రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

ఆప‌రేష‌న్ విజ‌య్‌లో గ‌న్స్ & గ‌న్న‌ర్స్ పోరాటానికి త‌గిన నివాళిగా కార్గిల్ లోని ద్రాస్ వ‌ద్ద గ‌ల పాయింట్ 5140కి గ‌న్‌హిల్‌గా నామ‌క‌ర‌ణం

Posted On: 30 JUL 2022 11:33AM by PIB Hyderabad

భార‌తీయ సైనిక ద‌ళాల విజ‌యాన్ని స్మ‌రించుకోవ‌డానికి, ఆప‌రేష‌న్ విజ‌య్ లో వారు చేసిన అత్యున్న‌త త్యాగానికి నివాళులు అర్పించ‌డం కోసం కార్గిల్ సెక్ట‌ర్‌లోని ద్రాస్ వ‌ద్ద పాయింట్ 5140కు గ‌న్ హిల్ అని నామ‌క‌ర‌ణం చేయ‌డం జ‌రిగింది. 
భార‌తీయ సైన్యానికి చెందిన శ‌త‌ఘ్నిద‌ళం, ప్రాణాంత‌క‌మైన‌, ఖ‌చ్చిత‌మైన మందుగుండు సామాగ్రితో శ‌త్రు ద‌ళాల‌పై పాయింట్ 5140 స‌హా ప‌లు ప్రాంతాల‌లో వారి సైనిక వ్య‌వ‌స్థ‌ల‌పై భారీ ప్ర‌భావం చూప‌డమే యుద్ధ కార్య‌క‌లాపాల‌ను స‌త్వ‌రంగా ముగించ‌డానికి కీల‌క కార‌ణ‌మైంది. 
శ‌త‌ఘ్ని ద‌ళం త‌ర‌ఫున  ద్రాస్‌లోని కార్గిల్ యుద్ధ స్మార‌కానికి డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ ఆఫ్ ఆర్టిల‌రీ అయిన లెఫ్ట్న‌నెంట్ జ‌న‌ర‌ల్ టికె, చావ్లా, ఈ ఆప‌రేష‌న్‌లో పాలుపంచుకున్న‌అనుభ‌వ‌జ్ఞులు అయిన వెట‌ర‌న్ గ‌న్న‌ర్ల‌తో  క‌లిసి పుష్ప‌గుచ్ఛాన్ని అక్క‌డ ఉంచారు. లెఫ్ట‌నెంట్ ఫైర్ & ఫ్యూరీ కార్ప్స్ జ‌న‌ర‌ల్ ఆఫీస‌ర్ క‌మాండింగ్ అయిన జ‌న‌ర‌ల్ అనింద్య సేన్‌గుప్తా ఈ గంభీర‌మైన సంద‌ర్భంగా పుష్ప‌గుచ్చాన్ని ఉంచారు. 
ఆప‌రేష‌న్ విజ‌య్‌లో కార్గిల్ అనే గౌర‌వ బిరుదును పొందిన  అన్ని శ‌త‌ఘ్ని ద‌లాల వెట‌రన్ల స‌మ‌క్షంలో ఈ కార్యక్ర‌మం జ‌రిగింది. గ‌న్న‌ర్ ఫ్రెట‌ర్నిటీకి చెందిన‌ అధికారులు కూడా ఈ సంద‌ర్భంగా పాల్గొన్నారు.   


(Release ID: 1846606) Visitor Counter : 202