సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ
2014 నుంచి ఇంతవరకు ఏడు లక్షల 22 వేల మందికి పైగా వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖలలో శాశ్వత ఉద్యోగాలు పొందారు.. డాక్టర్ జితేంద్ర సింగ్
2021-22 బడ్జెట్ నుంచి ప్రారంభించిన ఉత్పాదకత తో కూడిన ప్రోత్సాహక (పీఎల్ఐ) ) పథకాల ద్వారా కొత్తగా 60 లక్షల కొత్త ఉద్యోగాల కల్పన ... డాక్టర్ జితేంద్ర సింగ్
Posted On:
27 JUL 2022 1:29PM by PIB Hyderabad
వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖల్లో 2014 నుంచి ఇంతవరకు దాదాపు ఏడు లక్షల 22వేల మంది ఉద్యోగాలు పొందారు.
ఉపాధి కల్పన తో పాటు ఉపాధి అవకాశాలు మెరుగుపరచే అంశాలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తున్నదని కేంద్ర శాస్త్ర సాంకేతిక, భూ శాస్త్రం, సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్, అణుశక్తి, అంతరిక్ష శాఖ సహాయ (స్వతంత్ర) డాక్టర్ జితేంద్ర సింగ్ ఈ రోజు లోక్ సభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానం లో తెలిపారు.
వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖల్లో నియామకాల కోసం నియామక సంస్థలు సిఫార్సు చేసిన అభ్యర్థుల వివరాలు క్రింది విధంగా ఉన్నాయి.
సంవత్సరం
|
మొత్తం
|
2014-15
|
1,30,423
|
2015-16
|
1,11,807
|
2016-17
|
1,01,333
|
2017-18
|
76,147
|
2018-19
|
38,100
|
2019-20
|
1,47,096
|
2020-21
|
78,555
|
2021-22
|
38,850
|
మొత్తం (2014-22)
|
7,22,311
|
దేశంలో ఉపాధి అవకాశాలను మెరుగు పరిచేందుకు కేంద్ర ప్రభుత్వం వివిధ చర్యలు తీసుకుందని డాక్టర్ జితేంద్ర సింగ్ వివరించారు. 2021-22 బడ్జెట్ లో ప్రభుత్వం ఉత్పాదకతతో కూడిన ప్రోత్సాహక (పీఎల్ఐ) పథకాన్ని ప్రారంభించింది. 2021-22 నుంచి అయిదు సంవత్సరాలపాటు 1.97 లక్షల కోట్ల అంచనాలతో పీఎల్ఐ పథకాలు అమలు జరుగుతాయి. ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎల్ఐ పథకాల వల్ల కొత్తగా 60 లక్షల ఉపాధి అవకాశాలు కలుగుతాయి. నిర్ణీత ఆర్థిక పరిమితులకు లోబడి వివిధ మంత్రిత్వ శాఖలు/విభాగాలు పీఎల్ఐ పథకాలను అమలు చేస్తున్నాయి.
స్వయం ఉపాధి అవకాశాలను కల్పించేందుకు ప్రభుత్వం ప్రధానమంత్రి ముద్ర యోజన పథకాన్ని అమలు చేస్తున్నది. ప్రధానమంత్రి ముద్ర యోజన పథకం కింద ఎలాంటి హామీ లేకుండా 10 లక్షల వరకు రుణం ఇవ్వడం జరుగుతుంది. సూక్ష్మ/చిన్న వ్యాపార సంస్థలు, వ్యక్తులు సంస్థలు ప్రారంభించేందుకు లేదా వ్యాపార సంస్థలను విస్తరించేందుకు వీలుగా రుణం అందించబడుతుంది.
వీధి వ్యాపారుల కోసం ప్రధానమంత్రి వీధి వ్యాపారుల ఆత్మ నిర్భర్ నిధి (పీఎం స్వనిధి పథకం) పథకాన్ని 2020 జూన్ ఒకటి నుంచి ప్రభుత్వం అమలు చేస్తున్నది. కోవిడ్-19 మహమ్మారి వల్ల నష్టపోయిన వీధి వ్యాపారాలు తిరిగి వ్యాపారాలను ప్రారంభించేందుకు అవసరమైన పెట్టుబడిని రుణ రూపంలో ఈ పథకం ద్వారా అందిస్తున్నారు.
ఆత్మ నిర్భర్ భారత్ రోజ్‌గార్ యోజన పథకం 2020 అక్టోబర్ 1 నుంచి అమలు జరుగుతున్నది. కోవిడ్-19 ప్రభావం వల్ల జరిగిన ఉపాధి నష్టాన్ని భర్తీ చేసి, నూతన ఉపాధి అవకాశాలు కల్పించేలా విధంగా యజమానులను ప్రోత్సహించాలన్న లక్ష్యంతో పథకం అమలు జరుగుతున్నది. పధకంలో చేరేందుకు 31.03.2022 ని తుది గడువుగా నిర్ణయించారు.13.07.2022 నాటికి 59.54 లక్షల మంది లబ్ధిదారులకు పథకం ద్వారా ప్రయోజనం అందించబడింది. వారిలో 53.23 లక్షల మంది లబ్ధిదారులు కొత్తగా చేరారు.
ఈ కార్యక్రమాలతో పాటు ఉపాధి అవకాశాలు కల్పించాలన్న లక్ష్యంతో మేక్ ఇన్ ఇండియా, స్టార్ట్-అప్ ఇండియా, డిజిటల్ ఇండియా, స్మార్ట్ సిటీ మిషన్, పునరుజ్జీవనం మరియు పట్టణ పరివర్తన కోసం అటల్ మిషన్, ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం , మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి వంటి హామీ పథకం , పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన, దీన్ దయాల్ ఆంటోదయ యోజన నేషనల్ అర్బన్ లైవ్లీహుడ్ మిషన్ మొదలైన పథకాలు అమలు జరుగుతున్నాయి. పరిశుద్ధ ఇంధనం,ప్రతి ఒక్కరికీ శ్రేయస్సు నినాదంతో వ్యవస్థాపక శక్తి అభివృద్ధి, ఉపాధి అవకాశాల కల్పన లక్ష్యంగా పీఎం గతి శక్తి కార్యక్రమానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ ఒక విప్లవాత్మక పధకంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నది.
***
(Release ID: 1845392)
Visitor Counter : 164