మత్స్య పరిశ్రమ, పశు పోషణ మరియు పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా మత్స్య సహకార సంఘాల అభివృద్ధి పాత్ర అనే అంశంపై వెబినార్ నిర్వహించిన మత్స్యశాఖ


వెబినార్ లో పాల్గొన్న దేశం వివిధ ప్రాంతాలకు చెందిన నిపుణులు,మత్స్య పెంపకందారులు, రైతులు

Posted On: 23 JUL 2022 1:47PM by PIB Hyderabad

మత్స్య సహకార సంఘాల అభివృద్ధిఅభివృద్ధిలో వాటి  పాత్ర అనే అంశంపై మత్స్యశాఖపశుసంవర్ధకపాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 2022 జూలై 22 (శుక్రవారం ) వెబినార్ జరిగింది. దేశానికి స్వాతంత్య్రం సిద్దించి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా నిర్వహిస్తున్న  ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా మత్స్య శాఖ వెబినార్ నిర్వహించింది. మత్స్య శాఖ నిర్వహించిన వెబినార్ లలో ఇది 14 వది. 

కేంద్ర మత్స్య శాఖ కార్యదర్శి శ్రీ జతీంద్ర నాథ్ స్వైన్ అధ్యక్షతన వెబినార్ జరిగింది. కార్యక్రమంలో మత్స్య శాఖ సంయుక్త కార్యదర్శి (ఇన్ ల్యాండ్ ఫిషరీస్), సంయుక్త కార్యదర్శి ( మెరైన్ ఫిషరీస్) డాక్టర్. జె.బాలాజీ మత్స్య శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మత్స్యకారుల అభివృద్ధిలో మత్స్య సహకార సంఘాలు పోషించడానికి గల అవకాశాలను చర్చించి, ప్రణాళిక రూపొందించేందుకు ఈ వెబినార్ జరిగింది. మత్స్య రంగం సంపూర్ణ, సమగ్ర అభివృద్ధి సాధించి, మత్స్యకారుల జీవన స్థితిగతులను మెరుగుపర్చేందుకు అమలు చేయాల్సిన కార్యక్రమాన్ని వెబినార్ చర్చించింది. వివిధ రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన మత్స్యశాఖ అధికారులు, మత్స్య రంగ నిపుణులు, మత్స్యకారులు,చేపల పెంపకం దారులు, పారిశ్రామికవేత్తలు, మత్స్యకార సహకార సంఘాల సభ్యులు , వ్యవసాయ, వెటర్నరీ మరియు ఫిషరీస్ విశ్వవిద్యాలయాల సిబ్బందిమత్స్య సహకార అధికారులుశాస్త్రవేత్తలతో  సహా 100 మందికి పైగా వెబినార్ లో పాల్గొన్నారు. 

కార్యక్రమంలో మాట్లాడిన కేంద్ర మత్స్య శాఖ కార్యదర్శి శ్రీ జతీంద్ర నాథ్ స్వైన్ దేశంలో మత్స్య రంగ ఉత్పత్తి, ఉత్పాదకత పెరుగుతున్నదని అన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని చిన్న తరహా మత్స్యకారులకు సంస్థాగతంగా రుణ పరపతి, నాణ్యమైన ముడిపదార్ధాలు, రవాణా తదితర సౌకర్యాలు లభించేలా చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కార్యక్రమాలు రూపొందించిందని అన్నారు. 

దేశంలో మత్స్యకార సహకార సంఘాల ప్రాధాన్యతను మత్స్య శాఖ సంయుక్త కార్యదర్శి శ్రీ సాగర్ మెహ్ర వివరించారు. దేశంలో మత్స్యకార సహకార సంఘాలను మరింత వ్యవస్థీకరించవలసి ఉందని ఆయన అన్నారు. ఇటీవల కాలంలో మత్స్య రంగం అభివృద్ధి పధంలో పయనిస్తున్నదని అయన చెప్పారు. మరింత అభివృద్ధి సాధించేందుకు పాడి పరిశ్రమ, వ్యవసాయ రంగాల్లో అనుసరిస్తున్న ఉత్తమ విధానాలను ఈ రంగంలో అమలు చేయాలని ఆయన అన్నారు.పాడి పరిశ్రమ, వ్యవసాయ రంగాల్లో బలంగా ఉన్న సహకార విధానం మత్స్య రంగంలో కూడా అమలు జరగాలన్నారు. 

  720 మత్స్య ఉత్పత్తిదారుల సంఘాలను ఏర్పాటు చేయాలని ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం కింద ప్రతిపాదించారు. వీటిలో 135 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టాలని ప్రతిపాదించడం జరిగింది. మొత్తం 720 సంఘాలలో 500 సంఘాలను ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం కింద, మిగిలిన 220 సంఘాలను కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ సహకారంతో ప్రారంభించాలని నిర్ణయించారు. ఎన్సీడీసీ, నేషనల్ ఫిషరీస్ డెవలప్‌మెంట్ బోర్డ్ సహకారంతో ఇప్పటికే మత్స్యశాఖ 47.80 కోట్ల రూపాయలను సమీకరించి 90కి పైగా సంఘాలను ప్రారంభించింది. 

మత్స్య రంగంలో అభివృద్ధి సాధించి పోటీతత్వాన్ని అలవరచడానికి మత్స్య ఉత్పత్తిదారుల సంఘాలను ఏర్పాటు చేయాలని  ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం కింద ప్రతిపాదించారు. రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలు సభ్యత్వ కార్యక్రమాన్ని ప్రోత్సహించి, నూతనంగా సహకార సంఘాలను ప్రారంభించేందుకు ముందుకు వచ్చిన వారిని ప్రోత్సహించాల్సి ఉంటుంది. సంఘం ప్రారంభమైన రోజు నుంచి అభివృద్ధి సాధించేందుకు అవసరమైన సౌకర్యాలు కల్పించి, సభ్యుల సామర్ధ్యాన్ని పెంపొందించేందుకు రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు అవసరమైన సహాయ సహకారం అందిస్తాయి. మత్స్యకారులు ఆర్ధికంగా పురోభివృద్ధి  చూసేందుకు మత్స్య రంగం ద్వారా వారు సుస్థిర ఆదాయం పొంది. సామజిక -ఆర్థిక పురోభివృద్ధిని సాధించేలా చేయాలన్న లక్ష్యంతో పథకం  అమలు జరుగుతుంది. 

 వెబినార్ కు నిపుణులుగా హాజరైన ఎన్సీపీ డైరెక్టర్ జనరల్ శ్రీ సందీప్ కుమార్ నాయక్ పాట్నా  DNS రీజినల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కోఆపరేటివ్ మేనేజ్‌మెంట్ డైరెక్టర్ డాక్టర్.కె.పీ  రాజన్తమిళనాడు ఫిషరీస్ అడిషనల్ డైరెక్టర్ డాక్టర్ ఎస్. నూర్జహాన్ బీవీ మరియు ఉనా హెచ్‌పి అగ్రిఆర్గానిక్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్  డైరెక్టర్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్   శ్రీ అనిల్ రాణా మత్స్య రంగ అభివృద్ధికి అమలు చేయాల్సిన చర్యలను వివరించారు. వెబినార్ లో పాల్గొన్న వారు వివిధ అంశాలపై అడిగిన ప్రశ్నలకు నిపుణులు సమాధానం ఇచ్చారు. 

***


(Release ID: 1844231)