవ్యాప్తంగా విమానాశ్రయాల నిర్మాణం, విమాన ట్రాఫిక్‌ను పెంచడం భారతదేశ ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబిస్తున్నాయని ఆయన అన్నారు. రవాణా రంగంలో జరుగుతున్న పరివర్తనల కోసం సంస్థను నిర్మించాలని, విజ్ఞాన భాండాగారాన్ని నిర్మించాలని, పరిశోధనలు నిర్వహించాలని, ఉత్తమ విధానాలను రూపొందించాలని, నైపుణ్యాభివృద్ధిని సులభతరం చేయాలని, సామర్థ్య పెంపునకు కృషి చేయాలని, రవాణా రంగం వృద్ధికి దోహదపడాలని పిలుపునిచ్చారు. భవిష్యత్తులో విద్యార్థులు స్టెమ్‌తో పాటు పర్యావరణం, వాణిజ్యం, సామాజిక శాస్త్రాలను నేర్చుకోవాలని, మౌలిక రంగంలో విజయం సాధించాలన్నారు. ఈ విధంగా గతి శక్తి విశ్వవిద్యాలయం అని పిలువబడే ప్రపంచ స్థాయి, బహు శాస్త్ర మిశ్రిత, బహు మితీయ, భవిష్యత్  సంస్థ ఏర్పాటైంది. జాతీయ దృక్పథానికి అనుగుణంగా ఎక్కువ మంది యువతను ప్రధాన స్రవంతి విద్య మరియు నైపుణ్య పర్యావరణ వ్యవస్థలోకి తీసుకురావాల్సిన అవసరం గురించి మంత్రి మాట్లాడారు. విద్యా వ్యవస్థ. ఉద్యోగాన్వేషణే కాకుండా ఉద్యోగాల సృష్టికర్తల తరాన్ని సృష్టించడమే మా ప్రయత్నం అని అన్నారు. వాగ్దానం చేసిన వాటిని అందించే కొత్త పని సంస్కృతి భారతదేశంలో అభివృద్ధి చెందుతోందని శ్రీ ప్రధాన్ అన్నారు. 

 

*****



(Release ID: 1848783) Visitor Counter : 121