నీతి ఆయోగ్
azadi ka amrit mahotsav

ఇంక్యుబేషన్ సెంటర్ల ఏర్పాటుకు దరఖాస్తులు ఆహ్వానించిన అటల్ ఇన్నోవేషన్ మిషన్

Posted On: 02 AUG 2022 12:01PM by PIB Hyderabad

  అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ (ఏఐసి ) మరియు అటల్ కమ్యూనిటీ ఇన్నోవేషన్ సెంటర్ (ఏసీఐసీ) ఏర్పాటు చేయడం కోసం  అటల్ ఇన్నోవేషన్ మిషన్ (ఏఐఎం)నీతి ఆయోగ్ ఈరోజు దరఖాస్తులు ఆహ్వానించాయి. అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ (ఏఐసి ) మరియు అటల్ కమ్యూనిటీ ఇన్నోవేషన్ సెంటర్ (ఏసీఐసీ) ఏర్పాటును  అటల్ ఇన్నోవేషన్ మిషన్ (ఏఐఎం)నీతి ఆయోగ్ తమ ప్రధాన కార్యక్రమంగా అమలు చేస్తున్నాయి. ఇంక్యుబేటర్‌ల ప్రస్తుత పర్యావరణ వ్యవస్థను విస్తరించేందుకు మరియు వాటికి ప్రపంచ స్థాయి ప్రమాణాలు కల్పించి  ఉత్తమ విధానాలను అమలు చేయాలన్న లక్ష్యంతో దరఖాస్తులు ఆహ్వానించారు.   

ప్రపంచ స్థాయి ప్రమాణాలు కలిగిన సంస్థలను స్థాపించేందుకు దేశంలో ఔత్సాహిక  పారిశ్రామికవేత్తలకు సహకారం అందించే విధంగా దేశంలో ఇన్నోవేషన్ పర్యావరణ అభివృద్ధికి అవసరరమైన సహాయ సహకారాలను ఈ   రెండు కార్యక్రమాలు అందిస్తాయి. 

భారతదేశంలో ఆవిష్కరణలువ్యవస్థాపక రంగంలో అవసరమైన సహాయ సహకారం అందించి  అంకుర సంస్థలు ( స్టార్ట్-అప్‌లు)  మరియు వ్యవస్థాపకులకు  ఆవిష్కరణ మరియు వ్యవస్థాపక స్ఫూర్తిని పెంపొందించడానికి  అటల్ ఇన్నోవేషన్ మిషన్ (ఏఐఎం)నీతి ఆయోగ్ ప్రాధాన్యతా కార్యక్రమంగా   అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాయి. ప్రతి ఏడాది ఒక  అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ కు  అయిదు  సంవత్సరాల వ్యవధిలో  10 కోట్ల రూపాయల వరకు గ్రాంట్‌గా సహకారం అందుతుంది.  18 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలలో 2016 నుంచి ఇంతవరకు  68 అటల్ ఇంక్యుబేషన్ సెంటర్‌లను అటల్ ఇన్నోవేషన్ మిషన్ స్థాపించింది. వీటి ద్వారా  2700 కంటే ఎక్కువ స్టార్టప్‌లకు సహకారం లభించింది. 

 దేశంలో ఇంతవరకు ప్రాధాన్యతను నోచుకోనితగినంత ప్రాధాన్యత లభించని ప్రాంతాల్లో అంకుర సంస్థలు ( స్టార్ట్-అప్) ఆవిష్కరణ కార్యక్రమానికి  అవసరమైన అనువైన పరిస్థితిని అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో  అటల్ కమ్యూనిటీ ఇన్నోవేషన్ సెంటర్ కార్యక్రమం అమలు జరుగుతున్నది. ప్రతి అటల్ కమ్యూనిటీ ఇన్నోవేషన్ సెంటర్ కు  5 సంవత్సరాల వ్యవధిలో  2.5 కోట్ల రూపాయల వరకు గ్రాంట్‌గా సహకారం అందుతుంది. దేశవ్యాప్తంగా 14 అటల్ కమ్యూనిటీ ఇన్నోవేషన్ సెంటర్లను అటల్ ఇన్నోవేషన్ మిషన్ ఏర్పాటు చేసింది.

దేశ  స్టార్టప్ మరియు వ్యవస్థాపకత పర్యావరణ వ్యవస్థను సుసంపన్నం చేయడంలో అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ (ఏఐసి ) మరియు అటల్ కమ్యూనిటీ ఇన్నోవేషన్ సెంటర్ (ఏసీఐసీ) కీలక పాత్ర పోషిస్తాయి   ఆత్మనిర్భర్ భారత్ సాధన కోసం రెండు కార్యక్రమాలు ఉపయోగపడతాయి. 

దరఖాస్తుల ఆహ్వానించిన  సందర్భంగా మాట్లాడిన నీతి ఆయోగ్ సీఈఓ దేశాభివృద్ధిలో ఆవిష్కరణలు కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు.  సామాజిక వ్యవస్థాపకతతో కలిసి ఆవిష్కరణ రంగం ముందుకు సాగాల్సి ఉంటుందని   అన్నారు. భారతదేశం కోసం ఆవిష్కరణలు మరియు భారతదేశం నుంచి ఆవిష్కరణలు చేయడం ద్వారా దేశం  సవాళ్లను ఎదుర్కోవాలంటూ ప్రధాన మంత్రి ఇచ్చిన పిలుపును ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. 

నీతి  ఆయోగ్అటల్ ఇన్నోవేషన్ మిషన్  డైరెక్టర్  డాక్టర్ చింతన్ వైష్ణవ్  మాట్లాడుతూ ఒక దేశంగా ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి సాధించేందుకు  స్టార్టప్  వ్యవస్థ నుంచి  ప్రోత్సాహంసహకారం   అవసరం ఉంటాయని అన్నారు.  అటల్ ఇన్నోవేషన్ మిషన్‌లో ఈ అంశలకు ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. ఆర్థిక వ్యవస్థలో అన్ని రంగాలకు తగిన స్థానం లభిస్తుందని అన్నారు. దీనివల్ల సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. 

 అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ కోసం    https://aimapp2.aim.gov. in/aic2022/లో దరఖాస్తు చేసుకోవచ్చు

 

అటల్ కమ్యూనిటీ ఇన్నోవేషన్ సెంటర్ కోసం    https://acic.aim.gov.in/ acic-application/ లో దరఖాస్తు చేసుకోవచ్చు. 

***


(Release ID: 1847350) Visitor Counter : 268