కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

హైస్పీడ్ ఇంటర్నెట్

Posted On: 03 AUG 2022 3:22PM by PIB Hyderabad

షెడ్యూల్డ్ కులాలుషెడ్యూల్డ్ తెగలు అధికంగా ఉన్న మారుమూల గ్రామాలతో సహా దేశంలోని టెలికాం సేవలు అందుబాటులో లేని గ్రామాలలో ప్రభుత్వం మరియు టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు (TSPలు) దశలవారీగా బ్రాడ్‌బ్యాండ్/ఇంటర్నెట్ సేవలు అందించనున్నారు. యూనివర్సల్ సర్వీస్ ఆబ్లిగేషన్ ఫండ్ (USOF) నిధులతో ప్రభుత్వం ఈశాన్య ప్రాంతం కోసం సమగ్ర టెలికాం అభివృద్ధి ప్రణాళికలెఫ్ట్ వింగ్ ఎక్స్‌ట్రీమిజం (LWE) ప్రభావిత ప్రాంత పథకాలుఆకాంక్షభరిత జిల్లాల పథకాలుదీవుల కోసం సమగ్ర టెలికాం అభివృద్ధి ప్రణాళిక మొదలైన పథకాలను కలిగి ఉంది. షెడ్యూల్డ్ కులాలుషెడ్యూల్డ్ తెగల అధికంగా ఉన్న మారుమూల గ్రామాలతో సహా దేశంలోని టెలికాం సేవలు అందుబాటులో లేని గ్రామాల్లో టవర్లను ఏర్పాటు చేయడం ద్వారా బ్రాడ్‌బ్యాండ్/ఇంటర్నెట్ సేవలను విస్తరించనున్నారు. వివిధ యూఎస్ఒఎఫ్ పథకాల కింద దాదాపు 4,330 మొబైల్ టవర్లు ఏర్పాటు చేయబడ్డాయి.

27.07.2022న కేంద్ర మంత్రివర్గం దేశవ్యాప్తంగా అందుబాటు సౌకర్యాలు లేని గ్రామాల్లో 4జీ మొబైల్ సేవలను సంతృప్తపరచడానికి మొత్తం రూ. 26,316 కోట్లు ఈ ప్రాజెక్ట్ మారుమూల మరియు కష్టతరమైన ప్రాంతాల్లోని 24,680 గ్రామాల్లో 4మొబైల్ సేవలను అందిస్తుంది. పునరావాసంకొత్త సెటిల్‌మెంట్‌లుఇప్పటికే ఉన్న ఆపరేటర్‌ల సేవల ఉపసంహరణ మొదలైన వాటి కారణంగా 20% అదనపు గ్రామాలను చేర్చాలనే నిబంధనను ఈ ప్రాజెక్ట్ కలిగి ఉంది. అదనంగాకేవలం 2జీ/3జీ కనెక్టివిటీ ఉన్న 6,279 గ్రామాలు 4జీ కి మార్పు చేయబడతాయి.

షెడ్యూల్డ్ కులాలుషెడ్యూల్డ్ తెగలు అధికంగా ఉన్న మారుమూల గ్రామాలతో సహా దేశంలోని అన్ని గ్రామ పంచాయతీలకు (GPs) బ్రాడ్‌బ్యాండ్ కనెక్టివిటీని అందించడానికి భారత్‌నెట్ ప్రాజెక్ట్ దశలవారీగా అమలు చేయబడింది25.07.2022 నాటికి మొత్తం 1,78,044 జీపీ లు సేవలకు సిద్ధంగా ఉన్నాయి. భారత్ నెట్ ప్రాజెక్ట్ కింద సృష్టించబడిన మౌలిక సదుపాయాలను సర్వీస్ ప్రొవైడర్లు బ్రాడ్‌బ్యాండ్/ఇంటర్నెట్ సేవలను అందించడానికి ఉపయోగించవచ్చు. భారత్‌నెట్ పరిధిని ఇటీవల 2025 కాలక్రమంతో దేశంలోని జీపీలను దాటి అన్ని నివాస గ్రామాలకు విస్తరించారు.

ఈ రోజు లోక్‌సభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంలో సమాచార ప్రసారాల శాఖ సహాయ మంత్రి శ్రీ దేవుసిన్హ చౌహాన్ ఈ సమాచారాన్ని అందించారు.

 

***



(Release ID: 1848129) Visitor Counter : 100


Read this release in: English , Urdu , Bengali , Tamil