భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav g20-india-2023

అడ్వాన్స్ డ్ కెమిస్ట్రీ సెల్ (ఎసిసి) బ్యాటరీ స్టోరేజీ కోసం (పి ఎల్ ఐ) పథకం

కింద ప్రోగ్రామ్ అగ్రిమెంట్ పై సంతకం చేసిన మూడు కంపెనీలు

పి ఎల్ ఐ ప్రోగ్రామ్ కింద ఎం హెచ్ ఐ ద్వారా కేటాయించిన సామర్థ్యాలకు అదనంగా, ప్రయివేట్ కంపెనీలు 95 జి డబ్యు హెచ్
వరకు బ్యాటరీ తయారీ సామర్థ్యాన్ని సృష్టిస్తాయని అంచనా

బ్యాటరీ తయారీకి మనం దార్శనికతను ఏర్పరుచుకున్నందున, ఈ అభ్యుదయ రంగంలో ప్రపంచవ్యాప్తంగాఇతర దేశాలతో పోటీపడుతున్నందున ఈ ఒప్పందం భారతదేశ తయారీ పరిశ్రమలో ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తుంది: శ్రీ పాండే

Posted On: 29 JUL 2022 12:04PM by PIB Hyderabad

అడ్వాన్స్డ్ కెమిస్ట్రీ సెల్ (ఎసిసి) బ్యాటరీ స్టోరేజీ కోసం ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (పిఎల్ఐ) పథకం కింద ఎంపిక చేసిన చేయబడిన ముగ్గురు బిడ్డర్లు 2022 జూలై 28 ఇక్కడ ప్రోగ్రామ్ అగ్రిమెంట్ పై  సంతకం చేశారు.

 

ఎసిసి బ్యాటరీ స్టోరేజీ కోసం పిఎల్ఐ పథకం గురించి కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి డాక్టర్ మహేంద్ర నాథ్ పాండే మాట్లాడుతూ - "బ్యాటరీ తయారీకి మనం దార్శనికత ను నిర్దేశించుకుని , అభ్యుదయ రంగం లో ప్రపంచవ్యాప్తంగా ఇతర దేశాలతో పోటీపడుతున్నందున ఇది భారతదేశం యొక్క తయారీ పరిశ్రమలో ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తుంది‘‘ అన్నారు. ఎసిసి బ్యాటరీ స్టోరేజీ కోసం పిఎల్ స్కీం గురించి వ్యాఖ్యానిస్తూ, ఇది ఈవీ  ఎకోసిస్టమ్, ఎనర్జీ స్టోరేజీ మార్కెట్ కు అనుకూలంగా ఉంటుందని, ఎందుకంటే ఇది ఈవి లు, పునరుత్పాదక అవసరాలకు మద్దతు ఇస్తుం దని ఇంకా రంగంలో పెట్టుబడులను ఆకర్షిస్తుందని కేంద్ర మంత్రి వివరించారు. నేడు పెద్ద కంపెనీలు భారతదేశంలో బ్యాటరీ తయారీలో పెట్టుబడులు పెడుతున్నాయి. మనం వారికి మద్దతు ఇవ్వాలి. ఇంకా భారతదేశాన్ని నిజమైన ప్రపంచ తయారీ కేంద్రంగా మార్చాలి. కాప్ 26లో గౌరవ ప్రధాని మోదీ ఇచ్చిన పంచామృతం పట్ల భారతదేశ నిబద్ధతను సాధించడానికి కూడా ఇది మనకు సహాయపడుతుంది" అని ఆయన అన్నారు.

రిలయన్స్ న్యూ ఎనర్జీ లిమిటెడ్, ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రైవేట్ లిమిటెడ్, రాజేష్ ఎక్స్పోర్ట్స్ లిమిటెడ్ కంపెనీలు ఇందులో ఉన్నాయి. ఈ కంపెనీలు భారతదేశ ₹ 18,100 కోట్ల కార్యక్రమం కింద ప్రోత్సాహకాలను పొందుతాయి. పిఎల్ ఐ ప్రోగ్రామ్ కింద భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ ద్వారా కేటాయించబడ్డ సామర్థ్యాలకు అదనంగా, ప్రయివేట్ ప్లేయర్ లు ~95 జి డబ్ల్యు హెచ్  వరకు బ్యాటరీ తయారీ సామర్థ్యాన్ని అందించగలవని భావిస్తున్నారు. 

 

ఎసిసి బ్యాటరీ స్టోరేజీ  పిఎల్ఐ పథకం కింద 128 గిగావాట్ల తయారీ సామర్థ్యం ఉన్న కంపెనీల నుండి మొత్తం పది బిడ్లు వచ్చాయి.

ఎసిసి పిఎల్ఐ కార్యక్రమం కింద, తయారీ కేంద్రాన్ని రెండు సంవత్సరాల వ్యవధిలో ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. భారతదేశంలో తయారైన బ్యాటరీల అమ్మకంపై ఐదు సంవత్సరాల కాలవ్యవధిలో ప్రోత్సాహకాలను పంపిణీ చేస్తారు.

 

కార్యక్రమ ఒప్పందంపై సంతకాలు చేసిన బిడ్డర్ లను భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి శ్రీ కృష్ణ పాల్ కూడా అభినందించారు. ఫేమ్ 2, ఆటో, ఆటో కాంపోనెంట్స్ కోసం పిఎల్ఐ స్కీం బ్యాటరీ తయారీ వరకు దేశంలో ఈవి ఎకోసిస్టమ్ అభివృద్ధికి గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వం స్థిరమైన విధానం, నియంత్రిత మద్దతు , సాధ్యం చేయగల వ్యవస్థ లను అందించింది" అని ఆయన అన్నారు.

 

సందర్భంగా, భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ అరుణ్ గోయల్ మాట్లాడుతూ  " మహమ్మారి మధ్యలో దేశంలో బ్యాటరీ తయారీని ప్రోత్సహించడానికి 13 నెలల రికార్డు సమయం (గెజిట్ నోటిఫైడ్- జూన్ 2021 ,ప్రోగ్రామ్ అగ్రిమెంట్ సంతకం- జూలై 2022) లో పిఎల్ఐ ఎసిసి ప్రోగ్రామ్ పై ఎంహెచ్ విజయవంతంగా పూర్తి అయింది. ఇప్పుడు ప్రైవేట్ సంస్థలు ఆటగాళ్ళు నాయకత్వం వహించడానికి ప్రపంచ ఛాంపియన్లుగా మారడానికి ,ఇంధన నిల్వ విభాగంలో దేశాన్ని గ్లోబల్ హబ్ గా మార్చడానికి ఇది సరైన సమయం. ముందుకు సాగుతున్న ప్రయాణంలో వారికి నా శుభాకాంక్షలను తెలియజేస్తున్నాను' అని పేర్కొన్నారు.

 

18,100 కోట్ల రూపాయల బడ్జెట్ వ్యయంతో భారతదేశ తయారీ సామర్థ్యాలను పెంపొందించడానికి ఎసిసి యాభై (50) గిగా వాట్ అవర్ (జిడబ్ల్యుహెచ్) తయారీ సామర్థ్యాన్ని సాధించడానికి ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (పిఎల్ఐ) పథకం 'నేషనల్ ప్రోగ్రామ్ ఆన్ అడ్వాన్స్డ్ కెమిస్ట్రీ సెల్ (ఎసిసి) బ్యాటరీ స్టోరేజ్' పథకానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. పైన పేర్కొన్న చొరవ కింద, అధిక దేశీయ విలువ జోడింపును సాధించడం, అదే సమయంలో భారతదేశంలో బ్యాటరీ తయారీ సమతల వ్యయం ప్రపంచవ్యాప్తంగా పోటీతత్వంతో ఉండేలా చూడటం ప్రభుత్వ ఉద్దేశం.

 

ప్రోగ్రామ్ స్వభావరీత్యా సాంకేతిక పరిజ్ఞాన ఆధారిత మైనదిఅందువల్ల బ్యాటరీల వాంఛిత అవుట్ పుట్ పై మాత్రమే దృష్టి కేంద్రీకరించే విధంగా రూపొందించబడింది.

తద్వారా లబ్ధిదారుని సంస్థకు తగిన అధునాతన సాంకేతిక పరిజ్ఞానం , సంబంధిత ప్లాంట్ , మెషినరీ, ముడిపదార్థాలు ఇంకా ఏదైనా అప్లికేషన్ ని అందించడానికి  సెల్ మాన్యుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని ఏర్పాటు చేయడం కోసం ఇతర మధ్యంతర గూడ్స్ ని ఎంచుకునే స్వేచ్ఛ ఉంటుంది.

 

కార్యక్రమం దేశీయ తయారీని పెంపొందించే పెట్టుబడిని ఆశిస్తుంది .ఎలక్ట్రిక్ వాహనాలు ,స్థిరమైన స్టోరేజీ రెండింటి కోసం బ్యాటరీ స్టోరేజీ డిమాండ్ సృష్టించడంతో పాటుగా దేశంలో ఒక సంపూర్ణ దేశీయ సప్లై ఛైయిన్ ను, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అభివృద్ధి చేస్తుంది. ముడిచమురు దిగుమతులను గణనీయంగా తగ్గించడం ,జాతీయ గ్రిడ్ స్థాయిలో పునరుత్పాదక వాటాను పెంచడం వల్ల ఎసిసి పిఎల్ఐ పథకం దేశానికి పొదుపును నేరుగా ప్రభావితం చేస్తుందని భావిస్తున్నారు.

అడ్వాన్స్డ్ కెమిస్ట్రీ సెల్ (ఏ సి సి) (₹18,100 కోట్లు) కోసం ఈ పిఎల్ఐ పథకం, ఆటోమోటివ్ రంగానికి ఇప్పటికే ప్రారంభించబడిన పిఎల్ఐ (₹25,938 కోట్లు) పథకం, ఇంకా ఎలక్ట్రిక్ వాహనాల తయారీని వేగంగా స్వీకరించడం (ఎఫ్ ఎ ఎమ్ ఇ) కోసం ₹10,000 కోట్ల తో చేపట్టిన కార్యక్రమం ద్వారా సాంప్రదాయ శిలాజ ఇంధన ఆధారిత ఆటోమొబైల్ రవాణా వ్యవస్థ నుండి పర్యావరణపరంగా పరిశుభ్రమైన, స్థిరమైన, అధునాతనమైన ,మరింత సమర్థవంతమైన ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) ఆధారిత వ్యవస్థ వైపు  భారతదేశం దూసుకెళ్లడానికి వీలు కల్పిస్తుంది.

 

ప్రపంచ స్థాయి ఉత్పాదక గమ్యస్థానంగా భారతదేశ తిరుగులేని పురోగతిపై పరిశ్రమ తన విశ్వాసాన్ని పునరుద్ఘాటించింది, ఇది ఆత్మనిర్భర్ భారత్ - స్వావలంబన భారతదేశం అనే గౌరవ ప్రధాన మంత్రి పిలుపుకు అనుగుణంగా ప్రతిధ్వనిస్తుంది.

 

ఎడీ/ఎన్ ఎస్                                                                         

                                                                                                                  

***

 (Release ID: 1846204) Visitor Counter : 251


Read this release in: English , Urdu , Hindi , Kannada