యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
క్రీడల్లో డోపింగ్ వ్యతిరేక కార్యకలాపాలను నియంత్రించడానికి చట్టబద్ధమైన సంస్థగా నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ(నాడా) జాతీయ డోపింగ్ నిరోధక బిల్లు-2022ను పార్లమెంటు ఆమోదించింది.
సొంత జాతీయ డోపింగ్ నిరోధక చట్టాన్ని కలిగి ఉన్న దేశాల సమూహంలో భారతదేశం చేరడం ఒక చరిత్రాత్మక సందర్భం: శ్రీ అనురాగ్ ఠాకూర్
దేశీయ, మరియు అంతర్జాతీయంగా క్రీడా పోటీలలో పాల్గొనేటప్పుడు మరియు సిద్ధమవుతున్నప్పుడు చేపట్టాల్సిన అత్యున్నత ప్రమాణాలను ఈ చట్టం నిర్ధారిస్తుంది: శ్రీ అనురాగ్ ఠాకూర్
Posted On:
03 AUG 2022 8:32PM by PIB Hyderabad
జాతీయ డోపింగ్ నిరోధక బిల్లు, 2022ను రాజ్యసభ ఈరోజు ఆమోదించింది. ఈ బిల్లు 17 డిసెంబర్, 2021న లోక్‌సభలో ప్రవేశపెట్టబడింది మరియు
స్టాండింగ్ కమిటీ మరియు మరికొందరు కీలక వాటాదారుల నుండి అందిన సూచనలు/సిఫార్సుల ఆధారంగా ప్రతిపాదించబడిన కొన్ని అధికారిక సవరణలతో 27 జూలై, 2022న ఆమోదించబడింది. దీనిని 2022 జూలై 28న రాజ్యసభలో ప్రవేశపెట్టారు. దీనితో, బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందింది. బిల్లుపై జరిగిన చర్చల్లో చెప్పుకోదగ్గ అంశం ఏమిటంటే, రాజకీయ వర్గాల్లోని సభ్యులు బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించారు.
బిల్లులోని ముఖ్యాంశాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి:
క్రీడలలో డోపింగ్ నిషేధం మరియు దేశంలో డోపింగ్ వ్యతిరేక కార్యకలాపాలను అమలు చేయడానికి చట్ట రూపంలో చట్టబద్ధమైన ఫ్రేమ్‌వర్క్ ప్రతిపాదిత బిల్లు నెరవేర్చడానికి ఉద్దేశించబడింది: -
- యాంటీ డోపింగ్‌లో సంస్థాగత సామర్థ్యాలను పెంపొందించడం మరియు ప్రధాన క్రీడా ఈవెంట్‌లను నిర్వహించడం;
- క్రీడాకారులందరి హక్కులను పరిరక్షించడం;
- అథ్లెట్లకు సమయానుకూలమైన న్యాయాన్ని నిర్ధారించడం;
- క్రీడల్లో డోపింగ్‌తో పోరాడడంలో ఏజెన్సీల మధ్య సహకారాన్ని పెంపొందించడం;
- స్వచ్ఛమైన క్రీడల కోసం అంతర్జాతీయ బాధ్యతలకు భారతదేశ నిబద్ధతను బలోపేతం చేయడం;
- యాంటీ-డోపింగ్ అడ్జుడికేషన్ కోసం స్వతంత్ర యంత్రాంగం;
- నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ (ఎన్‌ఏడీఏ) & నేషనల్ డోప్ టెస్టింగ్ లాబొరేటరీ (ఎన్‌డిటీఎల్)కి చట్టబద్దతను అందించడం;
- మరిన్ని డోప్ టెస్టింగ్ ల్యాబ్‌లను ఏర్పాటు చేయడం;
- ప్రత్యక్షంగా & పరోక్షంగా ఉద్యోగ అవకాశాలను సృష్టించడం; మరియు
- యాంటీ డోపింగ్‌కు సంబంధించిన విద్యా పరిశోధన, సైన్స్ మరియు తయారీకి అవకాశాలను సృష్టించడం.
- భారతదేశంలో క్రీడల కోసం పోషక పదార్ధాల తయారీకి ప్రమాణాలను ఏర్పాటు చేయడం.
కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రి శ్రీ అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ తమ స్వంత డోపింగ్ నిరోధక చట్టాన్ని కలిగి ఉన్న సుమారు 30 దేశాల సమూహంలో భారతదేశం చేరడం ఒక మైలురాయి అని అన్నారు. క్రీడలు, క్రీడాకారులు మరియు డోపింగ్‌ను ఎదుర్కోవడంలో భారతదేశం చాలా సీరియస్‌గా ఉందని ఈ చట్టం రూపొందించడం ప్రపంచానికి బలమైన సందేశాన్ని పంపుతుంది. కొత్త చట్టం దేశీయంగా మరియు అంతర్జాతీయంగా క్రీడా పోటీలలో పాల్గొనేటప్పుడు మరియు సన్నద్ధమవుతున్నప్పుడు సమగ్రతకు అత్యున్నత ప్రమాణాలను నిర్ధారిస్తుంది" అని మంత్రి వివరించారు. ఇది క్రీడల పట్ల మా నిబద్ధతను దృఢంగా నిర్ధారిస్తుందని తెలిపారు.
సభలో జరిగిన చర్చకు మంత్రి సమాధానమిస్తూ.. సాంకేతిక పరిజ్ఞానంతో నాడా యాంటీ డోపింగ్ ఎడ్యుకేషన్, అవేర్‌నెస్ జనరేషన్ టూల్‌కిట్‌ను అభివృద్ధి చేసిందని చెప్పారు. " డోపింగ్ మరియు సంబంధిత అంశాల గురించి పాఠశాల స్థాయి నుండి అవగాహన పెంపొందించడానికి కూడా కృషి చేస్తున్నాము. ఈ బిల్లు ఆమోదం దేశంలో డోపింగ్ నిరోధకానికి సంబంధించిన అవగాహన, విద్య మరియు పరిశోధన సౌకర్యాలను పెంచడానికి సహాయపడుతుంది" అని తెలిపారు. శ్రీ అనురాగ్ ఠాకూర్ ఇంకా మాట్లాడుతూ, మేము ఎన్‌డిటీఎల్ సామర్థ్యాన్ని పెంచాము, ఇది ఆత్మనిర్భర్ భారత్ దిశగా ప్రధాన మంత్రి కలలను నెరవేరుస్తుంది. దేశంలో మరిన్ని డోప్ టెస్టింగ్ ల్యాబొరేటరీలను ఏర్పాటు చేసేందుకు ఈ బిల్లు మార్గం సుగమం చేస్తుంది అని తెలిపారు.
***
(Release ID: 1848253)
Visitor Counter : 197