భూ శా స్త్ర మంత్రిత్వ శాఖ
భవిష్యత్ తరాలకు అంటార్కిటికాలో పరిశుద్ధమైనపరిస్థితులు కాపాడి దానిని భవిష్యత్ తరాలకు అందించేందుకు అవసరమైన శాస్త్రీయ పరిశోధన, సదుపాయాల కల్పనకు అంతర్జాతీయంగా బలమైన సహకారానికి కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ పిలుపు.
అంటార్కిటికా పరిశోధనపై 10 వ శాస్త్రవిజ్ఞానవేత్తల ఓపెన్ సైన్స్ సదస్సునుద్దేశించి వర్చువల్ విధానంలో
ప్రసంగించారు. ప్రపంచం ఇప్పుడు విపరీతమైన వాతావరణ మార్పులను చవిచూస్తున్నదని ఆయన అన్నారు. ఈ మార్పులు మానవులు ప్రకృతిలో చేసిన బలవంతపు మార్పుల ఫలితమని ఆయన అన్నారు.
అంటార్కిటికా వారసత్వ సంపదను , శాస్త్రీయ విజ్ఞానాన్నికాపాడడానికి శాస్త్రవేత్తలు ఉమ్మడి గొంతుతో మాట్లాడాల్సిన సమయం వచ్చిందని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు.
Posted On:
01 AUG 2022 5:44PM by PIB Hyderabad
కేంద్ర శాస్త్ర విజ్ఞాన శాఖ సహాయమంత్రి (స్వతంత్రశాఖ)కేంద్ర భూ విజ్ఞాన శాఖ సహాయమంత్రి (స్వతంత్ర), ప్రధానమంత్రి కార్యాలయం, సిబ్బంది, ప్రజాఫిర్యాదులు,పెన్షన్, అణుఇంధనం, అంతరిక్ష వ్యవహారాల శాఖ సహాయమంత్రి డాక్టర్ జితేంద్రసింగ్ మాట్లాడతూ, శాస్త్రవిజ్ఞాన పరిశోధన, తగిన సదుపాయాల విషయంలో అంతర్జాతీయ సహకారం అవసరమని ఆయన అన్నారు. అంటార్కిటికా ఖండం అతి పెద్ద రిఫ్రిజిరేటర్ అని, దీని పరిశుధ్ద పరిస్థితులను భవిష్యత్ తరాలకోసం కాపాడాల్సిందిగా ఆయన పిలుపునిచ్చారు.
అంటార్కిటికా పరిశోధనపై 10 వ శాస్త్రీయ కమ్యూనిటీ ఓపెన్ సైన్స్ కాన్ఫరెన్సునుద్దేశించి మంత్రి వర్చువల్ విధానంలో మాట్లాడారు.ప్రస్తుతం ప్రపంచం లో విపరీతమైన వాతావరణ మార్పులు చోటుచేసుకుంటున్నాయని, మానవులు చేసిన మార్పులకారణంగా ఈ పరిస్థితులు ఏర్పడ్డాయని ఆయన అన్నారు. అంటార్కిటికాలో మార్పులు వాతావరణ మార్పులపై ప్రభావం చూపుతున్నదని , ఇది ప్రపంచ వాతావరణ మార్పులపై మాత్రమే కాక ప్రపంచ ఆర్ధిక వ్యవస్థలపైన ,ప్రపంచ ఆరోగ్యంపైన ప్రభావితం చూపుతున్నదని అన్నారు. ఇలాంటి పరిస్థితులలో శాస్త్రవిజ్ఞానవేత్తలు ఒక్కతాటిపైకి వచ్చి, అంటార్కిటికా వారాసత్వం, శాస్త్రీయ స్పృహ ఉమ్మడి లక్ష్యాలను నెరవేర్చేదిశగా ఉమ్మడి గొంతుకతో మాట్లాడాలని అన్నారు.
అంటార్కిటికా ఒప్పందంలో, కమిటీ ఫర్ ఎన్నిరాన్‌మెంటల్ ప్రొటెక్షన్ (సిఇపి), అంటార్కిటిక్ మెరైన్ లివింగ్ రిసోర్సెస్ పరిరక్షణ ఒప్పందం వంటి వాటిలో ఇండియా క్రియాశీల సభ్యదేశమని డాక్టర్ జితేంద్రిసింగ్ అన్నారు. ఎస్ సి ఎ ఆర్ అంటార్కిటికా ఖండాన్ని పరిరక్షించడానికి కట్టుబడి ఉన్నట్టు తెలిపారు. అలాగే అంటార్కిటికా ఖండానికి చుట్టుపక్కల ఉన్న సముద్ర ప్రాంతాన్ని శాస్త్రీయ అధ్యయనాలు, కార్యాచరణతో కాపాడేందుకు కట్టుబడి ఉన్నట్టు తెలిపారు. అంటార్కిటికా పర్యావరణాన్ని కాపాడేందుకు మద్దతు నిచ్చేందుకు ఇండియా మద్దతునిస్తొందన్నారు. తూర్పు అంటార్కిటికా, వెడెల్ సముద్రాన్ని మెరైన్ రక్షిత ప్రాంతంగా ప్రకటించాలన్న యూరోపియన్ యూనియన్ ప్రతిపాదనకు సహ స్పాన్సరింగ్ చేస్తుందన్నారు.
నాలుగు దశాబ్దాలుగా ఇండియా అంటార్కిటికా పరిరక్షణలో ఉందన్నారు. తూర్పు అంటార్కిటికాలో ఆపరేషనల్ రిసెర్చ్ బేస్‌లు ఇండియా కలిగి ఉందన్నారు. ఇందులో ఒకటి చిర్‌మాచెర్ ఒయాసిస్ (మైత్రి), రెండోది లార్సెమాన్ హిల్స్ -భారతి . 2022 వ సంవత్సరంలో భారతి లో భారత పరిశోధనకు పది సంవత్సరాలు అవుతున్నదన్నారు. కార్బన్ ఫుట్‌ప్రింట్స్ ను తగ్ఇంఏందుకు పునరుత్పాదక ప్రత్యామ్నాయలను చూసేందుకు ఇండియా ప్రయత్నిస్తున్నట్టుతెలిపారు. ఇండియా దేశంలో ఇప్పటికే గ్రీన్ ఎనర్జీ చర్యల విషయంలో చొరవ చూపుతున్నదన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద సౌర విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ భద్లా సోలార్ పార్క్ ను 2245 మెగావాట్ల సామర్ధ్యంతో రాజస్థాన్‌లో నెలకొల్పారు. సుస్థిరాభివృద్ధికి ఇండియా కట్టుబడి ఉందని అన్నారు.
10 వ ఎస్ సిఎఆర్ ఓపెన్ సైన్స్ కాన్ఫరెన్సుకు ఇండియా ఆతిథ్యం ఇవ్వడం గొప్ప సమయమని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. భారతదేశం 75 వ స్వాతంత్ర ఉత్సవాల సమయంలో ప్రత్యేకించి ఆజాదికా అమృత్ మహోత్సవ్ సమయంలో ఒపెన్ సైన్స్ కాన్ఫరెన్సు కు ఆతిథ్యం ఇవ్వడం గర్వకారణమన్నారు.
వ్యక్తిగతంగా ఈ కార్యక్రమంలో కలుసుకునే అవకాశం లేకుండా పోయిందని అంటూ , ఎస్‌సిఎఆర్ సదస్సు ఆయా దేశాలను ఇండియాకు దగ్గర చేస్తుందన్నారు. ఇండియాకు గొప్ప సాంస్కృతిక, శాస్త్ర విజ్ఞాన చరిత్ర ఉందని ఆయన అన్నారు. అత్యంత పురాతన నగరాలు ఇండియాలో ఉన్నాయని కూడా ఆయన అన్నారు.
డాక్టర్ జితేంద్ర సింగ్ తన ముగింపు సమావేశంలో మాట్లాడుతూ అంటార్కిటికా కు సంబంధించి శాస్త్రవిజ్ఞానంపై , మినీ సమావేశాలు, ప్లీనరీలు ,సంభాషణలు, చర్చల ద్వారా శాస్త్రీయ సమాజం సుసంపన్నం అవుతుంది. వాతావరణ పరిరక్షణ. మహాసముద్ర ప్రాంతాలలో వాతావరణ సంబంధ సమస్యల పరిష్కారంలో అలాగే, నిర్దిష్ట సైన్స్ ప్రశ్నలకు సమాధానమివ్వడానికి కలిసి పని చేయడంపై మరింత చర్చ జరగాల్సిన సమయం ఆసన్నమైందని మంత్రి అన్నారు.
సముద్ర ప్రాంతాల లో వాతావరణ సంబంధ సమస్యలను పరిష్కరించడంలో నిర్దిష్ట సైన్స్ ప్రశ్నలకు సమాధానమివ్వడానికి కలిసి పని చేయడం ఎలా అనే దానిపై మరింత చర్చ జరగాల్సిన సమయం ఆసన్నమైందని మంత్రి అన్నారు.
***
(Release ID: 1847521)
Visitor Counter : 139