కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

న‌మూనా ఆధారిత ఉత్ప‌త్తి ప‌థ‌కానికి ద‌ర‌ఖాస్తులు స‌మ‌ర్పించేందుకు ఆఖ‌రు తేదీ 25 ఆగ‌స్టు 2022వ‌ర‌కు పొడిగింపు


21 జూన్ 2022న ప్రారంభ‌మైన‌ టెలికాం & నెట్‌వ‌ర్కింగ్ ఉత్ప‌త్తుల కోసం ఉత్ప‌త్తి ఆధారిత ప్రోత్సాహ‌క ప‌థ‌కానికి ద‌ర‌ఖాస్తులదారుల న‌మోదు ప్ర‌క్రియ

Posted On: 04 AUG 2022 4:49PM by PIB Hyderabad

5జి కోసం బ‌ల‌మైన ప‌ర్యావ‌ర‌ణ వ్య‌వ‌స్థ‌ను ఏర్పాటు చేసే ల‌క్ష్యంతో, టెలికం & నెట్‌వ‌ర్కింగ్ ఉత్ప‌త్తుల కోసం పిఎల్ఐ ప‌థ‌క మార్గ‌ద‌ర్శ‌కాల‌ను 1 ఏప్రిల్ 2022 నుంచి న‌మూనా ఆధారిత త‌యారీని అద‌నంగా ఒక శాతం ప్రోత్సాహ‌క రేట్ల‌తో ప‌రిచ‌యం చేయ‌డానికి  స‌వ‌రించ‌డం జ‌రిగింది. ఈ ప‌థ‌కాన్ని 24 ఫిబ్ర‌వ‌రి 2021లో  రూ. 12, 195 కోట్ల ఆర్ధిక వ్య‌యంతో ప్ర‌వేశ‌పెట్టారు. 

టెలికాం & నెట్‌వ‌ర్కింగ్ ఉత్ప‌త్తుల కోసం ఉత్ప‌త్తి ఆధారిత ప్రోత్సాహ‌క ప‌థ‌కానికి ద‌ర‌ఖాస్తుల దారుల న‌మోదు ప్ర‌క్రియ 21 జూన్ 2022న ప్రారంభ‌మైంది. ద‌ర‌ఖాస్తుల స‌మ‌ర్ప‌ణ‌కు ఆఖ‌రు తేదీని తొలుత 20 జులై 2022గా నిర్ణ‌యించిన‌ప్ప‌టికీ, దానిని 5 ఆగ‌స్టు 2022 వ‌ర‌కూ పొడిగించారు. 
ఆస‌క్తి క‌లిగిన కంపెనీల విజ్ఞ‌ప్తుల‌ను దృష్టిలో పెట్టుకుని, ప‌థ‌కం పోర్ట‌ల్  ( https://plitelecom.udyamimitra.in ) పై ద‌ర‌ఖాస్తులు స‌మ‌ర్పించేందుకు ఆఖ‌రు తేదీని 25 ఆగ‌స్టు 2022 వ‌ర‌కు పొడిగించారు. 

 

***


(Release ID: 1848758) Visitor Counter : 133