భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

షాంఘై సహకార సంస్థతో సహకారాన్ని పెంపొందించుకోవాలని భారతదేశం నిశ్చయించుకుంది: డాక్టర్ మహేంద్ర నాథ్ పాండే


ఉజ్బెకిస్థాన్‌లో జరిగిన షాంఘై సహకార సంస్థ పరిశ్రమల మంత్రుల 2వ సమావేశం


చైనా, కజకిస్తాన్, కిర్గిజిస్తాన్, రష్యా, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్, ఇండియా & పాకిస్థాన్ షాంఘై సహకార సంస్థ లో పూర్తికాల సభ్య దేశాలు

Posted On: 15 JUL 2022 3:12PM by PIB Hyderabad

షాంఘై సహకార సంస్థ (ఎస్సీఓ )తో సహకారాన్ని పెంపొందించుకోవాలని భారతదేశం నిశ్చయించుకుంది. ఉజ్బెకిస్తాన్‌లో జరిగిన షాంఘై సహకార సంస్థ సభ్య దేశాల పరిశ్రమల మంత్రుల 2వ సమావేశానికి వర్చువల్‌గా హాజరైన కేంద్ర భారీ పరిశ్రమల మంత్రి డాక్టర్ మహేంద్ర నాథ్ పాండే ఈ విషయాన్ని చెప్పారు. షాంఘై సహకార సంస్థ  పరిశ్రమల మంత్రుల 2వ సమావేశం ఉజ్బెకిస్తాన్‌లో ఈ రోజు ఉజ్బెకిస్తాన్ ఆతిథ్య దేశంగా జరిగింది. షాంఘై సహకార సంస్థ లో చైనా, కజకిస్తాన్, కిర్గిజిస్థాన్, రష్యా, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్, ఇండియా & పాకిస్థాన్ పూర్తికాల సభ్య దేశాలుగా ఉన్నాయి.  సంస్థలో భారతదేశం చురుకైన, సానుకూల  నిర్మాణాత్మక పాత్రను కొనసాగిస్తుందని మంత్రి ప్రత్యేకంగా చెప్పారు. పరస్పర ప్రయోజనకరమైన అవకాశాలను అన్వేషించడానికి షాంఘై సహకార సంస్థ  సభ్య దేశాల పారిశ్రామికవేత్తలతో సహకరించడానికి భారతదేశం  నిబద్ధతను కూడా ఆయన పునరుద్ఘాటించారు. పరస్పర సహకారంతో కలిసి నడవడం ద్వారా ఈ ప్రాంతంలో సామాజిక-ఆర్థిక, పారిశ్రామిక అభివృద్ధికి కొత్త దిశానిర్దేశం చేయవచ్చని మంత్రి పేర్కొన్నారు. షాంఘై సహకార సంస్థ  ప్రాంతం అభివృద్ధి చెందాలనే కోరిక కారణంగానే, భారతదేశం 'షాంఘై సహకార సంస్థ  సభ్య దేశాల వ్యాపార ప్రపంచాల మధ్య పారిశ్రామిక సహకారాన్ని ప్రోత్సహించడానికి ముసాయిదా కార్యక్రమం,  ప్రదర్శన కార్యక్రమాల నిర్వహణ కోసం నిబంధనలను' సిద్ధం చేసిందని ఆయన అన్నారు. షాంఘై సహకార సంస్థ  సభ్య దేశాల పరిశ్రమ మంత్రుల సెషన్ కూడా ఉంటుందని అన్నారు. భారతదేశంలో  బలమైన పారిశ్రామిక వాతావరణం ఉందని డాక్టర్ పాండే ఉద్ఘాటించారు. కొవిడ్ 19 మహమ్మారి కారణంగా అంతరాయాలు ఉన్నప్పటికీ, 2021–-22లో దాని పనితీరు గణనీయంగా మెరుగుపడిందని పునరుద్ఘాటించారు. భారతదేశ జిడిపిలో మైనింగ్ & క్వారీయింగ్, తయారీ & నిర్మాణాల వాటా ఇప్పుడు 28% అని ఆయన చెప్పారు. తమ ప్రధానమంత్రి స్ఫూర్తిదాయక నాయకత్వంలో ప్రభుత్వం పారిశ్రామిక పునరుజ్జీవనం కోసం సమగ్రమైన కార్యక్రమాన్ని రూపొందించిందని, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సరిగా లేకపోవడం & నిదానంగా ఉన్న వ్యాపార ప్రక్రియల కారణంగా తలెత్తుతున్న దీర్ఘకాలిక అడ్డంకులను తొలగించడం కోసం ప్రభుత్వం ఒక సమగ్ర కార్యక్రమాన్ని రూపొందించిందని ఆయన చెప్పారు. దేశంలో పారిశ్రామిక వాతావరణాన్ని మెరుగుపరచడానికి వివిధ కార్మిక మార్కెట్ సంస్కరణలను కూడా ప్రవేశపెట్టినట్లు ఆయన వివరించారు

****


(Release ID: 1841995) Visitor Counter : 274