సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ

సెంట్రల్ జూ అథారిటీ 39వ సమావేశం

Posted On: 31 JUL 2022 4:39PM by PIB Hyderabad

సెంట్రల్ జూ అథారిటీ 39వ సమావేశం ఈరోజు న్యూ ఢిల్లీలోని నేషనల్ జూలాజికల్ పార్క్‌లో కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి శ్రీ భూపేందర్ యాదవ్ అధ్యక్షతన జరిగింది. 

 కార్యదర్శి లీనా నందన్ తో సహా  పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ అధికారులు; అడవుల డైరెక్టర్ జనరల్, ప్రత్యేక కార్యదర్శి శ్రీ చంద్ర ప్రకాష్ గోయల్ , వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ డాక్టర్ ఎస్ పి యాదవ్, అదనపు డైరెక్టర్ జనరల్ (వైల్డ్ లైఫ్) శ్రీ బివాష్ రంజన్అదనపు కార్యదర్శి, ఆర్థిక సలహాదారు శ్రీ ప్రవీర్ పాండే పాల్గొన్నారు. ఈ సమావేశానికి ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్, స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ ప్రతినిధులు, ఇతర సభ్యులు హాజరయ్యారు.

                                     రెండు ప్రచురణల ఆవిష్కరణ -నేషనల్ స్టడ్‌బుక్ ఫర్ స్నో లెపర్డ్, సిజెడ్ఏ త్రైమాసిక వార్తాలేఖ

             సిజెడ్ఏ ద్వారా 2021-22 ఆర్థిక సంవత్సరంలో చేపట్టిన కార్యకలాపాల గురించి సభ్యులకు ఈ సమావేశంలో వివరించారు 

 * 18 జంతు ప్రదర్శన శాలలను సమీక్షించారు. 10 మాస్టర్ ప్లాన్లకు అంగీకరించారు 

* భారతీయ జంతుప్రదర్శనశాలలలో సంరక్షణ, పెంపకం, పరిరక్షణ పరిజ్ఞానం ప్రయోజనాల కోసం 69 జాతీయ, 10 అంతర్జాతీయ జంతువుల సేకరణ/బదిలీ చేశారు 

* జంతుప్రదర్శనశాలల నిర్వహణ సమర్థత మూల్యాంకనం (ఎంఈఈ-జూ) (ప్రపంచంలో మొదటిసారి) 39 గుర్తింపు పొందిన జంతుప్రదర్శనశాలలలో (పెద్ద, మధ్యస్థ జంతు ప్రదర్శనశాలలు) చేపట్టారు. 

* 12 మార్చి 2021న గౌరవనీయులైన ప్రధానమంత్రి ప్రారంభించిన ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకలో దేశవ్యాప్తంగా ఉన్న జంతుప్రదర్శనశాలలు చురుకుగా పాల్గొంటున్నాయి. ఈ కార్యక్రమం ఇప్పటి వరకు, 72 జంతుప్రదర్శనశాలలను 72 వారాల పాటు రోజువారీగా హైలైట్ చేస్తూ 72 జంతుప్రదర్శనశాలలను కవర్ చేసింది. ఈ కార్యక్రమాల ఇతివృత్తం - పరిరక్షణ నుండి కలిసి ఉండడం వరకు: ప్రజలతో అనుసంధానం 

* సిజెడ్ఏ, అంతరించిపోతున్న జాతుల కోసం ప్రతిపాదిత నేషనల్ రెఫరల్ సెంటర్-వైల్డ్‌లైఫ్ బయో-బ్యాంకింగ్ కార్యక్రమాలతో సహా శాస్త్రీయ సంస్థల మధ్య పరిశోధన సహకారాలు చేపట్టాలని ఈ ప్రతిపాదిత కార్యకలాపాలలో ఒకటి.

* జూ మేనేజ్‌మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (జూ-ఎంఐఎస్)- సిజెడ్ఏ కి చట్టబద్ధమైన రిపోర్టింగ్, ప్రతిపాదన సమర్పణలను సులభతరం చేయడానికి అభివృద్ధి చేసిన వెబ్ అప్లికేషన్

* భారతీయ జంతుప్రదర్శనశాలలు అత్యాధునిక పరిశోధనలతో పరిరక్షణకు ఒక గొప్ప శక్తిగా మారేలా చేయడానికి విజన్ ప్లాన్ 2021-31తో జంతుప్రదర్శనశాలలు చేపట్టిన కార్యకలాపాలను సమలేఖనం చేయడానికి చర్యలు ప్రారంభమయ్యాయి. అన్ని వయసుల ప్రజలకు  సందర్సకులుగా అనుభూతిని కలిగించే  కేంద్రాలుగా జూలు. 

 రెడ్ పాండా, గౌర్, మంచు చిరుత, ఇండియన్ చెవ్రోటైన్, రెడ్ పాండా, వెస్ట్రన్ ట్రాగోపాన్ వంటి జీవజాతుల పరిరక్షణకు కార్యక్రమాలు

ఈ సమావేశంలో టెక్నికల్ కమిటీ, అడ్మినిస్ట్రేటివ్ కమిటీ సిఫార్సులను సమీక్షించి ఆమోదించారు. ఇతర చర్చల్లో సెంట్రల్ జూ అథారిటీ వార్షిక నివేదిక (2021-22), ఇండియన్ జూ మధ్య జంతువుల సేకరణ/బదిలీ ప్రతిపాదనలు ఉన్నాయి.

ప్రముఖ వ్యక్తులతో కూడిన భారతీయ జంతుప్రదర్శనశాలలకు రాయబారులను గుర్తించే ప్రతిపాదనపై కూడా చర్చించారు. జంతుప్రదర్శనశాలలు చేపట్టే పరిరక్షణ కార్యక్రమాలకు మద్దతును పొందడంతోపాటు ఈ రంగంలో బహుళ రంగాల జాతీయ, అంతర్జాతీయ సహకారాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమం జరిగింది. 

 

 

 

*****



(Release ID: 1846794) Visitor Counter : 169