సాంస్కృతిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

రేపు "తిరంగా ఉత్సవ్"లో పాల్గొననున్న కేంద్ర హోం వ్యవహారాలు, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా"హర్ ఘర్ తిరంగా" గీతం తో పాటు వీడియో లాంఛ్ చేయబడుతుంది


పింగళి వెంకయ్య గౌరవార్థం స్మారక పోస్టల్ స్టాంపును విడుదల చేయనున్నారు

Posted On: 01 AUG 2022 6:34PM by PIB Hyderabad

 

 

రేపు న్యూఢిల్లీలో పింగళి వెంకయ్య 146వ జయంతి సందర్భంగా జాతికి పింగళి వెంకయ్య చేసిన సేవలను పురస్కరించుకుని సాంస్కృతిక మంత్రిత్వ శాఖ సాంస్కృతిక మరియు సంగీత ప్రదర్శనలతో కూడిన సాయంత్రం "తిరంగ ఉత్సవ్"ను నిర్వహించనుంది .

 

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా హాజరుకానున్నారు. సంస్కృతి , పర్యాటకం మరియు ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి , కమ్యూనికేషన్స్ , ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మరియు రైల్వే శాఖ మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్ , పార్లమెంటరీ వ్యవహారాలు మరియు సాంస్కృతిక శాఖ సహాయ మంత్రి శ్రీ అర్జున్ రామ్ మేఘ్వాల్ , విదేశీ వ్యవహారాలు మరియు సాంస్కృతిక శాఖ సహాయ మంత్రి శ్రీమతి మీనాక్షి లేఖి మరియు కమ్యూనికేషన్స్ శాఖ సహాయ మంత్రి శ్రీ దేవుసింగ్ చౌహాన్, అనేక ఇతర ప్రముఖులతోపాటు, ఈ దేశభక్తి మహోత్సవం  వేడుకకు హాజరుకానున్నారు.

 

ఈ కార్యక్రమంలో పింగళి వెంకయ్య దేశానికి ఎనలేని సేవలందించినందుకు స్మారక పోస్టల్ స్టాంప్‌ను విడుదల చేయడంతో పాటు ఆయన కుటుంబ సభ్యులను సన్మానించనున్నారు. తిరంగ ఉత్సవ్ "హర్ ఘర్ తిరంగ" గీతం మరియు వీడియో లాంచ్ కు కూడా సాక్ష్యమివ్వనుంది.. సంగీత సాయంత్రం లో  కైలాష్ ఖేర్ , కైలాస, హర్షదీప్ కౌర్ మరియు డాక్టర్ రాగిణి మక్కర్ వంటి వంటి మేస్ట్రోల ప్రత్యక్ష ప్రదర్శనలు కనిపిస్తాయి.

 

స్వాతంత్ర్య సమరయోధుడు, భారత జాతీయ పతాక రూపకర్త అయిన పింగళి వెంకయ్య గాంధేయ సిద్ధాంతాలను అనుసరించేవారు, మహాత్మాగాంధీ అభ్యర్థన మేరకు కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగులతో భారత జాతీయ పతాకాన్ని మధ్యలో చక్రంతో రూపొందించారు.

 

భారతదేశానికి స్వాతంత్ర్యం పొందిన 75 వ సంవత్సరాన్ని ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌గా జరుపుకునే చారిత్రాత్మక రోజుగా సాంస్కృతిక సాయంత్రం గుర్తించబడుతుంది. దేశంలోని అత్యంత ముఖ్యమైన రత్నాలలో ఒకరైన పింగళి వెంకయ్యకు గొప్ప నివాళి అవుతుంది.

 

****(Release ID: 1847154) Visitor Counter : 75