భూ శా స్త్ర మంత్రిత్వ శాఖ

దేశవ్యాప్తంగా కొనసాగుతున్న 75 రోజుల కోస్టల్ క్లీనప్ ప్రచారం పై తొమ్మిది తీరప్రాంత రాష్ట్రాలకు చెందిన 46 మంది జిల్లా మేజిస్ట్రేట్లతో సమీక్ష నిర్వహించిన కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్: ప్రజా చైతన్య ప్రచార కార్యక్రమానికి సహకరించాలని విజ్ఞప్తి


ప్రపంచంలోనే అతి పొడవైన ,అతి పెద్ద బీచ్ క్లీనింగ్ ఆపరేషన్ అయిన "స్వచ్ఛ్ సాగర్, సురక్షిత్ సాగర్" ప్రచారం గురించి ఒక క్రెసెండోను నిర్మించడానికి సహాయం చేయాలని జిల్లా కలెక్టర్లను కోరిన మంత్రి

ప్రాంత కళాకారులతో స్థానిక, జాతి , సాంస్కృతిక అంశాలను జోడించడం
ద్వారా తీరా ప్రాంత జిల్లాలు ఒక ప్రత్యేకమైన క్లీన్-అప్ నమూనాను రూపొందించగలవు: డాక్టర్ జితేంద్ర సింగ్

Posted On: 02 AUG 2022 6:38PM by PIB Hyderabad

కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ , శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర హోదా) ఎర్త్ సైన్సెస్ శాఖ  సహాయ మంత్రి (స్వతంత్ర హోదా ) , పీఎంవో, సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్లు, అణుశక్తి, అంతరిక్ష శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఈ రోజు 9 తీరప్రాంత రాష్ట్రాలకు చెందిన 46 మంది డిప్యూటీ కమిషనర్లు / జిల్లా మేజిస్ట్రేట్లతో సమావేశమై దేశవ్యాప్తంగా కొనసాగుతున్న 75 రోజుల కోస్టల్ క్లీన్అప్ ప్రచారాన్ని సమీక్షించారు.  కేంద్ర భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ ప్రారంభించిన ఈ సామూహిక ప్రచారానికి మద్దతు ఇవ్వాలని వారిని కోరారు.

సంబంధిత అన్ని కేంద్ర మంత్రిత్వ శాఖలు, రాష్ట్ర ప్రభుత్వాలు అలాగే పౌర సమాజ సంస్థలు ఈ కార్యక్రమం లో భాగస్వాములయ్యా యని తెలిపారు.

 

"స్వచ్ఛ్ సాగర్, సురక్షిత్ సాగర్" ప్రచారం ప్రపంచంలోనే అతి పొడవైన , అతిపెద్ద తీరా ప్రాంత (బీచ్ క్లీనింగ్) ప్రచారంగా, ఇప్పటికే ప్రజలు దేశం దృష్టిని ఆకర్షించినందున జిల్లా కలెక్టర్లు సమాజంలోని అన్ని వర్గాలను భాగస్వామ్యం చేయడం ద్వారా ఒక స్థిరమైన ప్రచారాన్ని సృష్టించగలరని , నిజంగా ఒక గొప్ప స్థాయిని నిర్మించగలరని మంత్రి అన్నారు.

 

తీర ప్రాంత ప్రక్షాళన కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి "మొత్తం ప్రభుత్వ" విధానాన్ని నొక్కి చెప్పిన డాక్టర్ జితేంద్ర సింగ్, ఎన్జిఓలు, పౌర సమూహాలు, పిల్లలు ,యువజన వేదికలు, కార్పొరేట్లు, లాభాపేక్షలేని సంస్థలు, తీరప్రాంత రాష్ట్రాల మునిసిపల్ కార్పొరేషన్లు ,పర్యావరణ కార్యకర్తలను ఈ ప్రచార ఉద్యమం లోకి ఆకర్షించాలని జిల్లా కలెక్టర్లను కోరారు.దేశంలోని అన్ని వ ర్గాల నుంచి, ప్రత్యేకించి విద్యార్థి సమాజం ,

యువత కు  గరిష్టంగా భాగస్వామ్యం కల్పించే విధంగా ఒక బహుళ శాఖా ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించడం లో జిల్లా క లెక్టర్ పాత్ర ను ఆయన ప్రశంసించారు.

 

2022 సెప్టెంబర్ 17న అంతర్జాతీయ తీర పరిశుభ్రత దినోత్సవం సందర్భంగా ఎర్త్ సైన్సెస్ మంత్రిత్వ శాఖ జూలై 5 నుంచి ప్రారంభించిన 75 రోజుల సుదీర్ఘ ప్రచారం ముగుస్తుందని డాక్టర్ జితేంద్ర సింగ్ జిల్లా మేజిస్ట్రేట్లకు తెలియజేశారు.  సేవా దివస్ గా జరుపుకునే ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పుట్టిన రోజైన ఏప్రిల్ 17వ తేదీన దేశ వ్యాప్తంగా 75 బీచ్ ల లో ప్ర తి కిలోమీటర్ కు 75 మంది వాలంటీర్ల తో భారీ క్లీన్ అప్ డ్రైవ్ చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు.2022 సెప్టెంబర్ 17న సముద్ర తీరాల నుంచి 1,500 టన్నుల చెత్తను,

ప్రధానంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను తొలగించాలన్న లక్ష్యాన్ని సాధించడానికి అందరు భాగస్వాముల నుండి క్రియాశీల

సహకారాన్ని ఆయన కోరారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకలతో ఈ ఏడాది ఈ కార్యక్రమం కూడా ముడిపడి ఉందని ఆయన అన్నారు.

 

బీచ్ క్లీనింగ్ కార్యకలాపాల గురించి ప్రజలలో సాధారణ అవగాహన కల్పించడానికి స్థానిక కళాకారుల ప్బృందాలు , ఇతర సెలబ్రిటీలను నిమగ్నం చేయాలని , గుర్తించిన నాలుగు బీచ్ లలో గోవా-మోడల్ ఆఫ్ కోస్టల్ క్లీన్ అప్ ప్రచారాన్ని తీసుకురావాలని డాక్టర్ జితేంద్ర సింగ్ దక్షిణ గోవా కలెక్టర్ ను కోరారు.

 

అదేవిధంగా, పోర్ బందర్ ,మాధవ్ పూర్ ల 100 కిలోమీటర్ల తీరప్రాంతం వెంబడి చెత్తను శుభ్రపరచడం సహా వివిధ కార్యకలాపాలను చేపట్టడానికి పూర్తి వనరులను సమీకరించాలని గుజరాత్ లోని పోర్ బందర్ కలెక్టర్ ను మంత్రి కోరారు. గుజ రాత్ లోని మొత్తం ఏడు తీర ప్రాంత జిల్లాలు "స్వ చ్ఛ్ సాగర్ , సురక్షిత్ సాగర్" కార్యక్రమానికి పూర్తి మద్దతు ప్రకటించాయని చెప్పారు.

 

ఆసియాలోని అతిపెద్ద బీచ్ మెరీనా బీచ్ ఇంకా 29 కిలోమీటర్ల సముద్రతీరంతో సహా నాలుగు ప్రధాన బీచ్ లలో  ఇప్పటికే శుభ్రత కార్యకలాపాలు పురోగతి లో ఉన్నాయని,, రాబోయే రోజుల్లో ఇంకా వేగం పుంజుకుంటాయని చెన్నై జిల్లా కలెక్టర్ తెలియజేశారు. డయ్యూ, అండమాన్ -నికోబార్ దీవులు, తిరునాథపురం, ఎర్నాకుళం, కొల్లం మర,యు ఇతర జిల్లాల నుండి ఇతర జిల్లాల కలెక్టర్లు తమ రోడ్ మ్యాప్ ను, భవిష్యత్తు కార్యకలాపాలను మంత్రి దృష్టికి తెచ్చారు.

 

పరిశుభ్రత ప్రచారంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ముందడుగు వేశారని, 7500 కిలోమీటర్ల పొడవైన భారతదే తీర రేఖను పరిశుభ్రంగా, సురక్షితంగా , మానవాళికి ఆరోగ్యవంతంగా ఉంచడానికి యావత్ దేశాన్ని ప్రేరేపించారని డాక్టర్ జితేంద్ర సింగ్ పునరుద్ఘాటించారు.సెప్టెంబ ర్ 17న దేశ వ్యాప్తంగా 75 బీచ్ లలో ప్రతి కిలోమీటర్ కు 75 మంది వాలంటీర్ల తో నిర్వ హించనున్న భారీ క్లీన్ అప్ డ్రైవ్ లో అందరూ పాలుపంచుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

 

కోస్తా ప్రక్షాళన ప్రచారాన్ని మరింత బలోపేతం చేయడానికి , ప్రోత్సహించడానికి మొత్తం 9 తీరప్రాంత రాష్ట్రాల జిల్లా కలెక్టర్లతో క్రమం తప్పకుండా సంప్రదింపులు జరుపుతామని ఎంవోఈఎస్ కార్యదర్శి డాక్టర్ ఎం. రవిచంద్రన్, కార్యదర్శి డిఎఆర్ పిజి వి.శ్రీనివాస్ డాక్టర్ జితేంద్ర సింగ్ కు హామీ ఇచ్చారు. గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ కమిషనర్ గగన్ దీప్ సింగ్ బేడీ, పశ్చిమ బెంగాల్ హోం శాఖ ప్రత్యేక కార్యదర్శి అమితాబ్ సేన్ గుప్తా, కూడా ప్రచారాన్ని విస్తృతం చేయడానికి తమ వద్ద ఉన్న సమాచారాన్ని పంచుకున్నారు.

ఈ సమావేశంలో ఎంవోఈఎస్ నోడల్ అధికారులు, కోస్ట్ గార్డ్ ప్రతినిధులు, షిప్పింగ్ మంత్రిత్వ శాఖ ప్రతినిధులు, పర్యావరణ్ సంరక్షన్ గతివిధి సహా స్వచ్ఛంద సంస్థల, ప్రతినిధులు పాల్గొన్నారు.

 

జూలై 22వ తేదీన కేంద్రమంత్రులు, దేశంలోని తీరప్రాంత రాష్ట్రాలకు చెందిన పార్లమెంటు సభ్యుల సలహాలు, మద్దతు కోరేందుకు  డాక్టర్ జితేంద్ర సింగ్ ఒక ముఖ్యమైన సమావేశాన్ని నిర్వహించిన దరిమిలా ఈ రోజు జిల్లా కలెక్టర్లతో ఈ సమావేశం జరిగింది.కేంద్ర మంత్రులు భూపేందర్ యాదవ్, పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి, గజేంద్ర సింగ్ షెకావత్, జల్ శక్తి మంత్రి, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి , మన్సుఖ్ మాండవీయ, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ పురుషోత్తం రూపాలా, మత్స్య, పశుసంవర్ధక, పాడిపరిశ్రమ శాఖ మంత్రి ,వి.మురళీధరన్, విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి ,ఎల్.మురుగన, ఎం ఓ ఎస్ ,పెద్ద సంఖ్యలో తీరప్రాంత రాష్ట్రాలకు చెందిన ఎంపీలు ఈ సమావేశానికి హాజరయ్యారు.

 

 <><><><><>



(Release ID: 1847671) Visitor Counter : 129


Read this release in: English , Urdu , Marathi , Hindi