సాంస్కృతిక మంత్రిత్వ శాఖ
డీమ్డ్ యూనివర్సిటీగా ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెరిటేజ్ (ఐఐహెచ్)ను నెలకొల్పనున్న ప్రభుత్వం
प्रविष्टि तिथि:
04 AUG 2022 4:57PM by PIB Hyderabad
యుజిసి ( విశ్వవిద్యాలయాలుగా భావించే సంస్థల) క్రమబద్దీకరణ, 2019 చట్టాన్ని అనుసరించి ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెరిటేజ్‌ను (ఐఐహెచ్) డీమ్డ్ యూనివర్సిటీగా, ఉత్తర్ ప్రదేశ్, గౌతంబుద్ధనగర్‌లోని నోయిడాలో నెలకొల్పాలని నిశ్చయింది.
దేశంలోనే ప్రత్యేక సంస్థగా భారతీయ వారసత్వం, పరిరక్షణ రంగాలలో ఉన్నత విద్య, పరిశోధనను అందించనుంది, కాగా, దేశంలో అటువంటి మరిన్ని సంస్థలను నెలకొల్పే ప్రణాళిక లేదా యోచన ప్రభుత్వానికి లేదు.
ఈ సమాచారాన్ని కేంద్ర సాంస్కృతిక వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి రాజ్యసభలో గురువారం వెల్లడించారు.
***
(रिलीज़ आईडी: 1848753)
आगंतुक पटल : 156