పర్యటక మంత్రిత్వ శాఖ
పర్యాటకం, ఆతిధ్య రంగాలు భారతదేశంలోనే అతిపెద్ద ఉపాధి కల్పించే రంగాల్లో ఒకటి: శ్రీ జి.కిషన్ రెడ్డి
3వ TSA ప్రకారం 2019-20 సంవత్సరంలో పర్యాటక రంగం 79.86 మిలియన్ల ప్రత్యక్ష మరియు పరోక్ష ఉద్యోగాలను కల్పించింది
Posted On:
21 JUL 2022 5:17PM by PIB Hyderabad
టూరిజం మరియు హాస్పిటాలిటీ రంగం భారతదేశంలో అతిపెద్ద ఉపాధిని కల్పించే రంగాలలో ఒకటి మరియు విదేశీ మారక ద్రవ్య సంపాదన (FEE) ప్రధాన భాగాన్ని ఉత్పత్తి చేయడానికి దోహదపడుతోంది. 3వ TSA (టూరిజం శాటిలైట్ ఖాతా) ప్రకారం 2017-18, 2018-19 మరియు 2019-20 సంవత్సరాలకు దేశ ఉపాధికి పర్యాటకం సహకారం క్రింది విధంగా ఉంది:
|
2017-18
|
2018-19
|
2019-20
|
ఉద్యోగాలలో భాగస్వామ్యం (%లో)
|
14.78
|
14.87
|
15.34
|
ప్రత్యక్ష (%)
|
6.44
|
6.48
|
6.69
|
పరోక్ష (%)
|
8.34
|
8.39
|
8.65
|
పర్యాటకం కారణంగా ప్రత్యక్ష + పరోక్ష ఉద్యోగాలు (మిలియన్‌లలో)
|
72.69
|
75.85
|
79.86
|
18.07.2022 నాటికి, ఇన్‌క్రెడిబుల్ ఇండియా టూరిజం ఫెసిలిటేటర్ (ఐఐటిఎఫ్) బేసిక్ సర్టిఫికేట్ కోర్సు 03 బ్యాచ్‌ల కోసం పరీక్షలు విజయవంతంగా నిర్వహించబడ్డాయి, దీని కింద మొత్తం 3795 మంది అభ్యర్థులు విజయం సాధించినట్లు ప్రకటించబడింది. వారి పోలీసు ధృవీకరణ పూర్తయిన తర్వాత వారికి సర్టిఫికెట్లు అందించబడతాయి. . ఐఐటిఎఫ్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ కోసం సవరించిన మార్గదర్శకాల ప్రకారం, ఇప్పటికే ఉన్న ప్రాంతీయ స్థాయి గైడ్‌లు (ఆర్ ఎల్ జిలు) ఇన్‌క్రెడిబుల్ ఇండియా టూరిస్ట్ గైడ్స్ (IITGs)గా పేరు మార్చబడ్డాయి. మొత్తం 1795 ఐఐటిజిలు (అధికారికంగా ఆర్ ఎల్ జిలు అంటారు) రిఫ్రెషర్ కోర్సును విజయవంతంగా పూర్తి చేశారు.
దేశవ్యాప్తంగా సుశిక్షితులైన మరియు ప్రొఫెషనల్ టూరిస్ట్ ఫెసిలిటేటర్ యొక్క పూల్ ను సృష్టించే లక్ష్యంతో ఐఐటిఎఫ్ సి కార్యక్రమం 01.01.2020 న ప్రారంభించబడింది. ఇది ఒక డిజిటల్ చొరవ, ఇది ఐఐటి ఎఫ్ సి ప్రోగ్రాం కింద ప్రాథమిక, అధునాతన (వారసత్వం మరియు సాహసం), స్పోకెన్ లాంగ్వేజ్ మరియు అభ్యర్థులకు రిఫ్రెషర్ కోర్సుల కోసం ఆన్లైన్ అభ్యాస వేదికను అందిస్తుంది. మార్కెట్ డిమాండ్, టూరిజం వాటాదారుల అభ్యర్థన మొదలైన వాటిని దృష్టిలో పెట్టుకొని ఐఐటిఎఫ్ సి కొరకు మార్గదర్శకాలు రూపొందించబడ్డాయి. ఇటీవల, వాటాదారుల నుంచి అందుకున్న అభ్యర్థన ప్రకారం, ఐఐటిజి (అడ్వాన్స్ & హెరిటేజ్) కోర్సు కోసం గ్రాడ్యుయేషన్ లేదా తత్సమాన డిగ్రీకి కనీస విద్యా ప్రమాణాలను పెంచారు.
ఈ సమాచారాన్ని పర్యాటక మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి ఈ రోజు రాజ్య సభలో ఒక లిఖిత పూర్వక సమాధానం ద్వారా ఇచ్చారు.
(Release ID: 1843589)
Visitor Counter : 203