సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

డిడి స్పోర్ట్స్‌పై కామ‌న్‌వెల్త్ గేమ్స్ 2022 ప్ర‌త్య‌క్ష ప్ర‌సారాలు


అనేక వేదిక‌ల‌లో భార‌త్ ప్రాతినిధ్యానికి విస్త్ర‌త క‌వ‌రేజి

నాడు పోస్టు చేయడమైనది: 29 JUL 2022 3:21PM by PIB Hyderabad

ఎంతో వేడుక‌గా జ‌రుపుకునే కామ‌న్‌వెల్త్ క్రీడ‌లు ప్రారంభ‌మైన నేప‌థ్యంలో దూర‌ద‌ర్శ‌న్ స్పోర్ట్స్  ప్రారంభ వేడుక నుంచి 8 ఆగ‌స్టు 2022న ముగియ‌నున్నవేడుక వ‌ర‌కు అన్ని కార్య‌క్ర‌మాల‌ను,  క్రీడ‌ల‌ను మైదానం నుంచి ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేస్తోంది. 
 డిడి స్పోర్ట్స్ త‌న ప్రసారాల‌ను 28 జులై, 2022న ఇంగ్లాండ్‌లోని బ‌ర‌హింగ్‌హాంలో అలెగ్జాండ‌ర్ స్టేడియంలో ఘ‌నంగా జ‌రిగిన ప్రారంభ వేడుకతో ప్రారంభించింది. 20 క్రీడా విభాగాల్లో వ్యాపించి ఉన్న‌క్రీడా కార్య‌క్ర‌మాల‌ను డిడి ఫ్రీడిష్ పై జులై 29 నుంచి డిడి స్పోర్ట్స్ మాత్ర‌మే ప్ర‌త్య‌క్ష ప్రసారాల‌ను చేస్తోంది, 
దాదాపు 215మంది క్రీడాకారులతో కూడిన భార‌తీయ బృందం 16 క్రీడా విభాగాల‌లో పాలుపంచుకుంటోంది. వివిధ వేదిక‌ల‌లో బ‌హుళ టోర్న‌మెంట్లు ఏక‌కాలంలో జ‌రుగుతున్నందున‌, డిడి స్పోర్ట్స్ ప్ర‌సారాలు క్రీడ‌ల‌లో వివిధ ఈవెంట్ల‌కు విస్త్ర‌త క‌వ‌రేజ్ ఇవ్వ‌డంతో పాటుగా భార‌త్‌కు సంబంధించిన అన్ని మ్యాచ్‌లు, కార్య‌క‌లాపాలు, భాగ‌స్వామ్యం పై ప్ర‌ధానంగా దృష్టిని కేంద్రీక‌రిస్తోంది. 
డిడి స్పోర్ట్స్‌లో ప్ర‌సారాలు ప్ర‌తిరోజూ మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు ప్రారంభ‌మై, ఆ రోజు పోటీల ముగింపు దాకా సాగుతాయి. డిడి స్పోర్ట్స్ రోజువారీ ప్ర‌సారాల‌లో ఆ రోజు జ‌రుగ‌నున్న పోటీల గురించి మ‌న‌కు ఒక ఐడియా ఇచ్చేందుకు క్రీడా నిపుణులు, జ‌ర్న‌లిస్టుల‌తో ఆట‌ల‌కు అర‌గంట‌ ముంద‌స్తుగా కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హిస్తోంది. రోజు మొత్తం మీదా, బ్రేక్‌ల సంద‌ర్భంలో డిడి స్పోర్ట్స్ యాంక‌ర్ జ‌రుగబోయే పోటీల గురించి ప్రేక్ష‌కుల‌కు వివ‌రాల‌ను అందిస్తారు. 
డిడి స్పోర్ట్స్ ఛానెల్ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం మాత్ర‌మే కాకుండా ఆలిండియా రేడియో, డిడి స్పోర్ట్స్ ట్విట్ట‌ర్ హ్యాండిల్ (@ddsportschannel ), ఆలిండియా రేడియో స్పోర్ట్స్ (@akashvanisports)హ్యాండిళ్ళ‌పై మైదానంలో జ‌రుగుతున్న ప‌రిణామాల గురించి ఎప్ప‌టిక‌ప్పుడు స‌మాచారం ఇస్తున్నాయి. 
ఇంగ్లాండు, బ‌ర్మింగ్‌హాంలొ జ‌రుగుతున్న కామ‌న్‌వెల్త్ గేమ్స్ 2022లో డెబ్భై రెండు దేశాలు పాలు పంచుకుంటున్నాయి.

***


(రిలీజ్ ఐడి: 1846612) సందర్శకుల సూచీ సంఖ్య : : 198
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Punjabi , Gujarati