భూ శా స్త్ర మంత్రిత్వ శాఖ
కేరళలో భారీ వర్షపాత నమోదులో పెరుగుదల కనిపిస్తోందని పేర్కొన్న ప్రభుత్వం
प्रविष्टि तिथि:
28 JUL 2022 12:20PM by PIB Hyderabad
కేరళలో భారీ వర్షపాత సంఘటనలు పెరుగుతున్న ధోరణిని కనబరుస్తున్నట్లు ప్రభుత్వం ఈరోజు తెలిపింది. నైరుతి రుతు పవనాల సీజన్ (జూన్ నుండి సెప్టెంబర్ వరకు) 2001- 2021 కాలానికి సంబంధించిన సమాచారం మేరకు కేరళ రాష్ట్రంలో భారీ వర్షపాతం కార్యకలాపాలు పెరుగుతున్నాయని.. రాజ్యసభలో ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ కేంద్ర శాస్త్ర మరియు సాంకేతిక శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత), ఎర్త్ సైన్సెస్ శాఖ సహాయ మంత్రి, ప్రధాన మంత్రి కార్యాలయ శాఖ సహాయ మంత్రి, పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్స్, పెన్షన్లు, అణుశక్తి మరియు అంతరిక్ష శాఖల సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. ఇటీవలి సంవత్సరాలలో వర్షాకాలంలో భారీ వర్షపాతం (64.4 కంటే ఎక్కువ మరియు 115.5 మిమీ కంటే తక్కువ), అతి భారీ వర్షపాతం (115.5 కంటే ఎక్కువ మరియు 204.4 మిమీ కంటే తక్కువ), అత్యంత భారీ వర్షపాతం (204.4 మిమీ కంటే ఎక్కువ) మరియు భారీ వర్షపాతం అంతకంటే ఎక్కువ నైరుతి సమయంలో కురిసిన సంఘటనల సంఖ్య పెరుగుతున్నట్టుగా ఆయన వివరించారు.భారత వాతావరణ శాఖ (ఐఎండీ) కేరళ రాష్ట్ర పరిధిలో స్వయంచాలక వాతావరణ కేంద్రాల నెట్‌వర్క్‌ను పెంచాలని యోచిస్తోంది. బీఐఎస్-1994 ప్రమాణాల ప్రకారం, కేరళలో 115 వాతావరణ స్టేషన్లు ఉండాలి. ఐఎండీ కేరళలో 100 ఆటోమేటిక్ వెదర్ స్టేషన్స్ (ఏడబ్ల్యుఎస్) కోసం ప్లాన్ చేసింది. మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ ఇటీవలే 77 ఏడబ్ల్యుఎస్‌లను ఇన్‌స్టాల్ చేసింది మరియు మిగిలిన 23 ఏడబ్ల్యుఎస్‌ల ఏర్పాటు పనులు కొనసాగుతున్నాయి. దీనికి తోడు కేరళలో అదనంగా 15 ఏడబ్ల్యుఎస్ స్టేషన్లు ఉన్నాయి, తద్వారా కేరళకు మొత్తం 92 ఆటోమేటిక్ వాతావరణ స్టేషన్లు అందుబాటులో ఉన్నట్టయింది. ఇవి కాకుండా ఈ రాష్ట్రంలో 10 ఆధునికీకరించిన స్వయంచలితంగా వర్షపాతాన్ని కొలిచే స్టేషన్‌లు కూడా ఉన్నాయి. ఐఎండీ ఇప్పటికే కేరళ కోసం మంజూరు చేయబడిన స్వయంచాలక వాతావరణ స్టేషన్ల సంస్థాపన కార్యక్రమాన్ని వేగవంతం చేసింది.
***
(रिलीज़ आईडी: 1846103)
आगंतुक पटल : 148