నీతి ఆయోగ్
ఆసియా, ఆఫ్రికాలలో చిరు ధాన్యాల వాడకాన్ని ప్రధాన స్రవంతిలోకి తెచ్చేలా తగిన చొరవను ప్రారంభించనున్న నీతి ఆయోగ్, డబ్ల్యుఎఫ్‌పీ
Posted On:
18 JUL 2022 12:12PM by PIB Hyderabad
ఆసియా, ఆఫ్రికాలలో చిరుధాన్యాల వాడకాన్ని ప్రధాన స్రవంతిలోకి తీసుకురావడానికి గాను అవసరమైన మ్యాపింగ్‌తో పాటు మేటి చర్యలను పంచుకొనేందుకు వీలుగా నీతి ఆయోగ్, ప్రపంచ ఆహార కార్యక్రమ (డబ్ల్యుఎఫ్‌పీ) ఒక వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించనున్నాయి. మంగళవారం (19 జూలై 2022) జరిగే హైబ్రిడ్ కార్యక్రమంలో దీనికి శ్రీకారం చుట్టనున్నారు. నీతి ఆయోగ్, డబ్ల్యుఎఫ్‌పీ భారతదేశం మరియు విదేశాలలో చిరుధాన్యాల ఉత్పత్తి మరియు వినియోగాన్ని పెంచే విషయంలో గల మేటి అభ్యాసాల సంకలనాన్ని సిద్ధం చేస్తాయి. నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ సుమన్ బెరీ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. నీతి ఆయోగ్ సభ్యులు ప్రొఫెసర్ రమేష్ చంద్, సలహాదారు డాక్టర్ నీలం పటేల్, డబ్ల్యుఎఫ్‌పీ ప్రతినిధి భారత దేశపు డైరెక్టర్ బిషో పరాజులి, నేషనల్ రెయిన్‌ఫెడ్ ఏరియా అథారిటీ సీఈఓ డాక్టర్ అశోక్ దల్వాయ్ మరియు వ్యవసాయ మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ శుభా ఠాకూర్ సమక్షంలో సుమన్ బెరీ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఐసీఏఆర్, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన వివిధ శాఖలు, కృషి విజ్ఞాన కేంద్రాలు, పరిశ్రమలు, కేంద్ర, రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, ఎఫ్‌పీఓలు, ఎన్‌జీఓ సంస్థలు, స్టార్టప్‌లు, విద్యా మరియు పరిశోధనా సంస్థలు మరియు ఇంటర్నేషనల్ క్రాప్స్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ది సెమీ-ఎరిడ్ ట్రోపిక్స్
(ఇక్రిశాట్), ఫుడ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఏఓ), ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజీ (ఐసీఐడీ) తదితర అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.
ఈ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారాన్ని : https://youtu.be/31VHDK2bw6A లింక్ ద్వారా వీక్షించవచ్చు.
***
(Release ID: 1842482)
Visitor Counter : 247