ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఒప్పో ఇండియా 4389 కోట్ల రూపాయల మేర కస్టమ్స్ డ్యూటీ ఎగవేతకు పాల్పడినట్టు గుర్తించిన డీఆర్ఐ

Posted On: 13 JUL 2022 12:49PM by PIB Hyderabad

ఒప్పో ఇండియా 4389 కోట్ల రూపాయల మేర కస్టమ్స్ డ్యూటీ ఎగవేతకు పాల్పడినట్టు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ ) గుర్తించింది. చైనాకు  చెందిన "గ్యాంగ్ డాంగ్  ఒప్పో  మొబైల్  టెలీకమ్యూనికేషన్స్  కార్పొరేషన్  లిమిటెడ్ "(ఇకపై ఒప్పో చైనా  'గా ప్రస్తావించబడుతుంది)కు అనుబంధ సంస్థ గా పనిచేస్తున్న  మెస్సర్స్  ఒప్పో  మొబైల్స్  ఇండియా  ప్రైవేట్  లిమిటెడ్  (ఇకపై ఒప్పో  ఇండియా 'గా ప్రస్తావించబడుతుంది) వ్యవహారాలపై దర్యాప్తు చేసిన డీఆర్ఐ ఈ సంస్థ దాదాపు 4,389 కోట్ల రూపాయల మేరకు కస్టమ్స్ సుంకాన్ని చెల్లించకుండా ఎగవేసిందని గుర్తించింది. ఒప్పో ఇండియా భారతదేశంలో మొబైల్ హ్యాండ్‌సెట్లు, మరియు వాటి ఉపకరణాల తయారీఅసెంబ్లింగ్హోల్‌సేల్ వ్యాపారం పంపిణీ వ్యాపార కార్యక్రమాలను నిర్వహిస్తోంది.   ఒప్పోవన్  ప్లస్  మరియు రియల్ మీ తో సహా అనేక బ్రాండ్ల మొబైల్ ఫోన్‌లలో ఒప్పో  ఇండియా లావాదేవీలు జరుపుతోంది. 

ఒప్పో  ఇండియా కార్యకలాపాల పై చేపట్టిన విచారణలో భాగంగా డీఆర్ఐ సంస్థకు చెందిన కార్యాలయాలు, సంస్థకు చెందిన ముఖ అధికారుల నివాసాల్లో సోదాలు నిర్వహించింది. మొబైల్ ఫోన్ల తయారీ కోసం  ఒప్పో  ఇండియా దిగుమతి చేసుకున్న కొన్ని వస్తువుల వివరాలను ఉద్దేశపూర్వక తప్పుగా ప్రకటించిందని వెల్లడించే పత్రాలు,  సాక్ష్యాలను డీఆర్ఐ అధికారులు తమ సోదాల్లో గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. వివరాలను తప్పుగా చూపించిన ఒప్పో  ఇండియా 2,981 కోట్ల రూపాయల వరకు అనర్హమైన సుంకం రాయితీ పొందిందని అధికారులు గుర్తించారు. విచారణలో భాగంగా ఒప్పో  ఇండియాలో పనిచేస్తున్న సీనియర్ అధికారులు, సంస్థకు  పరికరాలు సరఫరా చేస్తున్న సంస్థల ప్రతినిధులను   డీఆర్ఐ అధికారులు ప్రశ్నించి వారి నుంచి వివరాలు రాబట్టారు.  పరికరాలను దిగుమతి చేసుకున్న సమయంలో వాటి వివరాలను తప్పుగా ప్రకటించినట్టు    డీఆర్ఐ అధికారుల ఎదుట  వారు స్వచ్ఛందంగా అంగీకరించారు. 

యాజమాన్య సాంకేతికత/బ్రాండ్/ఐపీఆర్  లైసెన్స్ మొదలైన వాటిని వినియోగించినందుకు   చైనా సహా పలు ప్రాంతాలకు చెందిన   పలు బహుళజాతి కంపెనీలకు ఒప్పో  ఇండియా 'రాయల్టీమరియు 'లైసెన్స్ ఫీజురూపంలో   చెల్లింపులు / కేటాయింపులు చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది.  కస్టమ్స్ చట్టం, 1962లోని సెక్షన్ 14ను ఉల్లంఘిస్తూకస్టమ్స్ వాల్యుయేషన్ (విలువ నిర్ధారణ)  నియమాలు 2007 లోని 10వ నిబంధనతో చదవబడిన కస్టమ్స్ చట్టంలోని సెక్షన్ 14ను ఉల్లంఘిస్తూ ఒప్పో  ఇండియా చెల్లించిన రాయల్టీ మరియు 'లైసెన్స్ ఫీజువారు దిగుమతి చేసుకున్న వస్తువుల లావాదేవీ దిగుమతి చేసుకున్న వస్తువుల విలువ) లో జోడించబడలేదు.  ఈ ఖాతాపై మెసర్స్  ఒప్పో  ఇండియా   1,408 కోట్ల రూపాయల మేరకు సుంకం ఎగవేతకు పాల్పడింది. 

 చెల్లించవలసి ఉన్న  చెల్లించిన కస్టమ్స్ సుంకం మధ్య ఉన్న వ్యత్యాసంగా ఒప్పో  ఇండియా 450 కోట్ల రూపాయల మొత్తాన్ని  స్వచ్ఛందంగా డిపాజిట్ చేసింది.  

 విచారణ పూర్తయిన తర్వాత   4,389 కోట్ల   రూపాయలను  కస్టమ్స్ సుంకంగా చెల్లించాలని  ఒప్పో ఇండియాకు నోటీసులు జారీ అయ్యాయి.   కస్టమ్స్ చట్టం, 1962లోని నిబంధనల ప్రకారం ఒప్పో  ఇండియాదాని ఉద్యోగులు మరియు ఒప్పో  చైనాపై  జరిమానాలను విధిస్తున్నట్టు కూడా  నోటీసులో పేర్కోవడం జరిగింది. 

 

***


(Release ID: 1841217) Visitor Counter : 240