రక్షణ మంత్రిత్వ శాఖ
న్యూఢిల్లీ నుంచి డ్రాస్ (లడాఖ్) వరకు ఉద్దేశించిన కార్గిల్ యుద్ధ స్మారక మోటార్ సైకిల్ యాత్ర ప్రారంభం
Posted On:
18 JUL 2022 12:33PM by PIB Hyderabad
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ స్ఫూర్తిని పురస్కరించుకొని 1999లో జరిగిన కార్గిల్ యుద్ధంలో పాకిస్తాన్ పై 23 సంవత్సరాల విజయాన్ని సంస్మరించుకునేందుకు న్యూఢిల్లీ నుంచి డ్రాస్ (లడాఖ్)లోని కార్గిల్ యుద్ధ స్మారకం వరకు మోటార్ బైక్ యాత్రను భారతీయ సైన్యం నిర్వహించింది. జాతీయ యుద్ధ స్మారకం, న్యూఢిల్లీ నుంచి బయలుదేరిన 30 మంది సభ్యుల ర్యాలీకి 18 జులై 2022న వైస్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ లెఫ్టినెంట్ జనరల్ బిఎస్ రాజు జెండా ఊపి ప్రారంభించారు.
రాబోయే ఆరు రోజుల్లో ఈ స్వప్న సాహస యాత్రను ప్రారంభించిన 30మంది సిబ్బందితో కూడిన బృందం, భారత సైన్యానికి పర్యాయపదంగా ఉన్న ధైర్యాన్ని, సాహస స్ఫూర్తిని పునరుజ్జీవింపచేయడం ద్వారా కార్గిల్ వీరుల తిరుగులేని స్ఫూర్తిని ప్రతిబింబించేందుకు యత్నిస్తుంది. 26 జులై 22న ద్రాస్‌లోని కార్గిల్ యుద్ధ స్మారకం వద్ద ముగిసే ఈ బైక్ ర్యాలీ హర్యానా, పంజాబ్, జమ్ము& కాశ్మీర్, కార్గిల్ ద్వారా ప్రయాణిస్తుంది. గరిష్ట ప్రాంతాలను చుట్టి వచ్చేందుకు ర్యాలీని రెండు బృందాలుగా విభజిస్తున్నారు. వీరు రెండు భిన్న అక్షాల వెంట కదులుతాయి - జొజిలా పాస్ అక్షం, రోహతంగ్ పాస్ అక్షం వెంట ప్రయాణిస్తూ ఒకటి 1400 కిమిల దూరాన్ని, మరొకటి 1700 కిమీలు దూరాన్ని కవర్ చేస్తాయి. ర్యాలీ సందర్భంగా,ఆ మార్గంలో అత్యంత మారుమూల ప్రదేశాలను చేరుకునే యత్నంతో బృందం పర్వత మార్గాలు, క్లిష్టతరమైన మార్గాల ద్వారా ప్రయాణిస్తుంది.
దేశ సేవలో మోహరించిన మన వీర సైనికులు ప్రదర్శించిన పట్టుదల, సంకల్పాన్ని పట్టి చూపుతూ దేశ భక్తి అనే సందేశాన్ని వ్యాపింప చేయడం ర్యాలీ ఉద్దేశ్యం.
***
(Release ID: 1842526)
Visitor Counter : 175