భూ శా స్త్ర మంత్రిత్వ శాఖ
నీలి ఆర్థిక విధానం (బ్లూ ఎకానమీ పాలసీ)
Posted On:
27 JUL 2022 12:48PM by PIB Hyderabad
కేంద్ర ఎర్త్ సైన్సెస్ మంత్రిత్వ శాఖ దేశం కోసం నీలి ఆర్థిక వ్యవస్థ (బ్లూ ఎకానమీపై) జాతీయ విధానాన్ని ఖరారు చేసింది. భారతదేశ నీలి ఆర్థిక వ్యవస్థపై ముసాయిదా పాలసీ ఫ్రేమ్‌వర్క్ తయారు చేయబడింది. ముసాయిదా బ్లూ ఎకానమీ పాలసీ ఫ్రేమ్‌వర్క్ తీర ప్రాంతాల స్థిరమైన అభివృద్ధి కోసం సముద్ర డొమైన్‌లోని అన్ని రంగాల (జీవన, నిర్జీవ వనరులు, పర్యాటకం, సముద్ర శక్తి మొదలైనవి) యొక్క సరైన వినియోగాన్ని పరిగణలోకి తీసుకుంది. ఈ పాలసీ డాక్యుమెంట్‌లో నేషనల్ అకౌంటింగ్ ఫ్రేమ్‌వర్క్ ఫర్ బ్లూ ఎకానమీ మరియు ఓషన్ గవర్నెన్స్, కోస్టల్ మెరైన్ స్పేషియల్ ప్లానింగ్ మరియు పర్యటకం ప్రాధాన్యత, మెరైన్ ఫిషరీస్, ఆక్వాకల్చర్ మరియు చేపల ప్రాసెసింగ్‌పై కీలక సిఫార్సులు ఉన్నాయి. తయారీ, అభివృద్ధి చెందుతున్న పరిశ్రమలు, వాణిజ్యం, సాంకేతికత, సేవలు, నైపుణ్యాభివృద్ధి, లాజిస్టిక్స్, మౌలిక సదుపాయాలు, షిప్పింగ్, తీర, లోతైన సముద్ర మైనింగ్, ఆఫ్‌షోర్ శక్తి మరియు భద్రత, వ్యూహాత్మక కొలతలు అంతర్జాతీయ ఎంగేజ్‌మెంట్‌లు కూడా ఇందులో పరిగణనలోకి తీసుకున్నారు.
బ్లూ ఎకానమీ అడ్వైజరీ కౌన్సిల్‌లో పలువురికి చోటు..
ప్రతిపాదిత నేషనల్ బ్లూ ఎకానమీ అడ్వైజరీ కౌన్సిల్‌లో (బీఈఏసీ) సంబంధిత మంత్రిత్వ శాఖలు/డిపార్ట్‌మెంట్ల కార్యదర్శులను కలిగి ఉంటుంది. సభ్యులుగా ఇందులో కోస్తా రాష్ట్రాల ముఖ్య కార్యదర్శులు/ప్రిన్సిపల్ సెక్రటరీలు మరియు పరిశ్రమల ప్రతినిధులు కూడా ఉంటారు. ముసాయిదా పాలసీ డాక్యుమెంట్ సాధారణ ప్రజలు , సంబంధిత భాగస్వామ్యపక్షాల వారి అభిప్రాయాలు మరియు ఫీడ్‌బ్యాక్ కోసం ఉంచబడింది. మంత్రిత్వ శాఖలు/ డిపార్డ్‌మెంట్లు, పార్లమెంట్ సభ్యులు, ప్రభుత్వేతర సంస్థలు (ఎన్‌జీవోలు), పరిశ్రమల ప్రతినిధులు మరియు సాధారణ ప్రజల నుండి స్వీకరించబడిన అనేక విలువైన అభిప్రాయాలు/సూచనలు పరిగణనలోకి తీసుకోబడినాయి. తదనుగుణంగా పాలసీ పత్రం సవరించబడింది.
75 బీచ్‌ల శుభ్రతకు75 రోజుల తీరప్రాంత క్లీన్-అప్ కార్యక్రమం ..
'స్వచ్ఛ్ పృథ్వీ.. స్వచ్ఛ్ సాగర్' థీమ్‌తో ఎటువంటి కార్యాచరణ లేకుండా 'స్వచ్ఛ్ సాగర్, సురక్షిత్ సాగర్' థీమ్‌తో కార్యాచరణ అమలు చేయబడుతోంది. ఇది 05 జూలై 2022న ప్రారంభమై 17 సెప్టెంబర్ 2022న ‘అంతర్జాతీయ తీరప్రాంత క్లీన్ అప్ డే’తో ముగుస్తుంది, తీరప్రాంత జిల్లాల వెంబడి కనీసం 75 బీచ్‌ల శుభ్రత కోసం 75 రోజుల పాటు సాగే తీరప్రాంత క్లీన్-అప్ కార్యక్రమం ఇది. భారత కోస్ట్ గార్డ్, ఎంఓఈఎఫ్ & సీసీ, ఎంఓవైఏఎస్, ఎన్‌డీఎంఈ, పర్యవరణ సంరక్షణ గతివిధి మరియు ప్రభుత్వ విభాగాలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు మరియు విద్యార్థులతో కలిసి ఎంఓఈఎస్ ఈ కార్యాక్రమాన్ని నిర్వహిస్తోంది. పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలలో ఎర్త్ డే, ఓషన్ డే మొదలైన వాటి ద్వారా సమస్యలపై అవగాహన ప్రచారాలు, పోటీలు, వర్క్‌షాప్‌లు/సెమినార్‌ల కోసం చర్యలు/కార్యక్రమాలు ఉంటాయి. ఎర్త్ సైన్సెస్ శాఖ మరియు సైన్స్ & టెక్నాలజీ శాఖ సహాయ మంత్రి (ఐసీ) డా. జితేంద్ర సింగ్ ఈరోజు లోక్‌సభకు ఇచ్చిన ఒక లిఖితపూర్వక సమాధానంలో ఈ సమాచారాన్ని అందించారు.
***
(Release ID: 1845648)
Visitor Counter : 232